వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పగ తీర్చుకోవడానికి సంతానంగా పుడతారా?: గత జన్మ కర్మ ఫల భోగము

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

మనకు ఈ మానవ జన్మ అనేది మనం పూర్వజన్మలో చేసిన మంచి చేడు పనుల ఫలితంగానే ప్రస్తుత జన్మలో మనకు తల్లి,
తండ్రి,
అన్న,
అక్క,
భార్య,
భర్త,
ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,
శత్రువులు అనే సంబంధాలు ఏర్పడతాయి.

ఎందుకంటే మనం వీళ్లకు...
ఈ జన్మలో గత జన్మ ఋణం తీర్చుకోవాల్సి ఉంటుంది.

మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు.

మనకు....

పూర్వజన్మలో సంబంధం ఉన్నవాళ్ళే
ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు, అవే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఋణాను బంధం ఏలా ఏర్పడుతుంది అంటే గత జన్మలో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసుకుని వుండచ్చు. లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు.అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో కాని లేదా ఏ దైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ ఉండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు.

శత్రువులు - పుత్రులు అంటే మన పూర్వ జన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు.

Does Karma of our previous lives determine the lifetime?

అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, గొడవలూ చేస్తారు.

జీవిత మంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే వుంటారు.

ఎల్లప్పుడును తల్లితండ్రులను
నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడుతుంటారు.

తటస్థ పుత్రులు
వీళ్ళు తల్లి తండ్రులకు సేవలు చేయరు.మరో వైపు సుఃఖంగా కూడా ఉండ నీయరు,
వాళ్ళను వాళ్ళ మానానికి వది లేసి వెళ్ళిపోతారు.

వారి వివాహానంతరం తల్లి దండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు.

సేవా తత్పరత ఉన్న పుత్రులు

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి ఉండవచ్చును.

ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా కుతూరు రూపంలో ఈ జన్మలో బంధం ఏర్పరచుకుంటారు.అలా వచ్చి తలిదండ్రులకు మంచి సేవలు చేస్తారు.

మీరు గతంలో
ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.

మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే

ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు.

లేక పోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద ఉండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.
అని అను కోవద్దు.

ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును.

ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును.
వాళ్ళే మీ కొడుకు లేదా కూతురుగా
మీ ఇంట పుట్ట వచ్చును.

ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతారు.

లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.

అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడుచేయవద్దు.ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...

దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవం లోకి తెస్తుంది.

మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చేయబడతాయి.

ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయ బడతాయి.అనగా పాప పుణ్యాలు కొద్దిగా ఆలోచించండి
మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.

మళ్లీ ఎంత ధనాన్ని
మీ వెంట తీసు కెళ్తారు.మనం పోయె ముందు బ్యాంకులో ఉన్న నగా,
నట్రా,
డబ్బు అనేవి పూర్తిగా పనికి రాని సంపాదనే కదా ?

మచ్చుకు సంతానం గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ ఏ బంధం అయినా అంతే భార్య,ప్రియురాలు,అక్క చెళ్ళెల్లు,అన్నా తమ్ములు ఇలా ఏ వరసలో చూసిన అంతే మనం గత జన్మలో చేసిన ఫలితంగా బంధాలు ఏర్పడి వాళ్ళ ఋణాను బంధం తీరే వరకు వాళ్ళతో సహవాసం చేయాల్సిందే.అందుకే మనకు అన్ని మంచే జరగాలని కోరుకుంటే ఎవ్వరిని ఇబ్బంది పెట్టవద్దు,ఆశలు పెట్టవద్దు.

మిమ్మల్ని అభిమానించే వారిని గౌరవించండి,మిమల్ని అవమానం ,ఇబ్బంది పెట్టె వాళ్ళను ప్రేమ హృదయంతో క్షమించండి.అక్రమ సంపదన,మోస పూరిత వ్యవహారం మంచిది కాదు.నేను,
నాది,
నీది అన్నది అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది.

ఏది కూడా మన వెంటరాదు.ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య ఫలం వెంట వస్తుంది.
కావున ఎంత వీలయితే అంత మంచి పనులు చేయండి. ఉదారులుగా,సహ్రూదయులుగా జీవించండి జై శ్రీమన్నారాయణ.

English summary
Karma gives the situation, parents, physical body,etc,... to a soul according to type of Karma that it accumulated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X