వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సద్దుల బతుకమ్మ - మహిళలు ఆచరించాల్సిన సంప్రదాయాలు, ఆచారాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151

బతుకమ్మ పండగలో ఆఖరి 9వ రోజు 'సద్దుల బతుకమ్మ'ను ఆరాధిస్తారు. ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా అందంగా వివిధ రంగులతో ముస్తాబుగా పేరుస్తారు.ఆడవారు తమ ఆటపాటలతో ' సద్దుల బతుకమ్మ' పండుగను సంతృప్తిగా జరుపుకుంటారు.

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగనే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే సందడిగా కనబడుతుంది.మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

ఆఖరి రోజున 'సద్దుల బతుకమ్మ'ను ఆరాధిస్తారు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో ' సద్దుల బతుకమ్మ' పండుగను జరుపుకుంటారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా 'గౌరమ్మ'ను పసుపుతో తయారు చేస్తారు.ఆ గౌరమ్మను పూజించిన తర్వాత ఆ పసుపును తీసి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు. అమ్మవారికి ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

How Saddula Batukamma celebrated in Telangana

సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు,ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టు పక్కల మహిళలంతా చేరి ఐక్యతతో ప్రేమను కలపి చుట్టు నిలబడి బతుకమ్మ పాటలు పాడుతారు.ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. ఇక చీకటి పడుతుంది అనగా ఆడపడుచులు ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువుకు ఊరేగింపుగా బయలుదేరుతారు.అక్కడ మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ,ఆడుతూ నీటిలో జారవిడుస్తారు.ఆ తరువాత మలీద అనే పిండి వంటకాన్ని కొంత గంగమ్మ తల్లికి అంటే చెరువులో వేసి నమస్కరించి ఆ తర్వాత బంధు మిత్రులకు పంచిపెడతారు.

ఈ బతుకమ్మ పండగలో కీలకమైన ఈ సద్దుల బతుకమ్మకు పట్నంలో ఉన్న వారు వారి స్వగ్రామాలకు లేదా బండు,మిత్రుల ఊర్లకు చేరుకొని అంగరంగ వైభవంగా అందరితో ఆత్మీయంగా కలిసి పండగను నిర్వహించుకుంటారు.ఈ పండగలో ధనిక పేద అనే తారతమ్య భేదం లేకుండా అందరూ ఎంతో కొంత ఉన్నంతలోనే అమిత ఆనందంగా పండగ చేసుకుంటారు.చివరి రోజైన ఈ సద్దుల బతుకమ్మ వేడుకను చూడడానికి దాదాపు ఊరికి ఊరే చెరువుల దగ్గరకు చేరి సుందరంగా తయారుచేసిన బతుకమ్మలను చూస్తూ వీనులకు విందును కలిగించే ప్రత్యేక భాణిలో కొనసాగే పాటలను వింటూ పరవశించిపోతారు.

బతుకమ్మను చెరువులోకి సాగనంపిన తర్వాత కట్టపైన ,కట్టక్రింద ఇరుగు పొరుగు వారితో తాము తెచ్చుకున్న సద్ధులను ఒకరికొకరు పంచుకుని ఆనందానుభూతులు పొందుతూ కమ్మనైన ఆ ప్రసాదాలను తిని ఇంటికి చేరుకొని బతుకమ్మను తీసుకెళ్ళిన తాంబాళము ఇంట్లో పెట్టి సుమారు అర్ధరాత్రి వరకు చిన్న పెద్ద అనే భేదం లేకుండా వీధిలో వాల్లందరూ ఒక చోట గుమిగూడి సరదాగా ఆడిపాడుకుంటారు.మళ్లి ఇంత ఆనందానిచ్చే బతుమ్మ పండగ కోసం సంవత్సరం అంతా ఎదిరి చూస్తారు.

English summary
Durga Mata decorated in nine avatars during the Devi Navaratrulu. Ninth day of Maharnavami is the specialisation for devotess to celebrate Parvati devi pujas and Saraswati puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X