వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురువు ధనస్సు"స్వక్షేత్ర"లో ప్రవేశం.. మీ రాశికి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయో తెలుసా?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - +హైదరాబాద్ - ఫోన్: 9440611151

తేదీ 05 -11- 2019 మంగళవారం రోజు నుండి గురువు స్వక్షేత్రమైన ధనస్సురాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాలలో గురు గ్రహనికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగినది.ఈ గురు గ్రహం శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కింద గుర్తించబడింది. సమస్త శుభకార్యాలకు గురు గ్రహబలమే ప్రధాన కారణం అవుతుంది.

వ్యక్తీ గత జాతకంలో కూడా గురు గ్రహ బలం చాలా ముఖ్యమైనది. విద్యకు, వివాహానికి, అభివృద్దికి, గౌరవ ప్రతిష్టతలకు, పాండిత్యానికి, సువర్ణానికి, దర్పమునకు, నిష్పక్షపాత వైఖరికి గురువే కారణం అవుతాడు.పన్నెండు రాశులు మేషం మొదలుకుని మీనరాశి వరకు మొత్తం రాశి చక్రం ఒకసారి తిరిగి రావడానికి గురు గ్రహానికి 12 సంవత్సరాలు పడుతుంది.అనగా ప్రతి రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు.

 Guruvu Danassu entered into SwaKshetra arena

మానవునికి మార్గదర్శిలాగా జీవితంలో అభివృద్ధి చెందడానికి గురు గ్రహం ఎంతగానో దోహదపడుతూ వ్యక్తి యొక్క తెలివితేటలు జ్ఞానం, దైవచింతన ,అభివృద్ధి ,విజయం ,సంపద,వృత్తి ,అదృష్టం మొదలగునవి గురుగ్రహ శుభ "దృష్టి" అనుగ్రహం మీద ఆధారపడి ఉంటాయి.

మనకున్న పన్నెండు రాశులలో ధనూరాశికి మరియు మీనరాశి రాశులకు గురువునకు స్వస్థానములు అవుతుంది,ఆయా రాశులకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు.గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిని,మకరంలో నీచ స్థితిని పొందుతాడు.వ్యక్తి జాతకంలో గురుడు అనుకూల స్థానంలో ఉంటే కీర్తి ప్రతిష్టలు,సంపద,జ్ఞానము,గౌరవం,సమాజంలో ఉన్నత స్థితి మొదలగునవి పొందగలరు.సంతానము కొరకు గురు అనుగ్రహం తప్పకుండా కావాలి.

ఈ సంవత్సరం గురువు తన స్వంత రాశి అయిన ధనస్సురాశిలోకి 5 నవంబర్ 2019 మంగళవారం రోజు నుండి ప్రవేశిస్తున్నాడు.అక్కడ 2020 మార్చి 29 వరకు ఉంటాడు.ఆ తర్వాత పక్కనే ఉన్న మకరరాశి లోకి వెళ్లి మూడు నెలలు అక్కడ స్థిరంగా ఉండి తర్వాత వక్రీకరించి మళ్లీ 29 జూన్ 2020 ధనస్సురాశిలోకి తిరిగి వస్తాడు.19 నవంబర్ 2020 వరకు ధనస్సురాశి లోనే ఉంటాడు.అనగా ఒక సంవత్సర కాలం ధనస్సురాశి వారు గురుడు ఇచ్చే శుభఫలితాలను పొందగలరు.

సుమారు 5 నెలలు శనితో కలిసి 2 రాశులలో ఫలితాలు ఇస్తాడు.జనవరి 2020 వరకు శనితో కలిసి గురుడు ధనస్సు రాశిలో ఉంటాడు.రాహు,కేతువుల దృష్టి కూడా ఉన్నది.అందు వలన వ్యక్తులలోని నిజమైన మనస్తత్వం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.ధర్మ,కర్మ అధిపతులు నిజాయితీగా వారు చేయవలసిన పనులను నిర్వహించేలా చేస్తారు.

శని నమ్మకస్తుడు అని పేరు ఉన్నవాడు. కర్మ "పని" సమయంలో చేసే వాగ్దానాలను నెరవేర్చే వరకు ఊరుకోడు. అందుకు గురువు సహకరిస్తాడు.మాటలు వ్యవహారాలు, లావాదేవీలు ,ఒడంబడిక మొదలగునవి చూడగలిగే శుక్రుడు కూడా వీరితో కలుస్తారు.అందువలన ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న సమస్యలు ఒక రూపం దాల్చుతాయి అని నమ్మకంగా ఉండవచ్చును. గత పది సంవత్సరాలుగా వివాహం కాని వారికి వివాహాలు,జీవితంలో స్థిరపడని వారికి ఉద్యోగ అవకాశాలు మొదలగునవి ఇప్పుడు ఆశించవచ్చు.కానీ నిబద్ధతతో కొన్ని నివారణలు చేయని వారికి మాత్రం ఫలితాలురావు.

వ్యక్తీ గత జాతకంలోని గోచార గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోవాలి.నడుస్తున్న దశ ,అంతర్ధశ ఫలితాలు కుడా శుభాశుభ ఫలితాలను నిర్దేశిస్తాయి.కావున మీ పుట్టిన తేది ఆధారంగా మంచి అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ వ్యక్తీ గత జాతక ఆధారంగా వారిచ్చె సూచనలు,తరుణోపాయ మార్గాలను అవలంభించండి శుభం కల్గుతుంది.సదవకాశం వచ్చినప్పుడు దానిని వినియోగించుకోవాలి.ఆశ్రద్ధతో కాలాన్ని,సమయాన్ని వృధా చేసుకోకూడదు.

గురువు ద్వాదశ రాశులు,లగ్నముల వారికి గోచార ప్రభావ ఫలితాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం.

గురువు ముఖ్యంగా ఆరు రాశుల/ లగ్నాల వారికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు.
1) మేషరాశి,
2) మిధునరాశి,
౩) సింహరాశి,
4) వృశ్చికరాశి,
5 ) ధస్సురాశి ,
6) కుంభరాశి వారికి.ఇందులో ఎక్కువ శుభఫలితాలు కుంభరాశి,లగ్నం వారికి అత్యంత అనుకూల శుభఫలితాలు ఉంటాయి,రాజయోగాకారకుడు అవుతున్నాడు.

ప్రతికూల ఫలితాలను చవిచూసే రాశుల/లగ్నాల ఆరు రాశుల వారు ఉన్నారు.
1) వృషభరాశి ,
2) కర్కాటకరాశి ,
౩) కన్యారాశి ,
4) తులారాశి ,
5) మకరరాశి ,
6) మీనరాశి వారాలకు కొంత ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి.

* మేషరాశి వారికి 9,12 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.భాగ్యస్తానంలో ఉండడం వలన పూర్వపుణ్య ఫలితాల ఆధారంగా శుభాశుభ ఫలితాలు వర్తిస్తాయి. తండ్రి నుండి ,ఉద్యోగంలో పై అధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్ధికంగా,ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇది ధర్మ స్థానంలో ఉంది ధర్మదేవత అనుకూలతలు కల్గుతాయి. తండ్రి ఆశ్శీస్సులు పుష్కలంగా ఉంటాయి. అన్ని బాగుండేలాగా శుభఫలితాలు వస్తాయి. విదేశాలలో ఉద్యోగాలు,సంపద మొదలైనవి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారటానికి ప్రమోషన్స్ జీతాలు పెరగడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఏర్పడతాయి.ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

* వృషభరాశి వారికి 8,11 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.అష్టమ ప్రభావం ఎక్కువ చూపుతుంది.అధిక శ్రమ,కుటుంబ కలహాలు,అగ్నికి ,దొంగలకు సంబంధించిన విషయాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.అకారణంగా కోపం వస్తుంది దానిని అదుపు చేసుకోవాలి.అనుకోని ఆపదలు,అపనిందలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి.ఒడిదుడుకులు,ఆకస్మాత్తుగా మార్పులు చేర్పులు చేయడం వల్ల ఇబ్బందులు.అపార్థాలు,ధన వ్యయము, అనువంశీక సంపదలు,అనుకోని లాభాలుంటాయి.తల్లి ఆరోగ్యంపై ప్రభావం వుండవచ్చును.

* మిథునరాశి వారికి 7,10 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు. సప్తమ దృష్టి వలన అన్నింటా కలిసి వస్తుంది.ముఖ్య ప్రభుత్వ ఉన్నత అధికారులను కలుస్తారు.వివాహం కాని వారికి ఇది అనుకూల సమయం,కొత్త ఉద్యోగాలు అభివృద్ధి ,అవకాశాలు ,సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు.జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైన సహాయ,సహకారాలు లభిస్తాయి.ప్రజా సంబంధాలు మెరుగు పడతాయి,వ్యాపార భాగస్వాములతో అనుకూలంగా ఉంటుంది.

* కర్కాటకరాశి వారికి 6,9 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు. షష్టమ దృషి వలన ఆనారోగ్యం ,శత్రు,రుణ భాదలు కొంత ఇబ్బందిని కల్గిస్తాయి. జీవిత భాగస్వామి, సంతానం, బంధు,మిత్ర కలహాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహనం పాటించాలి. ఉద్యోగ మార్పు సంభవం ,అగ్ని,చొర, అనుకోని ఆపదలు చవిచూడాల్సి రావచ్చును.చట్టపరమైన చిక్కులు, శిక్షలు ఉండే అవకాశం ఎక్కువ గోచరిస్తున్నాయి.వ్యాపార సంబంధ విషయాలలో కొంత అనుకూలంగా అభివృద్ధి.మాటలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది.

* సింహరాశి వారికి 5,8 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.పంచమ ద్రుష్టితో ఉన్నందున ఈ సంవత్సరం గురుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు.మంచి ఆలోచలు చేస్తారు.సంతాన సాఫల్యం కల్గుతుంది.సంతానం విషయంలో అభివృద్ధి లభిస్తుంది.ఆరోగ్యం సహకరిస్తుంది.అనుకున్న పనులు కార్యరూపం దాల్చుతాయి.ఉద్యోగ అభివృద్ధి ప్రమోషన్లు ఉంటాయి.బంధు,మిత్ర,అనుకూలతలు,ఉన్నత స్థితి ,జీతభత్యాలు పెరుగుదల,సమాజంలో గుర్తింపు మొదలగునవి.ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

* కన్యారాశి వారికి 4,7 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.అర్దాష్టమ గురు ప్రభావం వలన ఉద్యోగ విషయాలలో అభివృద్ధి ఇస్తు ఉన్నా కూడా ఆరోగ్యం విషయంలోనూ, కుటుంబ విషయాలలోనూ జాగ్రత్త పడవలసి వస్తుంది.ఆర్ధిక పరమైన ఇబందులు ఏర్పడతాయి.స్థానబ్రష్టత ,తలకు మించిన ఖర్చులు,ఆత్మీయుల మరణాలు ఉండే అవకాశాలు,బుద్ధిహీనత,స్థాయికి మించి ఊహలు ,ఆలోచనలు మంచివి కావు.విద్యార్థులు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది.ఏకాగ్రతతో చదవండి.అతి స్నేహాలు పనికి రావు.రాజకీయ,సినిమా రంగాల వారు జాగ్రత్తతో వ్యవహారించాలి.

* తులారాశి వారికి 3,6 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.తృతీయ దృష్టి వలన శ్రమ,బంధువైరం,అధిక పౌరుషం,బింకము ఏర్పడుతుంది.ఆకస్మిక ప్రమాద సూచనలు ఆర్ధిక పరమైన అవస్తలు.ఉద్యోగ ,గృహ మార్పు ,అత్యధిక వ్యయం చేయడానికి అవకాశం ఉంది.

* వృశ్చికరాశి వారికి 2,5 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.ద్వితీయ దృష్టి వలన మంచి ఫలితాలు.ఆదాయ అభివృద్ధి.ఉద్యోగ,వ్యాపార లాభాలు.గృహా సౌఖ్యం ,యశోవృద్ధి,సౌభాగ్యం ,ధన లాభం.దాన,ధర్మ కార్యాచరణ ఆత్మీయులకు అండగా నిలుస్తారు.అన్నింటా శుభ ఫలితాలు, సంపద, కుటుంబంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉండడం మరియు ఆరోగ్యముగా ఉండడం.కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి.

* ధనస్సురాశి వారికి 1,4 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.స్వస్థానంలో ఉండటం వలన ఈ సంవత్సరం కాలం అదృష్టంగా గడుస్తుంది.విద్యాపరంగా,ఆర్ధిక పరంగా అనుకూలతలు ఎక్కువ.కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దు కోవడానికి ఉపయోగపడుతుంది.ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది.శాంత స్వభావంతో వ్యవహరిస్తే పరిస్థితులను చక్కబెట్టుకునుటకు ఆస్కారం లభిస్తుంది.

* మకరరాశి వారికి 12,3 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.వ్యయ గురువు అవుతాడు.ఏలినాటి శని ప్రభావం ఉంది అన్నింటా జాగ్రత్తతో వ్యవహారించుకోవల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు.లక్ష్యం సాధించటం కోసం మాత్రమే చూడండి. వేరు దృష్టి వలన మోహము వలన కార్యభంగం.కోపతాపాలకు,తొందరపాటు నిర్ణయాలకు చాన్స్ ఇవ్వకూడదు.కుటుంబ కలహాలు,లేనిపోని మాటలు వినాల్సి వస్తుంది.విదేశీ ప్రయాణాలు ,స్థానభ్రంశం, అభివృద్ధి ఉన్న ఆత్మ సంతృప్తి కనబడదు.శుభకార్యాల వలన ఖర్చులు అధికం,వివాహాల నిర్ణయాలు అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.పెద్దలను గౌరవించండి.భారంగా కాలం గోచరిస్తుంది.

* కుంభరాశి వారికి 11 , 2 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.ధన స్థానంలో ఉండడం వలన వ్యాపార,ఉద్యోగలలో సంతృప్తిని కలిగించే అభివృద్ధి ఉంటుంది.ఈ సంవత్సరం గురు గ్రహం శుభ ఫలితాలనిస్తుంది.పనిలో సంతృప్తి, సంపాదనలో అభివృద్ధి,స్నేహితులతో,కుటుంబ,సమాజ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి.కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి,సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి,అన్నింటా లాభం,కీర్తి ,తేజోవృద్ధి,బలవృద్ది,విజయం కలుగుతుంది.ఈ కాలం సువర్ణమైన అనుకూల వాతావరణం కనబడుతుంది.

* మీనరాశి వారికి 10,1 ఇంటి రాశ్యాధిపతి గురువు అవుతాడు.దశమ దృష్టి వలన కొత్త బాధ్యతలు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు.సంపదలో అధిక ఖర్చులు,ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి.వృధా ప్రయాణాలు,ధన ,ధాన్య వృత్తి భంగం చేసే పనులలో ఆటంకాలు,అంచనాలు,చేయలకున్న పనులు ,ఆలోచనలు తికమక పెడతాయి.

ముఖ్య గమనిక :- వ్యక్తి యొక్క జాతకంలో ఉండే గ్రహస్థితి, నక్షత్రాల ప్రభావం,గ్రహ దశ ,అంతర్దశ వలన ఫలితాలలో తేడా ఉంటుంది.శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు నివారణలు చేస్తూ, గురుగ్రహ అనుకూల శుభ ఫలితాలు పొందుటకు మీ వ్యక్తీ గత జాతక పరిశీలన చేయించుకోండి.మీరు నివసిస్తున్న ఇంట్లో నలుమూలలో పంచలోహ మత్స్యయంత్ర స్థాపన చేయిచుకొండి.గోమాత సహిత భోజపత్ర యంత్ర నవశక్తి యంత్ర నిర్మానిత ఐశ్వర్యకాళీ ఫోటోను మీ ఇళ్ళలో ,వ్యాపార సంస్థలలో పెట్టుకొని పూజిస్తే గ్రహ స్థితి బాగున్న వారికి అభివృద్ధి స్పీడ్ అందుకుంటుంది.గోచార గ్రహస్థితి అనుకూలంలేని వారికి ఆటంకాలను,ఇబ్బందుల నుండి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది.

వీటితో పాటు గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే హయగ్రీవ స్వామిని ,మేధా దక్షిణ మూర్తిని కాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారిని కాని, గురు దత్తాత్రేయస్వామిని కాని ,గురు రాఘవేంద్ర స్వామిని కాని,గురు షిరిడి సాయిబాబాను కాని,గోమాతను కాని,విద్య నేర్పిన గురువులను కాని,తలిదండ్రులను,మీకు ఉపదేశం చేసిన గురువును కాని ,గౌరవించి పూజించి వారికి వస్త దానం చేయండి.ఆవునకు కిలోంపావు నానబెట్టిన శనగలకు సరి సమానంగా బెల్లం పట్టించి అరటి ఆకులో కాని విస్తరి ఆకులో కాని పెట్టి గోమాతకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేయండి.

రామాయణం ,భారత,భాగవత,సుందరకాండ,స్కందపురాణం మొదలైన మహోన్నతమైన గ్రంధాలను చదవండి.మంచిని భోదించే పుస్తకాలు రెండు,మూడు అర్హత కల్గిన వారికి ఇవ్వండి.ఇంకా రెండు జంధ్యాలను,గంధం,పూలు,పండ్లు,నేతితో చేసిన స్వీట్స్ విష్ణువు,శివ ఆలయాలలో కాని గురుతుల్యులైన వారికి ఇస్తే సత్ ఫలితాలు లభిస్తాయి.

English summary
Guruvu Danassu entered into SwaKshetra arena. Now there will effective changes in individuals zodaic signs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X