వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరక చతుర్దశి: అలా చేస్తే.. నరకం నుండి స్వర్గానికి వెళ్తారని శాస్త్రవాక్యం

శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించి అదితి కుండలాలను తిరిగి ఆమె కప్పగించి, 16 వేల మందిని కన్యలను వివాహం చేసుకుంటాడు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

The Story Of Diwali Festival "దీపావళి" విశిష్టత.. | Oneindia Telugu

నరకుని సంహరించినట్లు వంటి చతుర్దశి కావడం కారణంగా ఈ రోజు నరకచతుర్దశి అని పేరు వచ్చింది.

నరక చతుర్దశికి గల పేర్లు ప్రయత్న చతుర్దశి, కాలా చౌదస్, కాళ చతుర్దశి, అంధకార చతుర్దశి అనే కొన్ని వీరు వ్యవహారంలో ఉన్నాయి.

నరకంలో నివసించిన పూర్వీకులకు పుణ్యలోకం కలిగింప చేయడానికి, లేదా తమ తమ జీవితాల్లో ఇది నరకం అనే ప్రస్తావన రాకుండా జరిపే ఒక ఉత్సవంగా కూడా ఈ రోజున చెబుతారు శాస్త్రవచనం

చతుర్దశి నాడు ఎవరైతే నరకంలో ఉండే వాళ్ల కోసం దీపాలు పెడతారో వాళ్లకి నరకం నుండి స్వర్గానికి వెళతారని శాస్త్రవాక్యం.

Here's everything You Need To Know About Naraka Chaturdashi or Choti Diwali

ప్రతి పండుగలోని విధంగానే ఈ రోజు కూడా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయడం ఇందులో విశేషం. అయితే సూర్యోదయానంతరము స్నానం చేసే వారు నరకానికి వెళతారని ఒక ప్రతీతి. అతనిలోనూ అమావాస్య రెండు రోజుల ముందు మాస శివరాత్రిగా నడుపుతారు.

అమావాస్యనాడు శుక్రవారంనాడు తలస్నానం చేయకూడదు అని ఒక మాట ఉంది. అయితే ఈ రోజు తలస్నానం చేయకూడదు అనేది మొదటి నియమం లేదు.

ఈరోజు తలంటుకోవడం విశేషం

నువ్వుల నూనెతో ఈరోజు తలంటుకోవాలి. అమావాస్య రోజుల్లో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఆవహించి ఉంటుందని ఒక ప్రతీతి. ఈరోజు నీటిలో గంగాదేవి ఆవహించి ఉండడం చేత తలస్నానం చేయడం గంగా దేవి అనుగ్రహం కూడా పొందినట్లు అవుతుంది.
యమ తర్పణం

ఈరోజు యమున్ని స్మరించడం, ఉత్తరేణి ఆకులను తలమీద ధరించి స్నానం చేయడం, యముని స్మరించి తర్పణ ఇవ్వడం యమ బాధ లేకుండా చేస్తాయి. దేవుడికి సంబంధించిన ఈ నామాలతో అర్చించడం అనుగ్రహ కారకం.

యమాయ నమః మృత్యవే నమః వైవస్వతాయ నమః సర్వ భూత ప్రదాయైనమః ఘనాయ నమః పరమేష్టినే నమః చిత్రాయ నమః ధర్మరాజాయ నమః అంతకాయ నమః కాలాయ నమః గౌతమ వరాయ నమః నీలాయ నమః వృకో దరాయ నమః చిత్రగుప్తాయ నమః అనేవి యమ సంబంధ నామాలు
వీటిలో ఒక్కొక్క నామాన్ని స్మరించి నువ్వులతో నీరుని వదిలిపెట్టాలి.

దీపదానం

దీపదానం నరకంలో ఉండే వాళ్లకి వెలుతురుని ఇవ్వటానికి, యమ మార్గంలో వెళ్లే బాధ లేకుండా పుణ్యాన్ని పెంచడానికి ఈ రోజు దీప దానం ఇస్తారు. ఎవరని తలచుకొని దీపారాధన చేస్తాము వారిని ఆ దీపము యొక్క వెలుగు చేరుకుంటుందని ప్రతీతి

పురాణగాథ

ప్రాగ్జోతిషపురం రాజైన నరకుడు అదితి కుండలాలను, పదహారు వేలమంది రాజకన్యలను, భూలోక వాసుల ఐశ్వర్యాలను దేవతల సంతోషాన్ని హరిస్తాడు. ఇతనిని సంహరించడాని సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు వెళ్లి యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో సత్యభామాదేవి నరకాసురుని సంహరించడం విశేషం.

ఆ ఫలితంగా సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించి అదితి కుండలాలను తిరిగి ఆమె కప్పగించి, 16 వేల మందిని కన్యలను వివాహం చేసుకుంటాడు. జైత్రయాత్ర గా తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు మరెన్నో విజయాలను పొందడానికి ఈ రోజు ఒక ఆరంభంగా భావిస్తారు. కొన్ని గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించక ముందు నుంచే రావణవధ కారణంగా ఈ దీపావళి అనే పండగ ముందునుంచే ఉన్నట్లుగా చెబుతారు.
ఏదిఏమైనా ఈ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అందరి ఇంట సిరి సంపదలు వర్ధిల్లాలని ఆశిస్తున్నాను.

English summary
The 5 day festival, Diwali is almost here. People are right now busy cleaning up their houses and shopping for new clothes, accessories and home decor. Diwali starts from tomorrow that is October 17th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X