వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దశ దుర్గుణ హారణమే దసరా..!!

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ

దసరా పండగ ఎలా వచ్చింది అంటే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంలో .. "దశ + హర" పది చెడు గుణాలను హరించిన తర్వాత విజయం తప్పక చేకూరుతుంది, అదే విజయాన్ని ఇచ్చే విజయదశమి అయినది. మానవులలో ఉన్న చెడు గుణాలను తొలగించుకోవాలని ఈ దసరా సందేశం. అందరినీ సమ దృష్టితో చూడామణి, ఆత్మీయంగా కలిసిమెలసి ఉండమని సూచిస్తుంది ఈ దసరా పండగ.

పురాణల ద్వారా దేవ దానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము, గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది.

ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము. 'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుదములను , వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత' దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .

Dussehra is nothing but killing of 10bad habits-details here

"శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి , విజయము పొందినాడు. అదేంటంటే , శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి , నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా , ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని , శ్రీరామునికి విజయాన్ని కలుగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి , విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి. పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

''శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ , అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా , ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా , తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

Dussehra is nothing but killing of 10bad habits-details here

ఈ మంత్రార్థం:- శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనస్సును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు, వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును 'బంగారం' అని చెప్పి పెట్టి , వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.

హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ, ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు, వెండిగా పంచుతూ శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీనినే 'సోనా దేనా' కార్యక్షికమంగా పిలుస్తారు...
ప్రధానంగా జమ్మి, ఆరె ఆకులను పరస్పరం పంచుకొని, కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్షగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం, దీనిని జాతి, కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని, హృదయాల్ని కలిపే సామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.

English summary
Dussehra is nothing but killing of 10bad habits-details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X