• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశంలోని ప్రఖ్యాత ఆలయాల వెనుక మేధాశక్తి.. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు , గుడులు ) నిర్మించేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది. ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1. ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడ వీధులకు వచ్చేది 'చిదంబరం' నటరాజస్వామి.

 Great Intellectuality behind Indian Temples.

2. కుంభకోణంలో ఐరావతేశ్వరస్వామి

గుడి తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.

ఒక స్తంభము నుంచి చూస్తె వాలి , సుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుస్తుంది , కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది . ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము నుంచి చూస్తె శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంభము నుంచి చూస్తె వాలి , సుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3. ధర్మపురి ( తమిళనాడు )

మల్లికార్జునస్వామి కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4. కరూర్ ( కోయంబత్తూర్ )

సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5. గరుడుడు నాలుగు కరములతో( చేతులతో ) అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దేవాలయంలో మాత్రమే కనిపిస్తుంది .

6. కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది . అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది. అది నలుగురు మోసే బరువు వుంటుంది.కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటకు వస్తుంటే రాను రాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది.

మళ్ళీ స్వామిగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7. చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది. అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు పంచలోహ విగ్రహము కాదు కేవలం కుంకుమ పువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.

ఆశ్చర్యం కదా!

8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒక బిల్వచెట్టు స్థల వృక్షంగా వుంది. ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది . అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10. విరుదునగర్ ప్రక్కన ధన్పుదూర్ అనే ఊరిలోని తవ ( తపస్ )నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడు వీధుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామ సన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం!

12. వేలూర్ సమీపంలో విరించిపురం

అనే ఊరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు , ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.ఆనాడు సమయాన్ని కనుక్కునేందుకు తయారు చేసిన గడియారం .

13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేద నారాయణ స్వామి కోవెలలో మూల విగ్రహం శిరస్సు నుండి నడుము వరకు మానవ ఆకారం, నడుము నుండి పాదములవరకు మత్స్య ఆకారంలో వుంటుంది.

14. ధర్మపురి ( తమిళనాడు ) పక్కన పదుహారు అంటే పదిమైళ్ళ దూరంలో అభీష్ట వరదస్వామీ అనే విష్ణుగుడిలో నవ గ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.

ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వ కాలంలో ఆగమ విధానంగా కట్టిన దేవాలయాలు చాలానే వున్నాయి.

English summary
Indian Temples are popular worldwide. There is a great Great Intellectuality behind Indian Temples like Kumba Konam, Dharma Puri, Kanoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X