వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనవరి 2021 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Horoscope for the month of December

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆశించిన ధనాదాయం లభించును కాని కుటుంబ సభ్యుల వలన జరిగే నమ్మక ద్రోహం, పై అధికారుల వలన ఏర్పడు సమస్యలు, పని ఒత్తిడి , నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు మానసికంగా దిగులు ఏర్పరచును. చేపట్టిన పనులు అతి నిదానంగా పుర్తిఅగును. ఈ మాసం మీ సహనానికి పరీక్షాకాలం. గర్భవతులు జాగ్రత్తగా ఉండవలెను. చివరి వారంలో బంధు వర్గం వారితో చికాకులు, పెద్ద వయస్సు వారికి జీర్ణ సంబంధ సమస్యలు. విందు - వినోద కార్యములకు దూరంగా ఉండుట మంచిది. పోలీసుల వలన ఇబ్బందులకు అవకాసం ఉన్నది. భరణి నక్షత్ర జాతకులకు ఈ మాసంలో వాహన ప్రమాద సుచన ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. మానసికంగా ఇబ్బంది పెట్టె అనుభవాలు తరచుగా ఉండును. చేపట్టిన పనులలో తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. ద్వితీయ వారంలో వివాహ సంబంధ ప్రయత్నాలు విజయవంతం అగును. వాగ్ధాన భంగములు చేయకండి. ఉన్నత అధికారులతో మాటకలయికలో ఇబ్బందులు ఎదురగును. తృతీయ వారంలో సోదర వర్గం నుండి సహకారం లభించును. సంతాన సంబంధ శుభవార్త. అవసరములకు ధనం సర్దుబాటు అగును. ఈ మాసంలో 7, 8, 10, 12, 13, 17 తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనరాదు. అగ్రిమెంట్లు చేయరాదు. మానసిక ధైర్యం తగ్గును. 22 వ తేదీ తదుపరి కొంత వరకూ ఇబ్బందులు తగ్గును. పరిష్కార మార్గములు కనిపిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 14 వ తేదీ వరకు కొంత నిరాశాజనకంగా ఉండును. ప్రమాదాల నుండి తప్పించుకోనుదురు. కుటుంబ విషయాలకై ఒంటరి పోరాటం చేయవలసి ఉండును. మానసిక సంతృప్తి ఉండదు. ఉత్తరాయణ పుణ్య కాల ప్రారంభం నుండి కొంత ఒత్తిడి తగ్గును. సంతాన మూలక లాభము ఏర్పడును. బంధుత్వాలు బలపడును. సహాయం లభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చురుకుగా ముందుకు కదులుతాయి. దైవ సంబంధ కార్యములందు పాల్గొంటారు. కుటుంబ సమస్యలకు కారణం గుర్తించగలరు. పునర్వసు నక్షత్ర స్త్రీ లకు వెన్నుపూస సంబంధ అనారోగ్య సూచన. ఈ మాసంలో 3, 7, 10, 12 తేదీలు మానసికంగా ఆందోళన కలిగించును. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో అదృష్ట యోగం ఉన్నది. హోదాలో పెరుగుదల ఆశించవచ్చు. గ్రంధ రచన లేదా ముద్రణా రంగంలోని వారికి ఈ మాసం విశేషమైన ఆర్ధిక లాభాన్ని ఏర్పరచును. ప్రమాదాల నుండి బయటపడతారు. అపోహలు తొలగుతాయి. మనస్తాపం కలిగించే మనుషుల నుండి దూరం కాగలుగుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులకు సహకరించగలరు. నూతన అవకాశముల అన్వేషణ ఫలిస్తుంది. విద్యార్ధులకు మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో సమస్యలు కొనసాగును. ఆదాయం గత మాసం కన్నా కొంచం పెరుగును. ఆర్ధిక విషయాలలో సహాయం లభిస్తుంది. ప్రధమ వారంలో ఒక ముఖ్య వార్త వింటారు. గృహ మార్పిడి లేదా నిర్మాణ పనులలో మిక్కిలి అవాంతరాలు లేదా అతి వ్యయం. ఆందోళన పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు బాధించును. ఉద్యోగ కార్యములు పూర్తీ చేయుటకు శక్తికి మించి కష్టపడతారు. సోదర వర్గంతో మాట పట్టింపు విడిచిపెట్టుట మంచిది. నూతన వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ప్రత్యర్ధుల నుండి వ్యతిరేకత అధికం అవుతుంది. వ్యాపార పరంగా నష్టములు పొందు సూచనలు అధికం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో దూర ప్రాంత జీవనాన్ని ఆశించువారికి విజయం లభించును. వ్యాపారాదులు, ఉద్యోగ జీవనంలో సమస్యలు తగ్గును. అధికారుల సహకారం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తీ చేయగలుగుతారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన గృహంలో ఆనందకర సమయం. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో చికాకులు తొలగుతాయి. శుభకార్యా ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానం వలన మానసిక ఆనందం పొందుతారు. తృతీయ , చతుర్ధ వారాలలో అనారోగ్య సమస్యల వలన చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనధాన్య లాభములు ఉన్నవి. మనో అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరమైన మార్గంలో కొనసాగును. ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది. మంచి భవిష్యత్ కు పునాదులు వేసుకొంటారు. కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సంతాన విషయమై వైద్య సహాయం తీసుకొంటారు. ముఖ్య వ్యక్తులతో చర్చలు ఫలప్రదమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గంభీరంగా వ్యవహరించాలి. చివరి వారంలో కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో చేయు ప్రయత్నములలో ప్రారంభమున ఆటంకములు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం లభించును. ధనాదాయం నెమ్మదిగా పెరుగును. గతకాలపు ఇబ్బందులు క్రమంగా తొలగును. ద్వితియ , తృతీయ వారములలో నూతన ఆదాయ మార్గములకై చేయు ప్రయత్నాలు లాభించును. కళత్ర మూలక ధనలాభం ఏర్పడును. వ్యక్త్రిగత జీవనంలో సౌఖ్యం. దూరపు బంధువులతో కలయిక వలన లాభం. 24 వ తేదీ తదుపరి వ్యాపారంలో గొడవలు. మానసిక అశాంతి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. నివాస గృహంలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న అలంకరణ సంబంధ మార్పులు చేయగలుగుతారు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉండును. ప్రతీ వ్యవహారం ఆశించిన మార్గంలో నిదానంగా పూర్తిఅగును. 21వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. వాహన ప్రమాద సూచన లేదా ప్రయాణ సంబంధ ఆరోగ్య భంగం కలవు. ఈ మాసంలో 21, 24, 25 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నల్లని వస్త్రములు ధరించకుండా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ కాలం అనుకూలంగా ఉండదు. గృహంలో చొరభయం లేదా విలువైన వస్తువులు చెడిపోవును. మానసికంగా ఆందోళన చెందుతారు. ద్వితియ వారంలో కార్యభారం పెరుగును. తీవ్ర కాలయాపనతో దూరప్రాంత ప్రయాణములు ఏర్పడతాయి. మిక్కిలి ప్రయాస అనంతరం కార్యములలో విజయం సాధిస్తారు. వృత్తి - వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములకై చేయు ఆలోచనలు ఫలిస్తాయి. పుత్రికా సంతానం వలన కొద్దిపాటి చికాకులు. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో బాగుంటుంది. ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభించును. ప్రభుత్వ అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగును. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నములు చేయుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని ఆశించవచ్చు. ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు. శ్రమ వలన పేరు ప్రఖ్యాతలు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో సంతాన సంబంధ ప్రయత్నాలలో చక్కటి లాభములు. ఆశించిన విధంగా సంతాన ప్రాప్తి ఏర్పడును. ధనాదాయం సామాన్యం. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ లభించును. ద్వితియ వారం తదుపరి నూతన గృహ ప్రయత్నములు ఫలించును. వ్యక్తిగత జీవనంలో ఆందోళనతో కూడిన ఆలోచనలు అధికమగును. ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చును. ఈ నెలలో ప్రారంభించు నూతన వ్యాపారములు విజయవంతం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

English summary
Horoscope for the month of December 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X