• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వృశ్చికరాశి వారికి 2021-2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

విశాఖ 4 వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదములలో జన్మించిన వారు వృశ్చికరాశికి చెందుతారు .

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి

ఆదాయం 08, వ్యయం - 14,

రాజ పూజ్యం - 04, అవమానం - 05

All you need to know about Scorpio.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు చతుర్ధ స్థానమైన ( కుంభం) లో తామ్ర మూర్తిగా ఉంటాడు .. తర్వాత నవంబర్ 20 వరకు తృతీయంలో సువర్ణ మూర్తిగా ఉండి .. ఆ తర్వాత సంవత్సరమంతా నాల్గవ ఇంట్లో తామ్ర మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... తృతీయ స్థానమైన ( మకరరాశి )లో తామ్రమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 7, 1 రాశులైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి సమాజంలో అపవాదులు, అపఖ్యాతులు పొందుట అనేవి గోచరిస్తున్నాయి.

ఉగాది నుండి గురువు నవంబర్ 19 వరకు తీవ్రమైన వ్యతిరేక ఫలితాలను కలిగిస్తాడు.

చేపట్టిన కార్యాలలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

ఉద్యోగ జీవితంలో నిలకడ అనేది లేకుండా పోతుంది.

ఆర్ధిక పరమైన అంశాలలో ఇతరులకు అప్పు ఇచ్చుటగాని,

ఇతరులు చేసే రుణాలకు హామీలుకానీ , జమానత్తు సంతాకాలు కానీ చేయకూడదు.

నవంబర్ 20 నుండి గురువు అనుకూలమైన శుభ ఫలితాలు ఇస్తాడు.

విద్యార్ధులకు విదేశీ విద్యలో వారు ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు.

ఇంటి స్థలం కానీ లేదా అపార్ట్ మెంట్ లాంటివి కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* శని సామాన్యమైన ఫలితాలను మాత్రమే ఇస్తాడు.

వృశ్చికరాశి వారికి ఆదాయం, వ్యయాలను శని సమానంగా ఇస్తాడు.

తీవ్ర వ్యతిరేకమైన ఫలితాలు మాత్రం ఉండవు, అలా అని తీవ్రమైన అనుకూలమైన ఫలితాలు కూడా ఏర్పడవు.

* రాహువు వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి,

వ్యాపారానికి సంబంధించిన విజయాలు కలుగుతాయి,

ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో కోర్టు కేసులు ఏమైనా ఉన్న వారికి అనుకూలమైన తీర్పులు లభింస్తాయి.

* కేతువు అశుభత్వం వలన కొన్ని కష్టాలు ఎదురౌతాయి.

ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఏర్పడతాయి,

నిత్య తగాదాలు ఎదురౌతాయి. . చికాగును కలిగిస్తాయి.

అవివాహితులకు వివాహ సంబంధమైన ప్రయత్నాలు కష్టం మీద ఫలింస్తాయి.

వైవాహిక జీవనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

* భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలున్నప్పటికిని .. ఆర్ధిక పరమైన విషయాలలో మాత్రం ఇద్దరు ఒకటిగా ఉంటారు.

చాలా మందికి.. మీ సంపాదన మీద తప్ప మీ మీద ఆప్యాయత , మమకారం లేవని, ఉండవని గ్రహించండి.

వ్యాపారాలు మాత్రం బాగుంటాయి.

వ్యాపార విస్తరణకు విశేషంగా కృషిచేస్తేనే అనుకూల ఫలితాలు పొందుతారు.

కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి,

కొత్తగా ఇల్లు కట్టుకోవాలనే విషయంలో ఎక్కువ చొరవ చూపిస్తారు.

రైతులకు పంటలు లాభాదాయంకంగా ఉంటాయి.

చెడ్డవారితో స్నేహం చేయడం వలన .. తెలియక చేసిన పొరపాటుకు ఫలితంగా అపనిందలు వస్తాయి.

ప్రతి విషయంలో కాస్త పట్టు విడుపు దోరని అంటూ ఉండాలి.

కొత్త వ్యాపారంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి.

చెప్పుడుమాటలు విని తోదరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు.

చిన్న చిన్న చిల్లర తగాదాలు ఎక్కువైతాయి జాగ్రత్తలు వహించాలి.

వ్యవసాయ దారులకు రెండవ పంట లాభిస్తుంది.

ఉద్యోగస్తులకు దూర ప్రాంత బదిలీలు జరుగుతాయి.

గ్రహాల ప్రతి కూల వాతావరణం వలన పై అధికారులతో మాట పడవలసి వస్తుంది, తగు జాగ్రత్తలు వహించండి.

వ్యాపారులకు నవంబర్ లో బాగుంటుంది, మిగితా సమయం అంతంతమాత్రమేగానే ఉంటుంది.

రాజకీయ నాయకులు పదవులు పొందుతారు, కానీ మాట అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది.

విద్యార్ధులు విద్య యందు ఆశ్రద్దతో ఎంత మాత్రం ఉండకూడదు. ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

సినిమా రంగం వారికి మామూలుగానే ఉంటుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

English summary
All you need to know about Scorpio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X