ఈనెల 28 నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారం చేస్తున్న శుక్రుడు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. అవి కొందరికి కలిసివస్తుంటాయి. మరికొందరికి దురదృష్టం వెక్కిరిస్తుంటుంది. నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి కారకుడు. ఈనెల 28వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అప్పటి నుంచి మే 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఈ ప్రభావంవల్ల నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.

కన్య
వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి మంచి అవకాశాలు వస్తాయి. అదృష్టం తోడుండటంవల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రయాణాలు చేస్తారు. వాటినుంచి లాభాలు వస్తాయి.

four zodiac signs will get huge benefits from january 28th due to venus enter pisces

వృషభం
ధనలాభాలు ఈ రాశివారికి అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించి విజయాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి అన్యోన్యత వెల్లివిరుస్తుంది.

మిథునం
ఈ రాశివారికి శుక్రుడి సంచారం విపరీతంగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలతోపాటు కొత్తవాటిని ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.

కుంభం
ఈ సమయంలో వీరికి డబ్బులు బాగా వస్తాయి. ఉద్యోగస్తులకు వేతనాలు పెరగడంతోపాటు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయికానీ వాటిని జాగ్రత్తగా పెట్టుబడి పెడితేనే నిలుస్తాయి. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లో పనితీరుపై మంచి గౌరవాన్ని అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+