• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పునర్వసు కార్తె: ఈ సమయంలోనే రైతులు పంటలు ఎందుకు సాగు చేస్తారు..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేసారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు. తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేసారు. పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు.

జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేసారు. సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.

Farmers start their cultivation based on stars

సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని 'కార్తెలు' వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేసారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతల రూపంలో చెప్పుకున్నారు.

* సామెత:- పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.

* పునర్వసు కార్తెలో చేయవలసిన వ్యవసాయ పనులు:-

* కార్తె ఫలితాలు:- పునర్వసు కార్తె 6 జూలై 2021 మంగళవారం, కృత్తికా నక్షత్రం, ఎలుక వాహనం, ఉదయం 5:17 నిమిషాలకు ప్రవేశం చేయనున్నది. మేఘాధిపతి కుజుడు నీచస్థితిలో ఉన్నందున నైరుతి ప్రారంభమైననూ, మందగమనంతో ఉండటం, ఉపరితల ఆవర్తనాలు, పీడనాలు పూర్తిస్థాయిలో వర్షాన్ని అందివ్వలేవు. జ్యేష్ట అమావాస్య ఆరుద్ర నక్షత్రం తొలకరికి సహకరించును, స్వల్పవృష్టి.

వరి : సార్వా లేక అబి వరినాట్లు, ముందుగా నాటిన వరిలో అంతరకృషి, సస్యరక్షణ.

సజ్జ : రసాయనిక ఎరువులు వేసి పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట.

వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.

ఆముదం : రసాయనిక ఎరువులు వేసి విత్తుట.

మిరప : నారుమళ్లలో విత్తులు జల్లుట.

పసుపు : నాట్లకు భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట, గొప్పు త్రవ్వటం.

పూలు : చేమంతి నారు పోయుట, గులాబి, మల్లె కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.

జొన్న : పునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట. విత్తిన పంటకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.

మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. నెలాఖరులో ఎరువులు వేయుట.

పసుపు : పసుపు నాట్లు.

చెరకు : సస్యరక్షణ, ఎరువులు వేయుట.

పండ్లు : మామిడి, నిమ్మ, నారింజ, అరటి, సపోటాలకు ఎరువులు వేయుట, ద్రాక్ష తీగలను పారించుట, మందులు చల్లుట. జామ, సపోటాలకు అంట్లు కట్టుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు వేయుట.

కొర్ర : ఎరువులు వేయుట, దుక్కి తయారు చేయుట.

వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.

ఆముదం : కలుపు తీయుట, సస్య రక్షణ.

మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ.

కూరగాయలు : చేమ, వంగనాట్లు.

సువాసన మొక్కలు : కామంచి గడ్డి, నిమ్మగడ్డి మొక్కల నాట్లు.

English summary
Our farmers have been cultivating crops without disturbing the balance in nature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X