వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి ఫలం 2016 జనవరి

By Pratap
|
Google Oneindia TeluguNews

మన్మథనామ సంవత్సరం-పుషదయ శుకదల షష్టీ శుక్రవారంనాడు అనగా 15.1.2016 రోజున ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 2 గంటలవరకూ ఉంటుంది.
త్రిముఖం కృష్ణవర్ణంచ సురూపంచ త్రినేత్రకం|
చతుర్వక్త్రంచ అతి శీర్షం లంబభ్రూ దీర్ఘ నాసికమ్‌ ||
లంబకర్ణం రక్తదంతం మహాఘోర విరూపిణం|
అష్టబాహుంత్రి పాదంచ శామంచ క్రోడవాహనమ్‌ ||
దశయోజనమౌన్నత్యంద్వాదశస్మృతమ్‌ |
ఏవంరూపంతు విజ్ఞేయం సంక్రాంతి పురుషస్యహి||

మిశ్రుడు అనే పేరుగలిగిన ఈ సంక్రాంతి పురుషుడు శంఖపునీటిచేస్నానముచేసి చిత్రాంబరములను ధరించి కుంకుమ గంధం పూసుకొని,పగడపు పూలు వెండి ఆభరణాలు ధరించి రాగిపాత్రలో భక్ష్యములను భుజించి మామిడి పమడ్లను ఫలాహారంగా తిసికొని, వరాహాన్ని ఎక్కి .కత్తి మరియు పింగళ వర్ణంగల గొడుగు ధరించి, తెల్లని పద్మం చేతబట్టి,ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ సిగ్గుతో పైదిక్కుని చూస్తూన్నాడు.

Importance of Sankranthi festival

ఈరకమైన స్థితి వలన దేశంలో గోవులకు కీడు కలుగును,ప్రజలకు ముఖ్యంగా ఉత్తర దిశలో ఉన్నవారికి ఆకలి బాధ, ఉద్ధ భయం కలుగుతుంది. స్త్రీలకు కొంత అశుభం, వెండి ధర పెరుగుతుంది, ఇతరలోహమ విలువలు తగ్గును. ప్రజలకు ఆహారం లోపం కలుగుతుందిఇకానీ ప్రజలు విలాసంగా బతుకుతారు. పరిపాలకులు అంర్గత యుద్ధాలతో కష్టాలు పెరుగి చివరకు శుభాంతమగును. మొత్తంమీద అందరికీ మేలు జరుగుతుంది.

పంచాంగాల ఫలాలు

పక్షఫలం
శుక్లపక్షే యదా పౌషే మకరస్థే దివాకరే|
హాహాకారం జగత్సర్వం దుర్భిక్షమ క్షామడాంబరం||

పుష్య శుక్లపక్షమలో సంరకాంతి ఐనందున, దరిద్రం, బీదరికం, కరవు కలుగుతాయి. తిథిఫలం బట్టి ధాన్యం పెరుగుతుంది, ఫలం బట్టి వ్యాధులు, బీదరికం, దొంగలభయం కలుగును. నక్షత్ర ఫలం - కరువు ; లగ్నాన్ని బట్టి - ప్రళయం ; కాలఫలమగా పక్షుల వృద్ధి తగ్గుతాయి.

సంక్రాంతి నాడు చేయదగ్గవి

తలస్నానం,కొత్తబట్టలు ధరించడం,దేవాలయ దర్శనంచేసుకోవడం
శక్తిని బట్టి చేయదగ్గ దానాలు
పండ్లు,కాంస్య పాత్రలు,ధాన్యం - చేస్తే గ్రహదోషాలు పాపపీడ పోతుంది.
ఫలాలు, దుంపలు, వస్త్రాలు, బంగారం, కూరగాయలు, నువ్వులు, ఆవు - వంటివి చేస్తే ధనలాభం జరుగుతుంది.

- మారుతి శర్మ

English summary
Astrologer Maruthi Sharma explains about the the importance of Sankranthi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X