• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ రోజే ధనతెరాస్: ధనత్రయోదశి రోజు ఏమి చేయాలి?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ధన త్రయోదశి అనగా

ఆశ్వీయుజ మాసం కృష్ణ పక్షమిలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అని పేరు.

ఈ ధన త్రయోదశి అనేది యమధర్మరాజునకు ప్రీతికరమైన రోజు.ఈ రోజు ఆయనను పూజించడం వలన మరియు దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగించి నరకలోక ప్రాప్తి లేకుండా చేస్తారు.

ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పసుపునీళ్ళలో శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి పూజించాలి.

Dhanteras 2018: Importance and Significance of Dhanteras festival

పూర్వ కాలంలో హేమరాజు అనే ఒక మహా రాజు ఉండేవాడు. ఆ మహారాజు కొడుకు సులోచనుడు. ఆ సులోచనుడి జాతకం ప్రకారం వివాహమైన నాల్గవ రోజు మృత్యు గండం ఉందని జ్యోతిష పండితులు తెలియజేశారు.ఆ తర్వాత కొంత కాలానికి వివాహ వయస్సు రానే వచ్చింది విధిగా వివాహం చేశారు. ఆ నాలుగో రోజు రానే వచ్చింది ఆ రోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డారు. తనకు ఏమి తెలియని యువరాణి ఎవరో అనుభవజ్ఞులైన పెద్దల సలహామేరకు తన నగలన్నీ తీసి భక్తితో అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమ దీపం వెలిగించి గుమ్మంలో పెట్టింది.

తన భర్తకు ఉన్న మృత్యు దోషం ప్రకారం మృత్యు ఘడియలలో యమ ధర్మరాజు 4 వ రోజున సర్ప రూపంలో వచ్చాడు .ఆ సర్ప రూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగు పెట్టగానే యువరాణి భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి అలంకరణ,యమ దీపం పెట్టడం వలన లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో తనకు అలంకరించిన బంగారు నగల కాంతిని చూసి తన్మయత్వంతో మైమరిచి పోయాడు యముడు.ఈ లోపల సులోచనుడి యొక్క మృత్యు గండ సమయం దాటిపోయి తొలగి పోయింది.

ఆప్పడి నుండి యమ ప్రీత్యర్థం గుమ్మం బయట క్రింద ముగ్గు వేసి యమ దీపం పెట్టి పూజించండం ఆనవాయితిగా వస్తుంది.ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి,అందంగా సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించుకుని లక్ష్మీ పూజ చేసి గోమాతకు అరటిపండ్లు తినిపించిన వారికి అరిష్టాలు తొలగి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కని మార్గంగా సూచింపబడినది ఇలా కొన్ని వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజు ఇది.

ఈ యమ దీపం అనేది విధ్యుత్ దీపంతో కాదు.చక్కగా మట్టితో చేసిన జోడి (రెండు) ప్రమిదలలో మూడు వత్తులు వేసి రెండు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో దీపారధన చేయాలి. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగాపెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య ,భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు లభిస్తాయని విశ్వాసంతో చేస్తూఉంటారు.

ముఖ్యంగా మనం ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటి ఉన్నది.ఈ రోజు బంగారం లేదా కొత్తగా బంగారు ఆభరాణలు కొనాలి అని కొంత మంది తమదగ్గర డబ్బులు లేక పోయిన ఏదో ఒక రకంగా నా నా తంటాలు పడి కొనేస్తుంటారు అది తప్పు.ఇది కేవలం అమ్మ వారిని ఇంట్లో మన శక్తి సామర్ధ్యలకు తగ్గట్టుగా ఇంట్లో ఉన్న పాత బంగారు నగలనే అమ్మవారికి అలంకరించి పూజించడమే ప్రధాన ఉద్యేశ్యం.కొత్తగా కొనాలనేది కాదు.ఈ రూమర్ అనేది కొన్ని నగల వ్యాపారులు వాళ్ళ బిజినెస్ డేవలప్ మెంట్ కొరకు వెసిన ఎత్తుగడే తప్ప మరోకటి కాదు.ఇలా ఒకరిని చూసి మరోకరు అలా అలా అలవాటు పడి అసలు విషయాన్ని పక్కన పెట్టే స్థాయికి చేరుకుంటున్నారు.

ఈ ధన త్రయోదశి రోజు కలిగినంతలోనే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఉన్న నగలను అమ్మవారికి అలంకరించి సాయంకాలం గుమ్మానికి ముగ్గువేసి అలంకరించుకుని దీపారధన చేయడమే ఈ పండగ ప్రత్యేకత.ముత్తైదువలకు తన ఐదోతనం బలపడి కుటుంబానికి మేలు జరుగుతుంది.నేటి నుండి కార్తీక పౌర్ణమి దాటే వరకు సాయం సమయంలో ప్రతీ రోజు గుమ్మం దగ్గర దీపారాధన చేయాలి.సాంప్రదాయాన్ని అనుసరించిన వారికి మేలు జరుగుతుంది.

☘శుభమస్తు☘

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The first day of the Diwali festival is Dhanteras or Dhantrayodashi. On this day Hindus worship the God of wealth, Kubera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more