వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శనిగ్రహ దోషాలను దూరం చేసుకోవడం ఎలా..? ఏ నియమాలు పాటించాలి

|
Google Oneindia TeluguNews

ప్రతి రోజు దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సేవా దృక్పథంతో ఉండాలి.నల్ల చీమలకు చక్కర వేయాలి.శని త్రయోదశి రోజుల్లో శనికి అభిషేకం చేయించాలి.అలాగే పేదలకు తమకు చేతనైన సాయం చేయాలి.శనివారం నువ్వుల నూనెను తలకు,శరీరం మొత్తం పట్టించి తలంటుస్నానం చేయాలి.శనీశ్వర గాయత్రిని రోజూ 108 సార్లు పఠించాలి. హనుమాన్ చాలీసా చదవాలి.బయటికి వెళ్లి ఇంట్లోకి ప్రవేశించక ముందు కాళ్ళను బాగా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.శనివారాల్లో కోతులకు అరటిపండును ఇవ్వడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయి.

అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాలమందు శనిగ్రహదోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇలాంటి ప్రభావాలుంటే తప్పకుండా శనివారం పూట శనీశ్వరునికి అర్చన చేయించాలి.శని శాంతి పూజ చేయించు కోవాలి. అలాగే శనీశ్వర ప్రభావంతో ఏర్పడే ఈతిబాధలు తొలగిపోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి,హనుమంతుని, అయ్యప్ప ఆరాధన చేస్తే శనిగ్రహ దోషాలు తగ్గుతాయి.

శనివారం నాడు శని మంత్రాలను జపించుట,రావిచెట్టునకు రోజు 11 ప్రదక్షిణాలు చేస్తే శనిగ్రహంచే ఏర్పడే దోషం తొలగిపోతుంది.నల్లని వస్త్రాలు,ఇనుము,తోలు,పత్తితో తయారైన వస్తువులు దానం చేయటం మంచిది. తీవ్ర వ్యాధులకు కారకుడు శనీశ్వరుడు. అలాగే నిద్రలేమి, మత్తు పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం ఇలా ఒకటేమిటి అన్నివ్యాధులకు, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది.

How to Avoid Shani Graha Dosham

భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల ద్వారా స్వామి వారిని శాంతింపజేస్తే ఈతిబాధలుండవు.కాలపురుషుని జీవనాధిపతి అయిన శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలవాడు. అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగవు.

ముఖ్యంగా శనిగ్రహా ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు తల్లి దండ్రులను పూజించాలి,వారిని గౌరవించాలి ,కుటుంబ భాధ్యతలను విస్మరించ వద్దు,జూదం ,మద్యం జోలిగి పోవద్దు ,శనివారం మాంసాహారం తినవద్దు.ప్రతి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర నుండి లేచి సమయాన్ని వృధా చేయకుండా కార్యోన్ముకులు అవ్వాలి.కుటుంబ సభ్యులకు పనులలో సహాయపడాలి.పేదవారికి,అవిటి వారికి ,వృద్ధులకు ,పశు పక్ష్యాదులకు చేతనైన సహాయం చేస్తూ ఉండాలి.ఇలా చేయడం ద్వారా శనీశ్వర దోషాలు తొలగిపోతాయి.

English summary
Every day we have to make a divine vision. It should be done with a high service perspective. Shallow the rumen for the anthill. In the trilogy days the anesthetics should be anointed, as well as the need for the poor to help them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X