వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దసరా వైభవం: దాని వెనకాల పురాణ గాథ..

ఈ మాసమందు 'దేవీనవరాత్రులు శరన్నవరాత్రులని పిలుసూ శుద్దపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేసారు.

|
Google Oneindia TeluguNews

దసరా అంటే దన్ + హరా అని; అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు.

సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని "దసరా వైభవం"గా దశమినాడు జరుపుతూ ఉంటారు.

ఇక దేవినవరాత్ర పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్జిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రులు శరన్నవరాత్రులని పిలుసూ శుద్దపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేసారు.

 Importance and significance of Dasara, Vijayadashmi

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్ణాకాత్యాయనేతి
చ సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా,

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే! అలంకారాలు వేరైనా అమ్మ దయ అందిరపట్ల ఒక్కటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి.

ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవార్కి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేసూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు.

శ్రవణానక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు.
దసరాకు మరోపేరు 'దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.
ఈ దేవి నవరాత్ర్యుత్సవాలు జరపడంల్లోకూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు ಮಿ೦ಯಿ వర్షరుతువు ఉంటుంది.

బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంల్లో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెపోంది.

ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు ఋతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని శాస్త్రము.
ఈ సందర్భంగా ఒక్కసారి ఆ దేవీ ఆవిర్భావ విశేషంగూర్చి కొద్దిగా సమీక్షిస్తే .పూర్వం మధుకైటభులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభు లతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోతాడు.

ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటభులను మోహపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఈయమని కోరుకుంటాడు. దానితోవారు తమకు ఇకమరణము తప్పదని నిర్ణయించు కుని తమను నీరులేనిచోట చంపమనికోరతారు.

అంత శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన; మహామాయ పదితలలతో, పదికాళ్ళతో, నల్లనిరూపతో "మహకాళి" గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది.

అనంతరం 'సింహవాహినిగా మహిషాసురుని మహామాయ మహాసరస్వతి రూపిణిగా శుంభ, నిశుంభులను వధించింది. చండ, ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై "నంద" అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది.

తరువాత ఐదవ అవతారంలో ఒక రాక్షసంహారసమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవల్ల "రక్తదంతి" అయినది. లోకాలు అన్ని కరువు కాటకములతో ప్రజలు పడుతున్న బాధలను చూడలేక "శాకంబరి"గా వార్కి శాకాలు, ఫలాలను ఇచ్చి ఆ తల్లి బిడ్డలను అక్కున చేర్చుకుంది.

దురుడను అను రాక్షసుని సంహరించి 'దుర్గ"అను పేరుగాంచింది. "మాతంగి" గా రూపుదాల్చి అంటరానితనాన్ని తొమ్మిదవ అవతారంలో అరుణుడు అను రాక్షసుని తుమ్మెదల సాయంతో హతమార్చి "బ్రామరి" అను పేరు తెచ్చుకుంది. అందువల్ల ఈ దేవిని "నవవిధ రూపాలతో" అర్చించాలి అని చెప్పబడినది. ఆ విధంగా: క్రూరులైన రాక్షసులను సంహరించి ఇటు యోగులకు అటుదేవతలకు ఆనందాన్ని అందించింది

సందర్భములో ఈ దేవి నవదుర్గలుగా అవతరించింది అనగా
1. శైలపుత్రీ 2. బ్రహ్మచారిణీ 3. చండ (ఛన్న) ఘంటా 4. కూష్మాండా 5. స్కందమాత 6. కాత్యాయని 7. కాళరాత్రి 8. మహాగౌరీ 9. సిద్ధిదాత్రి అనుపేర్లతో ఆవిర్భవించినది.

ఈ నవదుర్గలను దేవతలు, భక్తులు స్తోత్రము చేసినారు.
ఈ పరాశక్తి ప్రకృతి. ఈమె సనాతన పురుషునితో కలసి విశ్వసృష్టి చేస్తుంది. ఈమె సకలదేవతా స్వరూపిణి, సృష్టికారిణి. అందుచేతనే ఈమె మహామాయ. జగదుత్పత్తి స్థితిలయకారిణి. శత్రుభయకారిణి ముక్తిదాయని అయినది.

English summary
India is known for its culture and many festivals. Although the country celebrates different types of festivals throughout the year,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X