వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది రోహిణి కార్తె.. భానుడి ప్రతాపానికి రోళ్లు పగలాల్సిందే..! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

|
Google Oneindia TeluguNews

రోహిణి కార్తె - సర్వేజనా: సుఖినోభవంతు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

రోహిణి కార్తె వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూనే ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్ద మానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు అదరగొడుతాయి.

 15 రోజుల పాటు సూర్యడి భగభగలు

15 రోజుల పాటు సూర్యడి భగభగలు

ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం, తేదీ మే 25 సోమవారం నుండి 8 జూన్ సోమవారం 2020 వరకు 15 రోజుల పాటు రోహిణి కార్తె ఉంటుంది. పంచాంగం ప్రకారం ఈ రోహిణి కార్తె సోమవారం రోజు ఉదయం 6:39 నిమిషాలకు రవి నిరయన రోహిణి కార్తె ప్రవేశం చేస్తుంది. ప్రవేశ సమయంలో ఆరుద్ర నక్షత్రం, మిధునలగ్నం, వరుణ మండలం, పాదజలరాశి, పుం-స్త్రీయోగం, మండూక వాహనం, రవ్యాది గ్రహములు వాయు, సౌమ్య, జల, దహ, రస, జలనాడీచారము మొదలగు శుభాశుభయోగాములచే 25, 26 ఎండ, వేడి అధికం, 27, 28 ఖండ వర్షయోగములు, 29 వాతావరణంలో మార్పు, 30, 31 మేఘ గర్జనలు, 1, 2 రాత్రులందు గాలులు, 3 వాతావరణంలో మార్పు, వాయుచలనము, ఇతరత్రా జల్లులు 6 వాతావరణంలో మార్పులు, 7 మేఘాడంబరము, వాయు చలనము స్వల్ప జల్లులు పడినను ఎండ, ఉక్కపోత అధికంగా ఉంటుంది.

 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

రోహిణి కార్తె ఫలితంగా ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. వేడిని కలిగించే మసాల పదార్ధాలకు సంబంధించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు ,పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు. నీళ్ళ సౌకర్యం ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సులవారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి, తెల్లని రంగు కల్గినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.

Recommended Video

గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత
 పశు పక్ష్యాదులకు నీరు అందించండి

పశు పక్ష్యాదులకు నీరు అందించండి

ముఖ్యంగా మన సాటి జీవులైన పశు, పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.

English summary
Heat waves in this summer will be high as it is Rohini month according to Telugu Calendar.This heat waves will continue for 15 days from May 25th Monday to June 8th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X