వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020లో వ్యాపారస్తుల రాశిఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

గ్రహగమనాలు :- 24 జనవరి 2020 న శని ధనుస్సు నుండి మకరరాశికి ప్రయాణం అవుతుంది.ఇది మే 11, 2020 నుండి సెప్టెంబర్ 29, 2020 వరకు వ్యతిరేకదిశలో తిరుగుతూ వెళ్తుంది.

బృహస్పతి 2020 మార్చి 29 న మకరరాశి లోకి ప్రవేశిస్తుంది ,ఆ తర్వాత మళ్ళీ జూన్ 30, 2020 న ధనుస్సులోకి ప్రయాణం అవుతుంది. ఇది 2020 మే 14 నుండి 2020 సెప్టెంబర్ 13 వరకు తిరోగమనంగా ప్రయాణం అవుతుంది. ఈ పెద్ద గ్రహాలతో పాటు రాహు మరియు కేతు కూడా వారి స్థానాలను మార్చుకుంటూ మిధునరాశి నుండి వృషభరాశి నుండి ధనుస్సురాశి నుండి వృశ్చికరాశి వరకు ప్రయాణం అవుతాయి. ఇది 2020 సవంత్సరంలో ఒక ముఖ్యమైన కదలికగా చెప్పవచ్చు. ఈ గమనంలో ఈ గ్రహాలు మీ జీవిత పరిణామక్రమాన్ని పూర్తిగా తెలియజేస్తాయి. అయితే మీ జాతక చక్రములో చంద్రుని ఆధారంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీ జాతకం ప్రకారం ఏలా ఉందో మీకు మార్గనిర్దేశం చేయడానికి మేము ఇక్కడ ప్రయత్నించాము.

 మేషరాశి ఫలితాలు

మేషరాశి ఫలితాలు

2020 సంవత్సర ప్రారంభంలో ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి నెలలో భారీగా ఆర్దిక లాభాలు కనబడుతాయి. దీనితో మీరు అనుకున్న పనులు అన్ని విధాల ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు ఈ సమయంలో మీ సంపద అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ సంత్సరం విదేశి వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తు బాగుంటుంది మరియు స్థిరత్వం కలుగుతుంది.

వృషభరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

2020 సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఊహించినవి , ఊ హిచని లాభాలు కలుగుతాయి. వారసత్వ సంపద లేదా ఏదైనా ఆకస్మిక లాభాలు లేదా రావు అనుకున్న డబ్బు రావడం ద్వారా లాభాలు కలగవచ్చును. నవంబరులో రాహువు మీ జాతకంలో మిధునరాశి నుండి వృషభరాశికి వెళ్ళినప్పుడు సంపద విషయంలో అనుకూలమైన ఫలితాలను చూస్తారు. ఈ సంవత్సరంలో భాగస్వామ్య వ్యాపారాలలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవాలి లేకపోతే ఆర్థిక పరంగా నష్టపోతారు.

మిధునరాశి ఫలితాలు

మిధునరాశి ఫలితాలు

2020 ఈ సంవత్సరం వ్యాపార రొటేషన్ విషయంలో డబ్బు మీకు కొంత ఇబ్బంది అవుతుంది. రాహువు స్థాన ఫలితంగా మీరు అనుకున్న ఫలితాలను దక్కనివ్వడు. శని ప్రవేశంతో సంపదకు అవరోధాలను కలిగిస్తాడు. వ్యాపారాలలో భాగస్వామ్యం వద్దు మార్చి మరియు మే నెలలలో కొంచం ఎక్కువ శ్రద్ద పెట్టవలిసి ఉంటుంది. ఇనుము , పత్తి, నూనె వ్యాపారలో జాగ్రత్త అవసరం. శని దేవుడు ఎనిమిదవ స్థానానికి చేరుకున్నప్పుడు అదృష్టం కూడా కలిసిరాదు. మీరు చేస్తున్న ఏ వ్యాపారం అయిన అధిక పెట్టుబడులతో కాకుండా జాగ్రత్త పడాలి. పొత్తులతో కూడుకున్న వ్యాపారాలలో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొండి. మీ జాతకం రిత్య శని గ్రహ రేమిడి పాలో అవుతే కొంత ఊరట లభిస్తుంది.

 కర్కటరాశి ఫలితాలు

కర్కటరాశి ఫలితాలు

2020 మీకు ఈ సంవత్సరంలో అనుకోని వారసత్వ సంపదలు మరియు వ్యాపార ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం జులై - ఆగష్టు నెలల్లో విదేశీ వాణిజ్య వ్యాపారస్తులకు మంచి ఆదాయాన్ని ఉంటుంది. సంవత్సరం మొదటిలో మీ ఆర్థిక సంపాదన బాగుంటుంది. శుక్రుడు మీ పదకొండవ స్థానంలో నుండి ఏడవ స్థానానికి చేరుకొంటాడు. ఈ సంవత్సరం మార్చి - జూలై నెలల్లో ఆర్ధిక రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సింహరాశి ఫలితాలు 2020

సింహరాశి ఫలితాలు 2020

సంవత్సరం ఆర్థిక మరియు వ్యాపారం వంటి రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం బాగుంది. మీరు జీతంలో అభివృద్ధిని పొందవచ్చు లేదా మీ సామర్థ్యం వల్ల అదనపు డబ్బు సంపాదించవచ్చును. మీ వ్యాపార శత్రువులపై విజయం సాధించే సంకేతాలను చూపిస్తుంది. ఈ సంవత్సరం మీ దీర్ఘకాలిక కోరికైన వ్యాపార అభివృద్ధి నెరవేరవచ్చు. మీరు ఈ సమయంలో ఎలక్ట్రానిక్ లేదా హార్డ్వేర్ వ్యాపారాలు చేస్తున్నట్లైతే మీరు మరింత విజయాన్ని పొందతారు .

కన్యరాశి ఫలితాలు

కన్యరాశి ఫలితాలు

2020 సంవత్సరం ఫిబ్రవరిలో మీరు వ్యాపారాన్ని మార్చుకొనే అవకాశం వుంటుంది. మీకు ఈ సంవత్సరం అధిక ఆదాయం రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా పొందవచ్చును. కన్యారాశి వారు ఈ సంవత్సరం వ్యాపార ప్రగతి పరంగా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహకారాన్ని పొందుతారు మరియు మార్చి - మే నెలలో సంపదలను కూడా సంపాదిస్తారు. మీకు సొంత వ్యాపారం ఉన్నట్లయితే మీరు కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆ వ్యాపారాన్ని యుక్తితో అభివృద్ధి చేసుకుంటారు. ముఖ్యంగా మార్చి - మే నెల్లలో మీరు మీకు కావలిసిన ఫలితాలను పొందుతారు.

 తులరాశి ఫలితాలు

తులరాశి ఫలితాలు

2020 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన, వ్యాపారం సంవత్సర ప్రారంభంలో మీ రెండవ స్థానంలో కుజ గ్రహం ఉండడం కారణంగా వ్యాపార అభివృద్ధి కొరకు చాలా ఖర్చు చేస్తారు. అయితే మీకు డబ్బులు అనేవి వస్తూ, పోతూ వుంటాయి. మీరు ఏ విధమైన పెట్టుబడులు పెట్టడానికైనా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు అదృష్టం సంవత్సరం మొత్తం తోడుగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి నెలలో మీ ఆరవ స్థానం కారణంగా ఏడాది పొడవునా శనిచేత ప్రయోజనం పొందుతారు.

వృశ్చికరాశి ఫలితాలు

వృశ్చికరాశి ఫలితాలు

2020 సంవత్సరం శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక, వ్యాపార మరియు వృత్తి జీవన పరంగా అనుకున్న ఫలితాలను పొందుతారు. 2020 సంవత్సరం ప్రారంభంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శని మరియు గురు గ్రహాలు రెండవ స్థానంలో ప్రవేశం చేస్తున్నాయి, దీని ప్రభావం వలన మీరు ఆర్థికంగా కొంత నష్టాలను చవి చూస్తారు. ఈ సంవంత్సరం అప్పులతో వ్యాపారాలు మొదలు పెట్టడం అనేది అంత మంచి ఆలోచన కాదు. రాహు గ్రహం మీ ఏడవ స్థానంలో చేరుకోవడం వలన మీరు సెప్టెంబర్ నెలలో కొంత వ్యవహార ఒత్తిడికి అవుతారు. గురుడు మీ జాతక చక్రంలో ఎక్కువ కాలం మీ రెండవ స్థానంలోనే ఉంటాడు, దీని ప్రభావంతో మీకు సంవత్సరం పొడవునా ధనం ప్రాప్తిస్తుంది. 2020 సంవత్సరం వృశ్చికరాశి వారి వ్యక్తిగత జాతకచక్రం ప్రకారం వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనుస్సురాశి ఫలితాలు

ధనుస్సురాశి ఫలితాలు

2020 సంవంత్సరంలో వ్యాపారంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఆర్థిక పరమైన ఎదుగుదలను కూడా ఆశించవచ్చును. ఏప్రిల్ - మే మరియు ఆగస్టు నెలలలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ సంవత్సరంలో వృత్తి పరమైన జీవితంలో గొప్ప ఫలితాలు అందుతాయి. మీ ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. జనవరి నెలలో వ్యాపార విజయాల కోసం ఎక్కువ కృషి చేయవలిసి ఉంటుంది. గురు గ్రహం ఈ సంవత్సరంలో మీ ఒకటవ స్థానంలో ప్రవేశంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. గురు గ్రహం మీ తొమ్మిదవ స్థానంలో సానుకూలంగా చూడడం కారణంగా ఆధ్యాత్మిక, వైద్యం, ఔషధం మొదలైన రంగాలలో వృత్తికి కొంత ఏక్కువ ప్రాముఖ్యం ఇవ్వవచ్చును. గురువు వలన వ్యాపార ఆనందం, శ్రేయస్సునకు అనుకూలుడుగా ఉంటాడు.

మకరరాశి ఫలితాలు

మకరరాశి ఫలితాలు

2020 సంవత్సరంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో వృత్తి మరియు వ్యాపార రంగాలలో శుభ ఫలితాలను ఆశించవచ్చును. మీ లగ్న స్థానంలోని గ్రహం మరియు రెండవ స్థానంలో గ్రహం శని మొదట మీ పన్నెండవ స్థానంలో నుండి పరస్పర దృష్టి వలన ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక అంశాలకు అదృష్టం కాకపోవచ్చును. మీరు డబ్బు పెట్టుబడి పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. మీ పదకొండవ స్థానంలో కుజ గ్రహం, ఆరవ స్థానంలో రాహువు వలన మంచి కలయిక మీకు వృత్తి పరంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరంలో మీ విదేశీ వాణిజ్యం మరియు సంబంధాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం మార్చి నెల మరియు మే నెలలో వృత్తి జీవితం చాలా బాగా అభివృద్ది చెందుతుంది.

 కుంభరాశి ఫలితాలు

కుంభరాశి ఫలితాలు

2020 ఈ సంవత్సరం మీ పన్నెండవ స్థానంలో శని ప్రవేశం నుండి మీరు రోజు వారీ ఆదాయం అనుకూలంగా ఉండకపోవచ్చును. ఖర్చులను అధికం చేస్తుంది. వాస్తవానికి ఇలా ఉన్నప్పటికీ మీరు మీ డబ్బును ఆదా చేసుకోగలుగుతారు మరియు కొంత సంపదను పొందుపరుచుకొంటారు. వ్యాపార విషయాలను అనుభవం ఉన్నవారితో చర్చించండి. గురువు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి ఆర్థిక రాబడులు వచ్చే అవకాశాలు బలీయంగా ఉన్నాయి. సొంత వ్యాపారాన్ని చేస్తున్నట్లు అయితే మీరు తొందరపాటు ఆలోచన చేయకుండా నిర్ణయాలను తీసుకోవద్దు. ఈ సంవత్సరం మధ్యలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని కోసం మీరు ఆయా రంగలలోని నిపుణులైన వారిని సంప్రదించి నిర్ణయాలను తీసుకోండి.

మీనరాశి ఫలితాలు

మీనరాశి ఫలితాలు

2020 సంవత్సరంలో వృత్తి పరమైన, ఆర్థిక, వ్యాపార పరమైన వివిధ అంశాలలో మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ సంవత్సరం మార్చి లేదా మే నెలలో ప్రమోషన్ తో బదిలీ కావచ్చును. ఆధునిక వ్యాపార ప్రయత్నాలతో విజయాలను పొందుతారు. సొంత వ్యాపారం ఉన్నట్లు ఐతే ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు. విదేశీ వనరుల నుండి కూడా ఆదాయాన్ని పొందవచ్చును. ఈ సంవత్సరం వ్యాపార వ్యవహారాలలో విజయాలను చవి చూడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్తగా ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించే వారికి లాభాలు పొందుతారు. గురు, శని మరియు కుజ గ్రహం కారణంగా వారి లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులు అన్ని పనులలో మీకు సహయ సహాకారాన్ని అందిస్తారు.

English summary
News year 2020 predictions is feel good for everyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X