• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుంభరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు.

All you need to know about Aquarius.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి

ఆదాయం 14, వ్యయం - 14,

రాజ పూజ్యం - 06, అవమానం - 01

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు జన్మమున ( కుంభం) లో లోహమూర్తిగా .. ఆ తర్వాత నవంబర్ 20 వరకు వ్యయమున తామ్ర మూర్తి.. తర్వాత సంవత్సరం అంతా జన్మమున లోహమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా... వ్యయ స్థానమైన ( మకరరాశి)లో లోహమూర్తిగా ఉంటాడు.

* కుంభరాశి వారు ఏలినాటి శని ప్రధమ పర్యాయ ప్రభావంలో ఉన్నారు.

ఈ ఏలినాటి శని 23 ఫిబ్రవరి 2028 వరకు ఉంటుంది.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 4, 10 రాశులైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో తామ్ర మూర్తులుగా ఉంటారు.

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి శారీరక మరియు మానసిక సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తున్నాయి.

* గురువు ఉగాది నుండి నవంబర్ 19 వరకు ( అశుభుడు) కావున సంతానం వలన లేదా సంతాన విషయ మూలక సమస్యలు,

సోదర, సోదరి వర్గం వలన ఇబ్బందులు ఏర్పడతాయి,

మానసిక చికాకులు, వృధాగా ధన వ్యయం వంటి వ్యతిరేక ఫలితాలు ఏర్పడును.

నవంబర్ 20 నుండి గురువు లగ్న స్థానములో ఉండుట ( శుభకరం ) కావున అప్పటి నుండి అనుకూల ఫలితాలను ఇస్తాడు.

జీవన విధానంలో గతంలో ఆశించిన ఉన్నతిని పొందుతారు.

ఉద్యోగ జీవతంలో కోరుకున్న విధంగా అనుకూలమైన మార్పులు లభిస్తాయి.

ఆరోగ్యపరంగా శరీర అధిక బరువు కాకుండా తినే పదార్ధాలను అదుపులో పెట్టుకోవలెను. యోగా, ధ్యానం, వాకింగ్ చేయాలి.

నరాలు లేదా మెదడు సంబంధిత అనారోగ్యలతో బాధ పడుతున్నవారికి ఆరోగ్య పరంగా మెరుగు పడుతుంది.

శని వ్యయ స్థానంలో ఉన్నదున ఈ సంవత్సరం శుభ ఫలితాలను ఇవ్వడు.

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది.

వ్యాపార రంగం వారు నూతన భారీ పెట్టుబడులు పెట్టుడం మంచిది కాదు.

బంగారు ఆభరణాలపై ఋణాలు తీసుకొనుట కూడా మంచిది కాదు.

వ్యయ స్థానంలో ఉన్న శని వలన వడ్డీల వలన ఇబ్బందిపడే సూచనలు అధికంగా ఉన్నవి.

శనికి తైలాభిషేకాలు జరుపుట మంచిది.

* రాహు - కేతువులు ఇరువురి వలన అనుకూమైన ఫలితాలు లభించును.

ముఖ్యంగా రాజకీయ రంగంలోని వారికి కొంత ప్రతికూల వాతావరణం. మాట జరవద్దు. శాంతి పరిహారాలు పాటిస్తే అనుకూలం.

విద్యార్ధులకు ఆశించిన విధంగా ఉన్నత విద్యావకాశాలు లభింప చేయును.

విదేశి విద్యాలయలందు ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

* అవివాహితులకు వివాహకాలం.

మీకు ఇష్టమైన ఉద్యోగం వస్తుంది.

కోరుకున్న కళాశాలలో చదువుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుంది.

స్వగృహ యోగ్యత కలుగుతుంది.

మీపై కొంత మంది అసూయా ద్వేషాలు కనబరుస్తారు, అవి .. చిలికి చిలికి గాలివాన అవుతుంది.

ప్రేమ వ్యవహారాలు సఫలం కావు.

వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది.

లాభం వచ్చిన ధనాన్ని పొదుపు చేస్తారు లేక పెట్టుబడి రూపంలో పెడతారు.

మీరు విరోధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మీ పై ఆరోపణలు వస్తాయి.

కొన్ని పుకార్లు తాత్కాలికంగా ఇబ్బందిని కలిగిస్తాయి.

జీవిత భాగస్వామి అభిప్రాయాలకు మీరు విలువ ఇవ్వలేదని విమర్శలూ వస్తాయి.

ఈతలకు ( స్విమ్మింగ్ ) దూరంగా ఉండాలి, జల గండాల సూచనలున్నాయి.

అనారోగ్యం కలిగినా పెద్దగా బాధించదు.

వ్యవసాయంలో సామాన్యంగా అనుకూలం .. నర్సరీ, పూల మొక్కలకు సంబంధించినవి అనుకూలం

ఈ సంవత్సరం జీవితంలో గొప్ప మలుపు తిరుగుతుంది.

పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు, మంచి ఉద్యోగం లభిస్తుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, నిరుపేదలకు అన్నదానం చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

English summary
All you need to know about Aquarius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X