వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేనె ప్రకృతి ఇచ్చిన బహుమానం... ఇందులోని ఔషధ గుణాలు తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ప్రకృతిలో విరభూసిన పువ్వుల నుండి మకరందాన్ని తేనెటీగలు సేకరించి మనకు అందిస్తున్నాయి. తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు.

వ్యాధి నివారణకు తేనె ప్రాచుర్యం

వ్యాధి నివారణకు తేనె ప్రాచుర్యం

ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా, ఔషధాలకి అనుపానంగా, సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది. చలువ చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది. నేత్రములకు మంచిది. చర్మానికి కాంతిని కలిగించును. శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును. ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు.

 శరీరంకు కావాల్సిన పోషక పదార్థాలు

శరీరంకు కావాల్సిన పోషక పదార్థాలు

స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు, ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును .

రక్తపోటుకు తేనె మంచి ఔషదం

రక్తపోటుకు తేనె మంచి ఔషదం

పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము, పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును .

 సౌందర్యంను పెంచడంలో తేనె పాత్ర

సౌందర్యంను పెంచడంలో తేనె పాత్ర


సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును.

చిన్నపిల్లలకు తేనె ఇస్తే ఉపయోగం

చిన్నపిల్లలకు తేనె ఇస్తే ఉపయోగం


ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం. ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును. ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. ఈ విధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు. ఎవరికైనా పిల్లలకు చదువు సరిగా రాని వారికి తేనెతో శివలింగానికి అభిషేకం చేసి ఆ తేనెను ఆవు పాలలో కలిపి పిల్లవాడిచే త్రాగిస్తే జ్ఞాపకశక్తి పెరిగి చదివే విద్యపై ఆసక్తి కలుగుతుంది.

English summary
Honey is a wonderful gift of nature to man. Honey has many nutritional and medicinal properties in addition to sweetness. It is called Madhu because it means sweetness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X