వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యకరమైన వాస్తుకు ఇల్లు శుభ్రం ఎలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

మనం నివసించే ఇల్లు స్వంతదైన,అద్దే(కిరాయ)ది అయిన మనం నివసించిచే స్థలం యొక్క శుభ్రతపై మన ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి మనిషి ఒళ్ళుతో బాటు ఇల్లు శుభ్రపరచుకోవాలి అందుకే పెద్దలు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని.ఎక్కడ ఏ ఇల్లు శుభ్రతతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో అక్కడే లక్ష్మి అమ్మవారు స్థిరనివాసమై నిలుస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది.

ఇల్లును శుభ్రపరచుటకు,తుడుచుట(కడుగుట)కు మొదట ఈశాన్యమూల ప్రాంతం నుండి తుడవటం ప్రారంభించాలి.ఈశాన్యము మూల నుండి మొదలు పెట్టి తూప్పు ఉత్తర దిశలను తూడ్చిన తర్వాత పడమర దిశను,ఆ తర్వత దక్షిణమువైపు తుడవాలి.ఈ విధంగా ఇల్లును ఊడ్చుకోవాలన్న,కడగాలన్న ఈ పద్దతిలో చేస్తే మంచిది అని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.

How to clean house for healthy vasthu

ఇంటిలోని చెత్త(కసుపు)ను ప్రతి రోజు తప్పక రెండు సార్లు ఉదయం,సాయంత్రం విధిగా ఈశాన్యము మూల నుండి వూడ్చి చెత్తను తీసివేయాలి.ఇల్లును వూడ్చే చీపురుతో భూజు(పాదు)ను,బాతురూంలను శుభ్ర పరచుటకు ఉపయోగించరాదు.ఇంట్లో రెండు చీపుర్లు ఒకేచోట పెట్టరాదు.చీఫురును రివర్స్ గా కూడ నిలబెట్ట కూడదు.ఇల్లు శుభ్రపరచాక చీపురును కనపడకుండా ఈశాన్య మూలన తప్ప ఎక్కడైన డోర్ వెనక భాగంలో మేకుకు తగిలించు కోవాలి.ప్రతి మూడు నెలలకు ఒకసారి చీపురును పారవేయలి.

కిటికిలు, వెంటిలేటర్లను,జాలీలు(గ్రిల్స్)లను వారనికి రెండు సార్లు శుభ్రపరచాలి.స్నానపు గదులు,లెట్రిన్ లను వారానికి మూడుసార్లు సర్ఫ్ వేసి కడిగిన తర్వాత ఫినాయిల్,డెటాల్ మొదలగు క్రిమిసంహారితో శుభ్రపరచుకోవాలి.ప్రత్యేకించి లెట్రిన్లను వారనికి రెండుసార్లు యాసిడ్,డోమేక్స్ మొదలగు వాటిని ఉపయోగించి కడగాలి.

షింక్,వాష్ బేషన్లు,బకేట్లు,మగ్గులను వారనికి రెండు సార్లు సబ్బుతో శుభ్రపరచుకోవాలి.కర్టేన్లను నెలకు ఒకసారి ఉతికించాలి.ఇంట్లో పగిలిన వస్తువులను తీసివెయలి.చెట్లకు ఎండిన,వాడిన ఆకుల్ని కొమ్మలని కత్తిరించివేయాలి.డోర్ మ్యాట్స్,టవల్స్,పక్కబట్టలను వారం పది రోజులకు ఒకమారు శుభ్రపరచుకోవాలి.దింద్లు,పరుపులను మూడు నెలలకు ఒకసారి ఎండలో వెస్తే బ్యాక్టిరియా పోతుంది.ముఖ్యంగా సాయంకాల సమయంలో సుమారు 6:30 దాటక ఇంట్లో దూపం(మైసాక్షి,లోబాన్)మొదలగు ఎదేని సాంబ్రాని పొగను ఇల్లంతా వ్యాపించేలా వేసి కాసేపు ద్వారాలుతీసి ఉంచాలి.ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉన్న బ్యాక్టిరియా బయటకు పోతుంది.

ఈ పద్దతి ప్రకారం మనం మన ఇంటిని శుభ్రంగా పెట్టుకోగలుగుతే మంచి ఆలోచనలతో కుటుంబ సభ్యుల మధ్య సంత్రుప్తి,ఆరోగ్యంతో పాటు సమాజంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.చేసే పనులలో లాభాలు కనబడతాయి.గ్రూహమే కదా స్వర్గసీమ అన్నట్టు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు స్థిర నివాసమై ఉంటారట మీరు ఆచరించి ఆ ఆనందానుభూతులు అనిభవించండి జైశ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrologer explained how to clean house forhealthy Vasthu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X