వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగుల హోళీ రంగోలీ

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

ప్రతి సంవత్సరం భారతీయుల సంప్రదాయం ప్రకారం పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు హోళీ పండుగను జరుపుకుంటాము. రంగుల ఆనందంతో చిన్నా, పెద్ద, మత, వయో బేధం లేకుండా హోళీ ఉత్సవాలను జరుపుకుంటారు. హోళీ పూర్ణిమను కాముని పున్నంగా పిలుస్తుంటారు. ఈ పౌర్ణమికి ముందురోజు రాత్రి అన్ని ప్రాంతాల్లో కాముడి దహానాన్ని గ్రామంలో ఇంటింటి నుండి సేకరించిన పిడుకలతో దగ్ధం చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు.

వసంతోత్సవం ..
ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్ఘుణోత్సవమని, వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాము. మనం కాముని పున్నమ పేరుతో హోళీ వేడుకలను జరుపుకుంటాము. కర్ణాటకలో 'కామన హబ్బ', తమిళనాట 'కామక్ పండిగె' అని పిలుస్తారు. మదనుడి దహనం, ఆయన పునరుజ్జీవనాన్ని పురస్కరించుకుని ఈ వేడుక చేసుకుంటారు. దక్షిణాదికన్నా ఉత్తర భారతంలో హోళీ పండుగకు ఎక్కవ ప్రాముఖ్యం ఉంది.

Indian tradition is celebrating the festival of celebrated Holi

పురాణ గాథ ఇదీ ..?
హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి. దైవకార్య నిమిత్తం యోగ నిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన బాణం ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు తన మూడో కంటిని తెరచి మన్మధుడిని బూడిద చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని వేడుకోవడంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చాడు అలా మళ్లీ మన్మధుడు రతీదేవికి దక్కాడు.

ఇదీ ప్రాశస్త్యం
ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ కూడా ఓ కారణమైందని కొందరు విశ్వసిస్తారు. పూర్వం రఘుమహారాజు కాలంలో హోలిక అనే ఓ రాక్షసి ఉండేదట. అది పసిపిల్లలను సంహరిస్తుండేది. ఒక యోగి సూచన మేరకు ఓ వృద్ధురాలు పిల్లల చేత ఆ రాక్షసిని బాగా తిట్టించిందట ఆ తిట్లు వినలేక హోలిక చనిపోయింది. ఆమెను ఊరి ప్రజలందరూ తగలబెట్టి హోళీ పండుగను జరుపుకున్నారట. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోందని మరికొందరి నమ్మకం.

16 రోజులపాటు వేడుకలు
హోలీ పండుగ పుట్టుకకు మరో కథ కూడా ఉంది. చిన్నారి శ్రీ కృష్ణుడు తన శరీరరంగు రాధ శరీర రంగు మధ్య ఎందుకింత వ్యత్యాసం ఉందని తల్లికి ఫిర్యాదు చేయడంతో యశోద రాధను ముఖానికి రంగువేసుకోమని కోరిందంట. అలా హోళీ ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో ఇప్పటికీ 16 రోజుల పాటు హోళీ వేడుకలను జరుపుకుంటారు.

తపో భంగం ..
మరో కథ కూడా వాడుకలో ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుడిని పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచాలనుకుంటాడు. ఇందులో భాగంగా అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేశాడు. తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేస్తాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు. అయితే భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ ఘటన వలన హోళీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నెన్నో కథలు హోలీ ఆవిర్భావానికి కారణాలుగా చెబుతారు. వసంత ఋతువు శోభకు ప్రకృతి పులకిస్తూ ఉన్న తరుణంలో ప్రజలంతా మహోఉత్సాహభరితంగా ఈ వసంతోత్సవాన్ని జరుపుకుంటారు.

ఆరోగ్య హోళీ!

హోళీ రంగులతో శరీరానికి అనర్థాలు జరగకుండా ఉండాలంటే వాటి ప్రభావం నుంచి కాపాడే సురక్షిత పద్ధతులు అనుసరించాలి. హోలీకి ముందు, తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవీ!
హోళీకి ఒకరోజు ముందు ఒళ్లంతా ఆవ నూనె పూసుకోవాలి. ముఖం, మెడ, కాళ్లు, చేతులు మొదలైన హోలీ రంగులు అంటుకునే ప్రదేశాలకు నూనె పూసుకోవాలి. ఆవ నూనె రంగులు అంటుకోకుండా చర్మానికి రక్షణ కవచంలా పని చేయడంతో పాటు రంగులను తేలికగా వదిలించేటందుకు తోడ్పడుతుంది.

వెంట్రుకలకు కొబ్బరి నూనె పూసుకోవాలి. కొబ్బరి నూనె హోలీ రంగులు కుదుళ్లలోకి ఇంకిపోకుండా కాపాడుతుంది. ప్రత్యామ్నాయంగా లోషన్‌ కూడా వాడవచ్చు. దీంతో కూడా రంగులు అంటుకుపోకుండా ఉంటాయి. వాటిని వదిలించడమూ తేలికవుతుంది.

కళ్లు, ముక్కు భద్రంగా కళ్లలో హోలీ రంగు పొడి పడితే ఎక్కువ నీళ్లతో కళ్లను కడగాలి. హోళీ రోజు తరచుగా కళ్లు కడుగుతూ ఉండాలి. కొద్దిగా గులాబీ నీళ్లు కళ్లలో వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.

చర్మపు ఎలర్జీలకు మార్కెట్లో దొరికే ఎక్కువ శాతం రంగులన్నీ రసాయనాలతో తయారయ్యేవే! కాబట్టి వాటికి బదులు ఆర్గానిక్‌ రంగులు వాడాలి. చర్మం మీద ఏదైనా మార్పు కనిపిస్తే ఈ చిట్కాలు పాటించాలి.

హోళీ ఆటకు వెళ్లే ముందు ముల్తాని మట్టి నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత రంగు అంటుకున్న ప్రదేశాలు కడిగి ముల్తాని మట్టి అప్లై చేస్తే ఎలర్జీలు తలెత్తకుండా ఉంటాయి.సెనగపిండి, స్వీట్‌ ఆయిల్‌, మీగడ, రోజ్‌ వాటర్‌తో చిక్కని పేస్ట్‌ తయారు చేసి ముఖం, చేతులు, మెడ, కాళ్ల మీద అప్లై చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకుంటే చర్మం మీద వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి.

English summary
Every year the Indian tradition is celebrating the festival of celebrated Holi. Holi celebrations are without the religious, and sense of color. Holi Purnima is called a pitcher. On the night of the full moon night, the kama dhana was collected from the house in the village by the pedigrees. Each area is celebrated with a special occasion to celebrate Holi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X