వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధనం కాపాడుకోవటమే లక్ష్మి స్థిరత్వం: వాటికి దూరంగా ఉంటే సంపద మీదగ్గరే!

మీరు లక్షలూ, కోట్లు సంపాదించారు. వయసు వేడిలో మీరు చెప్పిందే వేదం. సకల కుటుంబసభ్యులకూ మీరంటే, మీ మాటంటే శిరోధార్యము. వయసయిపోయింది. పరిస్థితులు మారవచ్చు. మీకున్న కోటానుకోట్ల ధనంలో ఓ రూపాయి కూడా మీకు అంద

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీరు లక్షలూ, కోట్లు సంపాదించారు. వయసు వేడిలో మీరు చెప్పిందే వేదం. సకల కుటుంబసభ్యులకూ మీరంటే, మీ మాటంటే శిరోధార్యము. వయసయిపోయింది. పరిస్థితులు మారవచ్చు. మీకున్న కోటానుకోట్ల ధనంలో ఓ రూపాయి కూడా మీకు అందని పరిస్థితి రావచ్చు. మహాసంపదలూ, మహారాజ్యమిచ్చిన యయాతి ముసలితనంలో పుత్రులని తన కష్టం పంచుకోమంటే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అందుకే ఎవరికి ఇవ్వాల్సింది వారికివ్వాలి. తనకి కావాల్సింది తానుంచుకోవాలి.

మీది అనుకున్నది మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. అలా నిర్లక్ష్యంగా ఉన్నందుకే శ్రీదేవీ భాగవతంలో సమాధి అనే వైశ్యుడు తన పిల్లల చేతా, భార్య చేతా ఇంట్లోంచి గెంటివేయబడ్డాడు. అలాంటి లక్ష్మీ నివాసస్థానమైన పువ్వులను నిర్లక్ష్యంగా పడేయటము, అపరిశుభ్రంగా తాకటం చేయరాదు. మహర్షి ఇచ్చిన పూలమాలను శచీపతి అవమానించటం వల్లనే సకల సంపదలూ పోగొట్టుకున్నాడు. నానాబాధలు పడ్డాడు.

How to save your wealth

చివరకు దేవతలూ, రాక్షసులూ కలిసి క్షీరసాగర మధనం చేస్తే గాని దేవతలకి సంపదలు కలుగలేదు. పూలను నిర్లక్ష్యంగా పడేస్తే, చూస్తే, సంపదలు పోతాయి. సర్వభ్రపుడవ్వాల్సి వస్తుంది. 'మ'కారములను విడిస్తేనే సంపదదలిచేరుతుంది 'మ'కారములనగా మద్యం, మాంసం, మగువ. ఇవే ధనాలని హరించేవి.

ఇవి ఉన్న దగ్గర శ్రీమహాలక్ష్మి ఉండదు. ఎప్పడెప్పడు వెళ్ళిపోదామా? అని వేచి ఉంటుంది. సమయం చూసుకొని శెలవు తీసుకుంటుంది. ఈ 'మ' కారముల వల్లే కీచకుడూ, దుర్యోధనుడూ, జరాసంధుడూ తమతమ వైభోగాల్నీ సకల సంపదలనూ, హితులనూ వదులుకోవాల్సి వచ్చింది.

English summary
Astrologer described why, how we have to wear eight faced Rudraksha and nine faced Rudraksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X