వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాతృత్వం, ధార్మిక చింతన, క్రమశిక్షణల కలయికే రంజాన్

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

ముస్లింలు చాంద్రమాన కేలండర్‌ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '

పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది.ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

ఉపవాసవ్రతం
ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు. ఈ ఉపవాస విధి విధానం గురించి పవిత్రమైన దివ్యఖురాన్ గ్రంథంలో క్లుప్తంగా వివరించబడి ఉంటుంది.

విశ్వాసులారా! గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో... అలాగే మీలో భయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసవ్రతాలు నిర్ణయించబడ్డాయి' అని పేర్కొంది.

How Ramzan is celebrated

గల్ఫ్ లో రంజాన్
భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి పడుకుంటారు.రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు.బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి.

దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు.అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెలరోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు.బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.

మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, యెమన్ దేశాల నుంచి వికలాంగులైన పేద పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి చేత బిక్షాటన చేయించి లాభాలు గడించడం కొన్ని యాచక ముఠాల ప్రత్యేకత.

అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి.గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్య మాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేయాల్సిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దౌత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి.

ఖురాన్‌ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తారు.స్వదేశానికి వెళ్లడానికి విమానం టికెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జకాత్ సొమ్ముతో విమాన టికెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం.

జకాత్
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది.ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.

ఫిత్రా
జెరూసలెం పాతబస్తీలో రంజాన్ పండుగ.రమదాన్ నెలవంక.'జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు పూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు.

ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ ఫిత్రా దానం విధిగా అందజేస్తారు.ఈ ఫిత్రా దానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.

దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్‍ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.

షవ్వాల్
ఈ విధంగా రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే ' ' షవ్వాల్' ' నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమించి మరుసటి రోజు ' రంజాన్ ' పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషానందాలతో జరుపుకుంటారు. " షవ్వాల్' నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ' ఈదుల్‍ఫితర్ ' అని అంటారు.

ఇఫ్తార్ విందు "ఈద్ ముబారక్"
నెల పొడుపుతో రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని రంజాన్ పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో వాతావరణమంతా ఆహ్లాదకరమవుతుంది. ధనిక, బీద తారతమ్యం లేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు.ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది.

ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్ తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.

ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‍గాహ్ లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ' ఈద్‍ముబారక్ ( శుభాకాంక్షలు ) తమ బంధు మిత్రులకు తెలియజేసుకుంటారు.

English summary
Muslims follow lunar calendar. The Islamic calendar, which follows the lunar month of Ramadan, is considered to be the most sacred month of this month. The main reason for this is the 'Divine Qur'an' 'Ramzan Masam' is a combination of discipline, charity, and religious thought.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X