• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధనుస్సురాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మూల 1,2,3,4 పాదములు , పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుస్సురాశికి చెందుతారు .

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుస్సురాశి వారికి

ఆదాయం 11, వ్యయం - 05,

రాజ పూజ్యం - 07, అవమానం - 05

All you need to know about sagittarius.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు తృతీయ స్థానమైన ( కుంభం) లో రజిత మూర్తిగా ఉండి .. తర్వాత నవంబర్ 20 వరకు ద్వితీయంలో లోహ మూర్తిగా ..ఆ తర్వాత సంవత్సరమంతా మూడవ ఇంట్లో సువర్ణ మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... ద్వితీయ స్థానమైన ( మకరరాశి )లో రజిత మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 6, 12 రాశులైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో లోహ మూర్తులుగా ఉంటారు.

ధనుస్సురాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని ( చివరి ) పర్యాయయంలో ఉన్నారు,

ఏలినాటి శని 17 జనవరి 2023 వరకు ఉంటుంది.

గురువు ( అశుభుడు) ఈ సంవత్సరమంతా అనుకూల ఫలితాలను ఇవ్వలేడు .

శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ పని ప్రారంభించినా అంతా సులువుగా పూర్తి కాదు.

కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కొందురు.

అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

దొంగతనాల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలున్నాయి.

లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం. వైరస్ బారిన పడకుండా ప్రత్యేక ఆరోగ్య శ్రద్ద తీసుకోవాలి.

సొదరి వర్గం నుండి ప్రయోజనం పొందుతారు.

వారి సహాయం వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.

* ఏలినాటి శని ప్రభావం వలన గత సంవత్సరంలాగే కొన్ని ఇబ్బందులు కొనసాగుతాయి.

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

అతి కష్టం మీద ధనాన్ని కూడబెట్టగలుగుతారు.

మొదటి వివాహంతో నష్టపోయిన వారు, పునర్వీవాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంది.

ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించవలెను.

ఏలినాటి శని ప్రతికూల ఫలితాల నివారణ కొరకు శని దేవునికి జపాలు, శాంతి జరిపించుకొనుట మంచిది.

* రాహు - కేతువులు ( శుభులు) ఇద్దరూ ఈ సంవత్సరమంతా అనుకూలమైన ఫలితాలనే ఇస్తారు .

వ్యక్తిగత జాతకంలో రాహు - కేతువులు ఉచ్చస్థితి లేదా స్వ క్షేత్రములలో ఉన్నవారికి సమాజంలో విశేషమైన ఖ్యాతిని పొందుతారు .

కోర్టు కేసులకు సంబంధించి తీర్పులు అనుకూలంగా వస్తాయి.

ఈతలకు ( స్విమ్మింగ్ ) దూరంగా ఉండాలి, జల గండాల సూచనలున్నాయి.

దేవాలయ, ధార్మిక కేంద్రాలను నిర్మించుటలో పాత్ర ఉంటుంది.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

* జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించాలి.

ఇతరులకు ఇచ్చిన డబ్బులు అంత సులువుగా తిరిగిరావు.

మీ మనస్సులోని భావాలను వ్యక్త పరచడం వలన కొంత మంది విరోధులు అవుతారు.

కొంత అపఖ్యాతి, అపనిందలు కలుగుతాయి.

రాజకీయ రంగం వారు మితిమీరిన ప్రసంగాలు చేయరాదు

రియల్ ఎస్టేట్ రంగలో అభివృద్ధి కనబడుతుంది.

విదేశీ ప్రయాణాలు చేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది.

వ్యవసాయ దారులకు సామాన్యం , రెండవ పంట లాభిస్తుంది.

ఉద్యోగస్తులకు దూర ప్రాంత బదలీలు ఉంటాయి. కొంత ప్రతికూల వాతావరణం ఉండును.

విద్యార్ధులు ఎక్కువ కష్ట పడాలి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, చండి హోమక్రతువు జరిపించుకోవడం వలన ఆరోగ్య , ఆర్ధిక పరంగా కొంత అనుకూలమైన శుభ ఫలితాలు కనబడతాయి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

English summary
All you need to know about sagittarius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X