వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమికులకు 2020 సం.రంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జై శ్రీమన్నారాయణ.

గ్రహగమనాలు :- 24 జనవరి 2020 న శని ధనుస్సు నుండి మకరరాశికి ప్రయాణం అవుతుంది. ఇది మే 11, 2020 నుండి సెప్టెంబర్ 29, 2020 వరకు వ్యతిరేకదిశలో తిరుగుతూ వెళ్తుంది.

బృహస్పతి 2020 మార్చి 29 న మకరరాశి లోకి ప్రవేశిస్తుంది ,ఆ తర్వాత మళ్ళీ జూన్ 30, 2020 న ధనుస్సులోకి ప్రయాణం అవుతుంది. ఇది 2020 మే 14 నుండి 2020 సెప్టెంబర్ 13 వరకు తిరోగమనంగా ప్రయాణం అవుతుంది. ఈ పెద్ద గ్రహాలతో పాటు రాహు మరియు కేతు కూడా వారి స్థానాలను మార్చుకుంటూ మిధునరాశి నుండి వృషభరాశి నుండి ధనుస్సురాశి నుండి వృశ్చికరాశి వరకు ప్రయాణం అవుతాయి. ఇది 2020 సవంత్సరంలో ఒక ముఖ్యమైన కదలికగా చెప్పవచ్చు. ఈ గమనంలో ఈ గ్రహాలు మీ జీవిత పరిణామక్రమాన్ని పూర్తిగా తెలియజేస్తాయి. అయితే మీ జాతక చక్రములో చంద్రుని ఆధారంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీ జాతకం ప్రకారం ఏలా ఉందో మీకు మార్గనిర్దేశం చేయడానికి మేము ఇక్కడ ప్రయత్నించాము.

మేషరాశి ఫలితాలు 2020

మేషరాశి ఫలితాలు 2020

సంవత్సరంలో మానసిక లాభాలను పొందుతారు. ఈ సంవత్సరం ప్రేమ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనితో మీరు అనుకున్న పనులు అన్ని విధాలుగా పొందుతారు. మీ మనస్సు రహస్యమైన కార్యలపై మొగ్గు చూపుతుంది.శని మకరరాశి నుండి మారినప్పుడు. ప్రేమ జీవితం బాగుంటుంది మరియు స్థిరత్వం కలుగుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశివారు ప్రేమ పెళ్ళి కోసం ప్రయత్నాలు చేస్తే వారు మంచి ఫలితాలను పొందుతారు. నవంబరు - డిసెంబరు నెలలలో మీ ఇంట్లో మంగళ ప్రదమైన కార్యం జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రేమ మరియు అన్యోన్యతలకు మంచిది.

 వృషభరాశి ఫలితాలు

వృషభరాశి ఫలితాలు

2020 సంవత్సరం మితంగా ఉంటుంది. శని తన స్వస్థానమైన మకరరాశిలో ఉండటం, రాహువు మిధునరాశి నుండి వృషభరాశికిలో ఉండడం వలన ఈ సంవత్సరం వృషభరాశి వారికి ప్రేమ పరంగా అనుకున్న ఫలితాలు దక్కక పోవచ్చును .
సంవత్సరం మొదటి నుండి చివరి వరకు మీ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంవత్సరంలో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఎక్కువ ఇబ్బందులు అనేవి మీ మాటల దోరణి, స్వభావంలో కనబడతాయి. ఓపిక ఒద్దికతో ఉంటే అనుకున్న పనులు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ మనో వాంఛ నెరవేర గలవు.

మిధునరాశి ఫలితాలు

మిధునరాశి ఫలితాలు

2020 ఈ సంవత్సరం జాతక చక్రములో ఉన్న రాహువు మీరు అనుకున్న కోరికలను దక్కనివ్వడు. శని 24 జనవరి 2020 నుండి ప్రారంభం అవుతుంది. ఇది మీ భవిషత్తుకి మరియు ప్రేమ జీవితానికి అవరోధాలను కలిగిస్తుంది. మిధునరాశి వారి జాతక ప్రకారం 2020 సంవత్సరంలో మీరు మీ పెద్దల నుండి చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. శని దేవుడు ఎనిమిదవ స్థానానికి చేరుకున్నప్పుడు అదృష్టం కూడా కలిసిరాదు, అపకీర్తి ,నిందలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్త్రలు తీసుకొండి. మీకు నచ్చిన వారి దగ్గర ప్రేమను సంపాదించడానికి మరింత కృషి చేయవలిసి ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఇది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ సంబందాలను బలపరుస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ప్రేమ విషయంలో కొంత అనుకూలంగా లేకపోయినా సంవత్సరం ముగింపు సమయంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది.

కర్కటరాశి ఫలితాలు 2020 :-

కర్కటరాశి ఫలితాలు 2020 :-

మీ ఆరవ స్థానంలో రెండు గ్రహాలు, రెండవ స్థానాన్ని కలిగివున్న సూర్యుని యొక్క స్థాన ఫలితంగా 2020 సంవత్సరం ప్రారంభం మీకు ప్రేమ వ్యవహారంలో మంచి జరుగకపోవచ్చును. ఈ సంవంత్సరం కర్కాటకరాశి వారు ఏవరైతే వారికి నచ్చిన వారిని వివాహం చేసుకుందాం అనుకొంటారో వారికి ఈ సంవత్సరం మధ్యభాగం నుండి అనుకూలంగా ఉంటుంది.
ఈ సమయంలో మీ కుటుంబంలోకి ఒక కొత్త శిశువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జులై - ఆగష్టు నెలలో ప్రేమ వ్యవహారంలో అంత అనుకూలముగా ఉండదు.సెప్టెంబర్ మధ్యలో అయితే మీరు ఆశించిన ఫలితాలను పొందవచ్చును .

సింహరాశి ఫలితాలు

సింహరాశి ఫలితాలు

2020 సంవత్సరం మొత్తం అదృష్టం అనే చెప్పుకోవాలి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు ఐతే వారు మిమ్మల్ని సంవత్సరం చివరిలో ప్రేమించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా వివాహం అయిన వారికి కుటుంబ జీవితం మీకు నచ్చినట్లు అనుకూలంగా ఉండదు. మీ ప్రేమ విషయంలో ఆత్మీయ సన్నిహిత మిత్రులు మీకు సహాయం చేస్తాను మరియు లాభదాయకమైన ఆలోచనలను చెప్తారు. ప్రేమకు సంబంధించి విషయాలలో ఈ సంవత్సరం బాగుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చుకుని సంత్రప్తిని పొందవచ్చును. ప్రేమ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మొదటి కొన్ని నెలల్లో మరియు తరువాత జూన్ తరువాత పిల్లలను ఆశించవచ్చును. 2020 సంవత్సరంలో మీ ప్రేమ జీవితం మీకు అనుకూల పరిస్థితులను అందించదు.

కన్యరాశి ఫలితాలు

కన్యరాశి ఫలితాలు

2020 లో బాగుంది. ప్రేమ విషయలో చాలా అనుకూలంగా వుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ఈ సంవత్సరం మీ సంతోషం మీ జీవిత భాగస్వామి నుండి కలుగుతుంది. ఈ సంవత్సరం మీరు రహస్యమైన ప్రేమ జీవితాలను సాగించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. లేదా ఎదుటి వారి ఆకర్షణ వలన మీరు ప్రభావితం ఆయ్యే అవకాశం, ఆపై కొంత ఆసక్తిని పెంచుకోవచ్చును. పెళ్లి విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది, జీవన ప్రగతి పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన జీవితం గడుపుతారు. మార్చి - మే సమయంలో మీరు పిల్లల పుట్టుకను ఆశించవచ్చును.

తులరాశి ఫలితాలు

తులరాశి ఫలితాలు

2020 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తంలో ఎక్కువ నెలలు ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉండనున్నాయి. మీ జీవిత భాగస్వామి పట్టుదలతో కలిసి ఉంటారు. కొత్తగా వివాహం అయిన వారు సంతానం కోసం ఆశించవచ్చును. అవివాహితులు భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుయితే మీరు మీ భాగస్వామిని పొందగలుగుతారు. ఎక్కువ కాలం మీరు మీ భాగస్వామితో అందమైన బంధాన్ని పొందుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ రెండవ స్థానంలో కుజ గ్రహం ఉండడం కారణంగా ప్రేమ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మీకు అదృష్టం సంవత్సరం మొత్తం తోడుగా ఉంటుంది. ఈ సంవత్సరం కుటుంబ జీవితం అంత అనుకూలంగా ఉండదు. సంవత్సరం మధ్య కాలంలో ఇంట్లో ఒక మంగళ కరమైన కార్యాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చికరాశి ఫలితాలు

వృశ్చికరాశి ఫలితాలు

2020 సంవత్సరం శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం మొదటి సగం మీ వైవాహిక జీవితానికి చాలా మంచిది. ఈ సంవత్సరం దాంపత్య అన్యోనతకు అనుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. శని మరియు గురు గ్రహాలు మీ రెండవ స్థానంలో ప్రవేశం వలన మీరు ప్రేమ వ్యవహారాలలో కొంత నష్టాలను చవి చూసే ఆవకాశం కనబడుతుంది. రాహు గ్రహం మీ ఏడవ స్థానంలో చేరుకోవడం వలన మీరు సెప్టెంబర్ నెలలో కొంత మానసిక ఒత్తిడికి అవుతారు.సెప్టెంబర్ తర్వాత కొందరికి మీ వ్యక్తిగత జాతక ఆధారంగా ఎడబాటు లేదా విడిపోయే అవకాశం ఉంది జాగ్రత్తలు వహించండి. ఆకర్షణలతో కూడిన ప్రేమ మంచిది కాదు, ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సురాశి ఫలితాలు

ధనుస్సురాశి ఫలితాలు

2020 సంవంత్సరం చంద్రుడు, గురు గ్రహం ఈ సంవత్సరంలో వారి స్థాన ఫలితంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో మంచి ఫలితాలను కనబడుతాయి. మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ - మే మరియు ఆగస్టు నెలలలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోండి. జనవరి నెలలో ప్రేమను సాధించడం కోరకు ఎక్కువ కృషి చేయవలిసి ఉంటుంది. దీనితో మీకు జనవరి - ఫిబ్రవరి నెలలలో ఆకస్మిక శుభ ఫలితం కనబడుతుంది. గురువు ఆనందం, శ్రేయస్సునకు అనుకూలుడు మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాడు .ప్రేమ విషయాలలో స్థిరత్వం అనేది సందేహాస్పదంగా ఉంటుంది.

మకరరాశి ఫలితాలు

మకరరాశి ఫలితాలు

2020 సంవత్సరంలో చంద్రుడు మిశ్రమ ఫలితాలను అందిస్తునాడు. అవివాహితులకు ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది. ఎవరినైనా ఇష్ట పడుతుంటే మీ ప్రేమను వ్యక్తపరచాలి అనుకుంటే మీ అభిప్రాయం తెలియజేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీ కుటుంబ పరిధిలో ఒక వివాహ వేడుక జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి ప్రేమ వ్యవహారంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. సంవత్సర ప్రారంభంలో లగ్నస్థానంలో ఉన్న గ్రహం వలన మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచన.

కుంభరాశి ఫలితాలు

కుంభరాశి ఫలితాలు

2020 సంవంత్సరం అత్యంత పవిత్రంగా కనిపిస్తుంది. ఈ జనవరి 24 నుండి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం అవుతుంది , గురువు శుభ దృష్టి వలన అన్నింటా సత్ఫలితాలను ఇస్తాడు కాని శని పన్నెండవ స్తానంలో ఉండడం ప్రేమ జీవితానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే శ్రేయస్కరం లేదా అనుకూల కాలాన్ని మీకు మీరే హరించి వేసుకున్న వాళ్ళు అవుతారు తస్మాత్ జాగ్రత్త. మీరు తొందరపాటుతో సరైన ఆలోచన చేయకుండా నిర్ణయాలను తీసుకోవద్దు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమలో విజయాన్నిసాధించడం అనేది ఈ సంవత్సరం కష్టతరం కావచ్చును.

మీనరాశి ఫలితాలు

మీనరాశి ఫలితాలు

2020 సంవత్సరం ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం అనుకున్న ఫలితాలు పొందలేక పోవచ్చును. ఈ సంవత్సరం మార్చి - జూన్ నెలలలో 5 వ స్థానం గ్రహం వలన ప్రేమ జీవితానికి మంచిది. మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి. సప్తమ స్థాన గ్రహం వలన ఏ విధమైన సహాయాన్ని పొందరు, ఇది మీ జీవిత భాగస్వామితో విభేదాలను సూచిస్తుంది. ఈ సంవత్సరం ప్రేమలో తొందరపాటుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి, మానసిక ప్రశాంతతో ఉండటానికి ప్రయత్నాలు చేయండి.

English summary
News year 2020 predictions is feel good for everyone. This article deals with Horoscope 2020 for Lovers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X