వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవంతుడికి కొబ్బరికాయ కొట్టే సమయంలో పాటించాల్సిన నియమాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనం పూజ చేసాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న ఆచారం. పూజ పూర్తి అయ్యాక టెంకాయ కొట్టేస్తాము, నైవేద్యం పెట్టెస్తాము, తంతు పూర్తి అయింది అని అనుకుంటాము. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం. అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి....

1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.

2. కాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది.

3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడనవసరం లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో " సర్వం సర్వేశ్వరార్పితం " అని భావంచి పరమాత్మున్ని108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది.

Few rules to be followed while hitting a coconut at the time of Puja

4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు

5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని,కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

6. కొబ్బరికాయ కొట్టిన తరవాత రెండు ముక్కలకు కుంకుమ ,పసుపు లాంటివి బొట్లు పెట్టవద్దు. అలా పెడితే విరుద్ధ పూజ అవుతుంది.

7. కొబ్బరికాయను కొట్టక స్వామి వారికి నివేదన చేసాక తప్పక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచాలి అప్పుడే పుణ్యం లభిస్తుంది.

8. కొబ్బరికాయ పట్టుకుని మొక్కులు మొక్కేప్పుడు జుట్టు దేవుని వైపు పెట్టి మొక్కుకోవాలి , కొట్టేప్పుడు మాత్రం జుట్టు మనవైపు ఉండేలా చూసుకోవాలి.

9. కొబ్బరికాయ కొట్టిన తరవాత అది అడ్డం , నిలువు, తోట్లే మాదిరిగా ఏ విధంగా పగిలినా ఎలాంటి సందేహాలు అనుమానాలు పడవద్దు.

English summary
It is customary for us to worship God with coconut. After completing the puja, we hit the coconut. But there are few rules as how a coconut is to be offered while performing puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X