• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి నష్టమా? తెల్లటి బియ్యం వల్ల ఇవీ నష్టాలు!

|

తెల్లటి బియ్యం తినడం మానండి ..! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి అన్నం ప్రధానమైన ఆహారం. రోజుకు కావాల్సిన శక్తిలో 70 శాతానికిపైగా శక్తిని అన్నమే మన శరీరానికి సమకూరుస్తుంది. మన జీవితానికి అతి ప్రధానమైన అన్నాన్ని మన పూర్వీకులు వడ్లను దంచుకొని తినాల్సివచ్చేది. దంచడంతో పోషక పదార్థాలు ఏవి నశించకుండా అన్నీ మిగిలి ఉండేవి.

ఎప్పటి నుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుంచి బియ్యాన్ని పాలిష్‌ పట్టడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ పాలిష్‌ పట్టడం అనే జబ్బు ముదిరిపోయి, బియ్యాన్ని ముత్యాల్లా మెరిసేట్లుగా పాలిష్‌ పట్టి మరీ తింటున్నారు. తొక్క తీసిన బియ్యం ఎర్రగా ఉంటాయి.

ఈ ఎర్రటి బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పురుగు పడుతుందని, వాటిని తెల్లగా పాలిష్‌ పట్టి దాచుకునేట్లుగా ఏర్పాట్లు వచ్చాయి. పైగా వండుకోవడం తేలిక. నమలకుండా మింగడానికీ తేలిక. బియ్యాన్ని పాలిష్‌ పడితే ఏమవుతుందో చూద్దాం. ఎర్రటి బియ్యాన్ని పాలిష్‌ మరలో పోస్తే, ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది. ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్‌ అంటారు. ఈ పై పొరలో, బియ్యంలో ఉండే అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 50 శాతం వరకూ బయటకు వచ్చేస్తాయి. అవి ముఖ్యంగా 12 రకాల బి విటమిన్లు, విటమిన్‌-ఇ, పీచుపదార్థాలు, లిసిథిన్‌ మొదలైనవి.

ఈ మొదటి పాలిష్‌లో అన్నీ ముఖ్యమైనవి ఉన్నాయి. కాబట్టి ఈ తౌడును మందుల కంపెనీల వారు కొనుక్కొని మందుల తయారీకి వాడతారు. ఈ తౌడునే ఖాళీ గొట్టాలలో పోసి, బలానికి గొట్టాలుగా, గొట్టాన్ని రూపాయికి మనకమ్ముతారు. మొత్తం తౌడునే కాకుండా ఆ గొట్టాలలో నిల్వ ఉండడానికి, రంగుకు, వాసనకు కొన్ని మందులను కలిపి తయారు చేస్తారు. తెల్లటి బియ్యం తిని బి-కాంప్లెక్స్‌ గొట్టాలు వేసుకోవడం ప్రజలకు తేలికగా ఉంది. ఈ మొదటి పాలిష్‌ తౌడును బలానికని పాలల్లో వాడే పొడుల్లో, ఇతర బలవర్దకమైన ఆహార పదార్థాలలో కలుపుతూ ఉంటారు. మొదటి పాలిష్‌ పోగా వచ్చిన బియ్యం కొద్దిగా తెలుపే తప్ప పూర్తిగా తెలుపు రావు. అందుచేత ఈ బియ్యాన్ని మళ్లీ పాలిష్‌ మరలో పోస్తారు. దాంతో పెద్ద పొరను మిల్లులు లేపేస్తాయి.

ఈ సారి తెల్లగా మెరిసిపోతూ వస్తాయి. రెండవసారి వచ్చిన తౌడును (30 శాతం పోషక పదార్థాలుంటాయి) గేదెలకు, ఆవులకు, ఇతర పశువులు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు. ఆ తెల్ల బియ్యాన్ని మాత్రం వాడుకునేందుకు మనం ఉంచుకుంటాం.

తెల్లటి బియ్యంతో నష్టాలెన్నో...

తెల్లటి బియ్యాన్ని ఎన్నో సంత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాం. తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం.

తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం.

తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం.

1. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్‌ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి

2. శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తిన్నందుకు ఎక్కువగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైనవన్నీ వస్తాయి. ఉదాహరణకు మన ఇళ్లలో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల ముసలివారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు, వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. దీనికి కారణం చూస్తే తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తున్నది.

3. పై పొరలో విటమిన్‌ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు.

4. లిసిధిన్‌ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెసా్ట్రల్‌ పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పనిచేస్తుంది. తెల్లటి బియ్యం తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు. గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు.

5. పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేనందువల్ల మలబద్ధకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు.

6. తెల్లటి బియ్యం తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

7. తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతూ ఉంటాయి. నమలనందుకు నోటిలో గానీ, పొట్టలో గాని జీర్ణక్రియ సరిగా ఉండదు.

8. శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని సమకూర్చలేదు. తిన్న 3,4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది.

9. తెల్లటి బియ్యం తినడం వల్ల బి కాంప్లెక్స్‌ గొట్టాలు, బలానికి టానిక్కులు తాగాల్సిన స్థితిని శరీరానికి కలిగిస్తున్నాం.

10. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

11. తెల్లటి బియ్యంలో తేలిగ్గా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలుండవు. తౌడులోకి ఈ కొవ్వు పదార్థాలు వెళ్లిపోతున్నాయి. ఈ ఉపయోగపడే కొవ్వు పదార్థాలు హాని లేకుండా శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. తెల్లబియ్యం తినే వారికి ఈ శక్తి లోపిస్తుంది.

12. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలినిపించే విధంగా చప్పదనముంటుంది.

బలాన్నిచ్చే దంపుడు బియ్యం

బలాన్నిచ్చే దంపుడు బియ్యం

మన పెద్దలు దంపుడు బియ్యం తిన్న బలంతో మనల్ని కన్నందుకు, మనం ఇన్నాళ్లూ ఎన్ని తప్పులు చేసినా ఏ తెల్లటన్నాన్ని తిన్నా ఆ బలం మనల్ని రక్షించింది. మన పిల్లలు మన నుంచి పుట్టారు కాబట్టి మనలో ఉన్న బలం వారిలో లేదు. అలాంటి వారికి మనం పుట్టినప్పటి నుంచి ఆ తెల్ల అన్నాన్ని పెట్టడం వల్ల, ఆ తల్లిదండ్రులకు సేవ చేయాల్సింది పోయి, ఇప్పుడు పిల్లలకే తల్లిదండ్రులు చేసిపెట్టే రోజులు వచ్చాయి. ఇదంతా తెల్లటి బియ్యం చలవే. తౌడుకు 10, 15 రోజుల్లో పురుగులు పట్టేస్తాయి. ముడిబియ్యంలో అయితే 2, 3 నెలకు గానీ పురుగు పట్టదు.

అదే తెల్లటి బియ్యానికైతే

అదే తెల్లటి బియ్యానికైతే

అదే తెల్లటి బియ్యానికైతే 7, 8 నెలలైనా పురుగు పట్టదు. బాగా లాభమున్న ఆహారమేదో సరిగా తెలుసుకొని, పురుగులు వాటికే తొందరగా పట్టి తినడం మొదలు పెడతాయి. పురుగులకు ఏది తినాలో, ఎందులో లాభమున్నదో తెలుస్తున్నది గానీ జ్ఞానమున్న మనిషికి మాత్రం తెల్లటి వాటిని పట్టడం తెలుస్తున్నది. అందుచేతనే మనిషికి అన్నీ ఉన్నా ఆరోగ్యం మాత్రం ఉండటం లేదు.

ఇన్నాళ్లూ తెల్లటి బియ్యాన్ని తింటే తిన్నాం. ఇక మాత్రం మనందరం ఆ తప్పు చేయకుండా ఇంటిల్లిపాది ముడి బియ్యాన్ని తినే మంచి అలవాటు చేసుకుందాం. ముడి బియ్యం అన్నం అరగదనేది అపోహ మాత్రమే. గోధుమలు, రాగులను, జొన్నలను కూడా అన్నంగా వండుకునైనా తినవచ్చు.

డుకొని తినవచ్చు

డుకొని తినవచ్చు

పళ్లు లేనివారు ఎర్రటి గోధుమ రవ్వను వండుకొని తినవచ్చు. విరేచనం బాగా అవుతుంది. తెల్ల గోధుమ రవ్వ అయితే పాలిష్‌ పట్టి ఉంటారు కాబట్టి లాభముండదు. అన్నం బదులుగా రొట్టెలు లేదా మూడు, నాలుగు రకాల గింజలను కలిపి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. పాలిపోయే బియ్యపు అన్నాన్ని తినే సంస్కృతిని పక్కన బెట్టి మంచి బలాన్నందించే ముడిబియ్యాన్నే ముందుచూపుతో వాడుకుందాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is any health problem with this rice?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more