వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శీతాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

చల్లని గాలి వీచే చలికాలం వచ్చేసింది. అన్ని వేడి వేడి ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. చలికి వెచ్చగా రగ్గులు కప్పుకుని హాయిగా పడుకోవలనిపిస్తుంది, ఉదయం లేవాలంటే కొంత ఇబ్బందిగా కూడా కల్గుతుంది. ఈ హడావిడిలో ఆరోగ్యం గురించి మరిచిపోకూడదు. మిగిలిన అన్ని సీజన్స్ లాగానే వింటర్ లో కూడా తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి.

చలికాలంలో జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కోల్డ్ వెదర్ ని తట్టుకోవడానికి బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది. శీతాకాలం లో ముఖ్యంగా జాగ్రత్త పడవలసినది హైడ్రేషన్ విషయంలో. ఈ హైడ్రేషన్ నీటి వల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల లభిస్తుంది. ఆ ఆహార పదార్ధాలేమిటో చూద్దాం.

How should one take care of health during winter season?

* వేడి వేడి సూప్స్ ఈ కాలం లో చాలా మంచివి. ఈ సూప్స్ కూడా ఇంట్లో తయారు చేసినవి అయితే ఇంకా హెల్దీ అన్న విషయం మీకూ తెలిసిందే.

* ఈ నీటిని కూడా రూమ్ టెంపరేచర్ లో తాగితేనే మంచిది.

* ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళను త్రాగాలి.

* రోజు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనేతో శరీరాన్ని మసాజ్ చేసుకుని ఓ గంట తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి.

* స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, పైనాపిల్ వంటి ఫ్రూట్స్ లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో మార్కెట్ లో ఈ పండ్లు దొరుకుతాయి.

* ఆల్కహాల్, కెఫీన్ తీసుకోవడం బాగా తగ్గించండి. ఈ సమయంలో వేడి వేడి టీ, కాఫీ తాగకుండా ఉండడం కష్టం కానీ తప్పదు మరి. వీటిని ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి. వీటిని తీసుకునేటప్పుడు ఇవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి అన్న విషయం గుర్తు పెట్టుకుంటే తర్వాత వీటి మీదకి అంత తొందరగా మనసు పోదు.

క్యాప్సికం:- పసుపు, ఆకుపచ్చ క్యాప్సికంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందు వల్ల శరీరంలో నీటి శాతం ఎక్కువ నిలుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యాప్సికం లో 93.9% నీరే ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ సీ, విటమిన్ బీ6, బీటా కెరొటిన్, థయామిన్, ఫోలిక్ ఆసిడ్ ఉన్నాయి.

టొమేటో :- టొమేటోతో పప్పు, కూరలు రకరకాలు చేస్తాం. చాలా కామన్ గా వాడే కూరగాయల్లో టొమేటో కూడా ఉంటుంది. ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. ఇందువలన శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. పైగా టొమేటోలు బరువు తగ్గడంలో కూడా సహాయ పడతాయి. అంతే కాక టొమేటోలని పచ్చిగా కూడా తినవచ్చును.

పాల కూర:- పాలకూరని పోషకాల గని అని చెప్పవచ్చు. పాల కూర వల్ల స్కిన్, హెయిర్ కి ఎన్నో ప్రయోజనాలు సమకూరడంతో పాటూ ఈ చలి కాలంలో శరీరంలో నీరు ఉండేలా చూస్తుంది. ఆకుకూరలలో తొంభై శాతం నీరే ఉంటుంది. అంతే కాక పాల కూరలో ల్యుటీన్, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఈ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ చలి కాలంలో పాలకూర తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.

కాలీఫ్లవర్ :- కాలీఫ్లవర్ మామూలుగా కూడా చాలా మందికి ఇది ఫేవరెట్ వెజిటబుల్ కూడా. కాలీ ఫ్లవర్ ని సూప్స్, సలాడ్స్, కర్రీస్, రైస్ లో వాడుకోవచ్చును. ఈ వెజిటబుల్ లో కూడా నిండుగా నీరే ఉంటుంది. ఒక కప్పు తరిగిన కాలీ ఫ్లవర్ వల్ల 50 ఎం ఎల్ నీరు లభిస్తుంది.

జామపండ్లు :- ఈ కాలంలో జమపండ్లను అధికంగా తింటే శరీరం పోడిబారకుండా రక్షణనిస్తుంది. ఈ జామపండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తిన్న ఆహరం అరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. మలవిసర్జనకు మంచి చిట్కా ఈ పండు.

ఆలివ్ ఆయిల్ :- కూరగాయలు వండడానికి ఆలివ్ ఆయిల్ ఆరోగ్యదాయిని అని చెబుతారు. ఇందులో ఉండే మంచి ఫ్యాట్స్, విటమిన్ ఈ శరీరం లోపలి నుండి పోషణని అందిస్తాయి. ఆలివ్ ఆయిల్ ని చర్మం మీద అప్లై చేసినా కూడా స్కిన్ కి మంచి పోషణ లభిస్తుంది. అందు వల్లనే వింటర్ సీజన్ లో దీన్ని చక్కని మాయిశ్చరైజర్ లా వాడుకోవచ్చును.

గుర్తు పెట్టుకోవాల్సిన విషయం :- చలికాలం వచ్చిందంటే మనం నీళ్ళు తాగడం మర్చిపోతామని అందరికీ తెలిసిన విషయమే. శరీరానికి నీరు ఎంత అవసరమో తెలిసి కూడా ఎండాకాలములో తాగినంత ఎక్కువగా మనం చలి కాలంలో నీళ్ళు తాగలేక పోతున్నాం. అసలు అలా తాగాలి అనే విషయం కూడా గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే చలికాలంలో మనకి చెమట పట్టదు. కానీ చలి గాలులకి బాడీలో నుండి మాత్రం మనకి తెలియకుండానే నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. పైగా ఈ కాలంలో మనకి అంత దాహంగా కూడా అనిపించదు, కాబట్టి నీళ్ళు తాగాలన్న సంగతే మర్చిపోతాం. కానీ తగినంత నీరు తాగకపోతే మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలహీనపడుతుంది. చలికాలంలో నీళ్ళను తాగుతూ ఉండడం వలన ఉండే ఆరోగ్య సూత్రాలు ఏమిటో గమనించండి.

చలికాలంలో తరచూ మూత్రానికి వెళ్తున్నారా...? అయితే ఈ సూత్రాలు పాటించండి.

1. సీజన్ తో సంబంధం లేకుండా, సమ్మర్ అయినా వింటర్ అయినా బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయాలంటే నీరు అవసరం. తగినంత నీరు తాగుతూ ఉండడం వల్ల లోపలి నుండి టెంపరేచర్ రెగ్యులేషన్ జరుగుతుంది. హైపోథెర్మియా లాంటి కండిషన్స్ ని రక్షణ చేయవచ్చును.

2. చలిగా, పొడిగా ఉండే వాతావరణం ఎనర్జీనంతా పీల్చేస్తుంది. ఫలితంగా బద్ధకంగా అనిపించడంతో పాటూ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. నీరు తాగడం వలన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు.

3. హైడ్రేటెడ్ గా ఉంటే శరీరానికి ఫ్యాట్స్ ని బ్రేక్ డౌన్ చేయడం తేలిక అవుతుంది. ఫలితంగా బరువు తగ్గడం తేలిక అవుతుంది.

4. నీరు సరిపోకపోతే ఆ ఎఫెక్ట్ ముందుగా కనిపించేది స్కిన్ మీదే. స్కిన్ డ్రై గా, డల్ గా తయారవుతుంది. స్కిన్ హెల్త్ కి కూడా నీరు అత్యవసరం.

English summary
Some changes in lifestyle are required during the winter. Only then will the body be ready to withstand this cold weather.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X