వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనురాధ నక్షత్రంలో జన్మించారా: అయితే..

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏ పాదంలోనైనా సరే అనూరాధలో జన్మించిన మహిళలకు స్నేహశీలం, కలుపుగోలుతనం, ప్రసన్న రూపం, భర్తపట్ల అనురాగం, భక్తి, పాతివ్రత్యం, సంపదలు, ఆభరణాలు, సౌమ్య స్వభావం వుంటాయి. అనూరాధలో జన్మించిన పురుషులకు రాజకీయాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఆసక్తి, మంచి రూపం, శౌర్యం, పాపభీతి, మహిళల అభిమానం, పర స్థల నివాసం వుంటాయి.

మొదటి పాదంలో పుట్టినవారు: అనగా సింహ నవాంశలో పుట్టిన వారికి మాటలలో వినయం, మంచి నడవడి, ఇంగితజ్ఞానం, సత్యశీలం, నీతి నియమాలు, దానగుణం, సలహాలివ్వగల విజ్ఞానం, మంత్రశీలం, ధర్మచింతన వుంటాయి.

రెండవ పాదంలో పుట్టిన వారు: కన్య నవాంశలో జన్మించినవారు మేధావులు, సంగీత, సాహిత్య, శిల్ప లలిత కళలలో ఆసక్తి గలవారు. ప్రామాణికులు విద్యా విశారదులు, సంతోషవతులు అవుతారు.

If you are born in Anuradha Nakshatra..

మూడవ పాదంలో పుట్టినవారు: తులా నవాంశలో జన్మించినవారికి అనుకూలవతి అయిన భార్య మంచి తేజస్సు, చక్కని కంఠస్వరం, వివేకం, గణిత, జ్యోతిష, సాముద్రికాలలో మంచి నేర్పు కళాభిరుచి వుంటాయి. స్థిరత్వం లోపిస్తుంది.

నాలుగవ పాదంలో పుట్టినవారు: వృశ్చిక నవాంశలో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలు, కష్టనష్టాల సంభవం. పౌరుష, కోపాలు అధికం దురలవాట్లకు లోనవుతారు. దుష్ట సాంగత్వం, ద్వేష మాత్సర్యాల వల్ల వంచనకు సైతం సంకోచించరు. పట్టుదల అధికం.

English summary
If you are born in Anuradha Nakshatra, your features will be above said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X