వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మవారు అందరికన్నా ఎలా గొప్ప?: ఆమె నివాస స్థానమేది?

నా రూపాన్నే ధ్యానిస్తూ, నా కొరకే తపిస్తూ, ఆ వచ్చిన ఫలాన్ని కూడా నాకే అర్చిసూ వుంటాడో ఆ భక్తునికి, నాకూ అభేదం. ఇంతటి అనుగ్రహంఅమ్మ భక్తికి ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

పంచాయతన దేవతలుగా గణపతి, సూర్యుడు, విష్ణువు, శివుడు, అంబిక చెప్పబడినారు. అయితే వీరిలో అంబికయే ప్రధానమైనటువంటి దేవత. ఏవిధంగా అంటే బ్రహ్మస్థానంలో చేసినటువంటి పాపాన్ని విష్ణస్థానంలోనూ, విష్ణస్థానంలో చేసినటువంటి పాపాన్ని శివస్థానంలోనూ, శివస్థానంలో చేసినటుంటి పాపాన్ని గురుస్థానంలోనూ, గురుస్థానంలో చేసిన పాపాన్ని దేవీస్థానంలోనూ పోగొట్టుకోవచ్చు.

Recommended Video

న‌వ‌రాత్రుల టైం లో చెయ్యకూడని పనులు ఇవే, చేసారో ఇక మీ పని అయిపోయినట్టే ! | Oneindia Telugu

దేవీస్థానంలో చేసినటువంటి పాపాన్ని ఏవిధంగానైనప్పటికీ కూడా పోగొట్టుకోలేము. అదేవిధంగా లలితాసహస్రనామ స్తోత్ర ఫలశ్రుతిని బట్టి కవులు రచించిన వేయి కవిత్వాలకంటే ఒక విష్ణనామం గొప్పది. వేయి విష్ణునామాలకంటే ఒక శివనామం గొప్పది. వేయి శివనామాల కంటే ఒక్క దేవీనామం గొప్పది అని చెప్పబడింది. అదేవిధంగా ఆదిశక్తి బ్రహ్మనాలుకపై సరస్వతీరూపంలో కొలువై వుండకపోతే విలువలేదు.

శ్రీమహావిషువు హృదయకమలంలో లక్ష్మీరూపంలో కొలువై వుండకపోతే విషువుకు విలువలేదు. పరమేశ్వరుడి అర్ధశరీరంలో గౌరీరూపంలో కొలువై వుండకపోతే పరమేశ్వరుడికి విలువలేదు. త్రిమూర్తులు ముగ్గురూ కూడా త్రిమాతలవల్లే స్థితి, లయాదులు నిర్వహించగలుగుతున్నారు. త్రిమూర్తులే కాదు త్రింశత్కోటి దేవతలు కూడా ఆదిశక్తి అనుగ్రహ విశేషంచేతనే వారివారి ధర్మాలు నిర్వర్తించగలుగుతున్నారు.

Goddesses of Hinduism, Their Symbolism and Significance

అందుచేతనే 'యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమోనమః" అని స్తుతించబడింది. బ్రహ్మ సృష్టించగలిగే శక్తిని కలిగివున్నాడు. విష్ణువు పోషించగలిగే శక్తిని కలిగివున్నాడు. పరమేశ్వరుడు లయం చేయగలిగే శక్తిని కలిగివున్నాడు. ఏమి కలిగివున్నారు 'శక్తిని కలిగివున్నారు. అందుచేత అమ్మ ఆదిశక్తియై జగత్తుకు మూలమైనది.

ఇదేవిధంగా మంత్రరాజం ఏది అనగా గాయత్రీ మహామంత్రం. యంత్రరాజం ఏదనగా శ్రీచక్రమహాయంత్రం, తంత్రరాజం ఏదనగా శ్రీవిద్య వేయిమాటలేల విద్యకావాలంటే ఎవరిని ఆరాధించాలి సరస్వతిని. ఐశ్వర్యం లక్ష్మిని, సౌభాగ్యం కావాలంటే గౌరీదేవిని ఆరాధించి తీరాల్సిందే. దీనినిబట్టి ఆరాధనే ప్రధానం.

ఇంతటి మహాశక్తి అనుగ్రహాన్ని ఏవిధంగా పొందగలము?

అమ్మ భక్తిప్రియ. భక్తివశ్య, భక్తిగమ్య నిర్మల, నిశ్చల, అచంచల భక్తికి ప్రీతినొందుతుంది. అటువంటి భక్తికే వశమ°తుంది. అటువంటి భక్తిమార్గం ద్వారా మాత్రమే అమ్మను చేరుకోగలము. దేవీభాగవతంలో శ్రీమహావిష్ణువు మణిద్వీప చింతామణి గృహంలో అమ్మవారి సందర్శనం చేసుకొని, అమ్మా!

నివాసస్థానమేది?

మణిద్వీపమా? కైలాసమా? వైకుంఠమా? సత్యలోకమా? స్వర్గలోకమా? సిద్దపీఠాలా? ఋష్యాశ్రమాలా? నదీతీరాలా? అరణ్యమధ్యాలా? సముద్రతీరాలా? శిఖరాగ్రరాలా? అని ప్రశ్నించినపుడు ఆ మహాశక్తి చిరునవ్వులు చిందిస్తూ, మహావిష్ణువూ "నిర్మల, నిశ్చల, అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన భక్తుని హృదయ కమలమే నా నివాసస్థానం" అని వక్కాణించింది.

అదేవిధంగా భక్తునియొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఏ భక్తుడైతే నన్నే పూజిస్తూ, నన్నేస్తుతిస్తూ, నా నామాన్నే జపిస్తూ, నా రూపాన్నే ధ్యానిస్తూ, నా కొరకే తపిస్తూ, ఆ వచ్చిన ఫలాన్ని కూడా నాకే అర్చిసూ వుంటాడో ఆ భక్తునికి, నాకూ అభేదం. ఇంతటి అనుగ్రహంఅమ్మ భక్తికి ఇచ్చింది. అందుచేత త్రింశత్కోటి దేవతలకే అమ్మ అనుగ్రహం, అమ్మ భక్తునికే సాధ్యమౌతుంది.

భక్తునికి ఎంత శక్తి వుందంటే భగీరథుడు గంగమ్మను దివినుండి భువికి తెచ్చిన ప్రయత్నంలో ఉన్న సందర్భంలో భూలోకంలోని కలికల్మష నాశనిగా భగీరథుడు అవనిలో అవతరించమని ప్రార్ధిస్తున్నాడు. ఎన్నో పాపకర్మలు చేసిన పాపులు వారియొక్క పాపాలను నాలో వదలివెళ్లినపుడు నేను పొందిన ఆ పాపఫలాన్ని నేను ఏవిధంగా ప్రక్షాళన చేసుకోవాలి అని ప్రశ్నించినపుడు శ్రీకృష్ణభగవానుడు ఒక్క దేవీ భక్తుడు నీలో స్నానమాచరించినా ఆ క్షణంవరకూ పొందిన పాపఫలాన్ని ನಿಪು పోగొట్టుకుందువు. అంటే గంగ పాపాలను సైతం పోగొట్టి, గంగనే పునీతం చేసేటటువంటి మహత్తర శక్తి ఒక్క దేవీ భక్తునికి మాత్రమే చెల్లింది.

English summary
One of the distinctive features of Hinduism is the worship of devis or feminine deities which is a very ancient and popular tradition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X