• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Iodised Salt వాడుతున్నారా.. అయితే దీనివల్ల ఎలాంటి హాని కలుగుతుందో చదవండి

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుండి తరతరాలుగా వేల ఏళ్లుగా... సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నారు. అప్పట్లో బీపీలు లేవు, ఒంట్లో ఎముకల నొప్పులు లేవు, థైరాయిడ్ సమస్యల్లేవు... మీకు గుర్తుందా..? ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు బస్తాలు జస్ట్ అలా వదిలేస్తారు, ఎందుకంటే ఉప్పును ఎవరూ దొంగతనం చేయరు ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా ఉండేది.ఆ రోజులు పోయాయి...అంతా సన్న ఉప్పు, అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా జొరబడింది... దొడ్డు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా అంటుకోకుండా ఉండటంతో అందరూ దీన్నే ప్రిఫర్ చేయసాగారు. కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది. ఏళ్లకేళ్లు మనకేమీ పట్టడం లేదు. అదెలా స్టార్టయిందంటే..?

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఐడయోడైజ్డ్ ఉప్పు అలవాటు

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఐడయోడైజ్డ్ ఉప్పు అలవాటు

1986 ప్రాంతంలో... కార్పోరేట్లు సర్కారును అప్రోచయ్యారు... ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు కాబట్టి వారికి అయోడిన్ కలిపిన ఉప్పును అలవాటు చేస్తే ఆరోగ్యవంతులైపోతారు అని చెప్పారు. అధ్యయనాలు లేవు, ముందు జాగ్రత్తలు లేవు, మరి కార్పోరేట్లు కదా సర్కారు వోకే అనేసింది. అయోడైజ్డు ఉప్పు వాడాలి అంటూ సముద్రపు ఉప్పును నిషేధించి పారేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో అయోడిన్ లోపం ఉంటే మరి మిగతా దేశం మొత్తానికీ ఈ నిర్బంధ లవణం దేనికి అని అడిగినవాడు లేడు. రోగికి చెప్పాల్సిన ప్రిక్షిప్షన్ దేశమంతా ఎందుకు వాడాలి అని అడిగిన వాడు లేడు. మరి కార్పొరేటు లాబీయింగు అలాగే ఉంటుంది. కార్పోరేట్లు పెద్ద ఎత్తున కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ ఉప్పు తయారీ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు... మామూలు ఉప్పుకి నాలుగైదు రెట్లు ధర ఎక్కువ చివరకు ప్రజల కూడు నుంచి చౌక ఉప్పును కూడా కాజేసిన దొంగలు.

 ఐయోడైజ్డ్ ఉప్పులో సైనైడ్ అంశాలు

ఐయోడైజ్డ్ ఉప్పులో సైనైడ్ అంశాలు

తరువాత అనేక కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడింది అంటే సముద్రపు ఉప్పు ప్రమాదకరం అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి. మెల్లి మెల్లిగా దీని దుష్ప్రభావాలు అర్థం కాసాగాయి. ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన సైనైడ్ అంశాలుంటయ్ అవి

1) E535 - sodium ferrocyanide,

2) E536 - potassium ferrocyanide,

3) E538 - calcium ferrocyanide.

మరికొన్నీ అనారోగ్య హేతువులుంటాయి. ఇవి బీపీలను పెంచాయి... థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని పెంచేసాయి ... గుండె జబ్బుల్ని పెంచినవి.

ఆయుర్వేద ప్రకారం సైంధవ లవణాన్ని సూచిస్టారు ... కాస్తా ధర ఎక్కువ... ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ... ఇప్పటికీ కిచెన్లలో సైంధవ లవణం లేదా సముద్రపు సహజలవణం మంచిది. నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు... కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్‌ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం... దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టవుతున్నది.

 మంచి ఆరోగ్యం కోసం సముద్రపు దొడ్డు ఉప్పు

మంచి ఆరోగ్యం కోసం సముద్రపు దొడ్డు ఉప్పు

అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, నివారణ చర్యల్లో పడ్డయ్ మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ సముద్రపు ఉప్పు అమ్మడం స్టార్టయింది... పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ... మరేం చేస్తాం..? కానీ రూల్స్ అలాగే ఉన్నయ్... దీనిమీద గత ఏడాది కర్నాటక హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఆరోగ్యం కొరకు వీలైనంత వరకూ దొడ్డు ఉప్పు అనగా సముద్రపు ఉప్పు, సహజ లవణం వైపు మళ్లడం బెటర్... మార్కెట్‌లో బాగానే దొరుకుతున్నది ఇప్పుడు... అయితే నెట్‌లో వెబ్‌సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్... ఏమనీ అంటే..? ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని తప్పు, అలాంటి వాటి జోలికి పోవద్దు... ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది... సైంధవ లవణం అయితే మరీ మేలు ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం... అది రక్తపోటుకు మంచిది కాదు... జస్ట్ వంటలకు తగినంత... వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్.

ఉప్పు కేవలం రుచి కోసమే... ఆరోగ్యం కోసం కాదు... మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది... అందుకని రాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండి. అయోజైజ్డ్ సన్నఉప్పును 20/- పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి.

English summary
Iodised salt contains substances which are harmful to health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X