వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే దీపావళి లోపుగా పడేయండి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151

దీపావళి అంటే దీపాల పండుగ. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆరోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటుంటారు.దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు.

లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట.విష్ణుమూర్తి సరేనని పంపారు.అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది.

లక్ష్మీదేవికి శుభ్రంగా వున్నఇల్లు అంటే చాలా ఇష్టం.అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

Eco Friendly Deewali: Do and Donts

పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి.ఇంట్లో మంచం విరిగి ఉన్నా వస్తువులు ,శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించాలి.లేకుంటే బయట పడేయాలి.

ఆగిపోయిన గడియారం. విరిగిన గడియారం ఉంటే పడేయాలి. లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. చెద పట్టిన ఫోటోలు,పుస్తకాలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి.

చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి.చిరిగిన,కాలిన బట్టలు పడవేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు. గత యేడాది వాడిన మట్టి దీపాలను మళ్ళీ వాడకూడదు.ఎవరి శక్తికొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.

దీపావళి రోజున ఏ దిశలో లక్ష్మీదేవిని అమర్చుకోవాలి :-

దీపావళి పండుగ అన్ని మతాలు చేసుకునే పండుగ.హిందూలు మాత్రం దీపావళి పండుగను ఘనం జరుగుపుకుంటారు.అందుకు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను ఏ దిశలో అమర్చుకోవాలో తెలియడం లేదు కనుక వాస్తుశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడను పూజించేందుకు ఈశాన్యం లేదా ఉత్తర, తూర్పు దిశగా ఉండేలా చేయాలి.

వాస్తు ప్రకారం దీపావళి ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకుని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. అలానే మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల ఆహారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.

ఉత్తరం దిశలో కుబేర స్థానం చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకోవచ్చు. ఆ లాకర్‌లో లక్ష్మీదేవి ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు శాస్ర్తం సూచిస్తుంది.

దీపావళి రోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు.నిష్టగా లక్ష్మీదేవి పూజిస్తే కోరిన కోరికలను ప్రసాధించే దైవం. లక్ష్మీదేవిని ప్రతిరోజూ ఆరాధిస్తే ధన ధాన్యాలు చేకూరుతాయని విశ్వాసం.మరి దీపావళి రోజున పాటించవలసిన నియమనింబంధనలు తెలుసుకుందాం.

ఉదయం ఐదింటికి నిద్రలేచి స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలానే గడపకు పసుపు ,కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ గదిలో ముగ్గులు తీర్చిదిద్దాలి.ముఖ్యంగా దీపావళి రోజున తెలుపు రంగు బట్టలు దరించడం ఆనవాయితీ.

తరువాత ఆకుపచ్చ రంగుతో గల లక్ష్మీదేవీ పటాన్ని లేదా వెండితో తయారుచేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజకు సిద్ధం చేయాలి.పూజలకు ఎర్రని అంక్షతలు,ఎర్రని పద్మాలు,తెలుపు కలువ పువ్వులు,గులాబీ పువ్వులతో అమ్మవారిని ఆరాధించాలి. నైవేద్యాంగా జామకాయలు, రవ్వలడ్డులు,కేసరి, అరిసెలు వంటి పిండిపదార్థాలు సమర్పించి లక్ష్మీదేవి అష్టకం స్తోత్రాలను పఠించాలి.

అంతే కాకుండా శ్రీ సూక్తము,శ్రీ లక్ష్మీ సహస్రనామం, భాగవతం, కనక ధారాస్తవం వంటి పారాయణ స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధించాలి.అందులో ముఖ్యంగా భాగవతంలోని నరకాసురవధ ఆధ్యాయమును పారాయణం చేయవలసి ఉంటుంది.

దీపావళి నాడు లక్ష్మీదేవిని ధ్యానించి కనకమహాలక్ష్మీదేవి, అష్టలక్ష్మీ దేవాలయం దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని విశ్వాసం.

English summary
Eco Friendly Deewali celebration safe and good for all. In this season, everyone has to keep eye to what to do and what not to do things
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X