అక్షితలు తలపైనే ఎందుకు వేస్తారు? సైంటిఫిక్ కారణం ఉందా?

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

తలపై అక్షితలు ఎందుకు వేస్తారు?

పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేపుడు పాదాలకెందుకు నమస్కరిస్తాం?

అక్షతలు అంటే మనకందరికీ తెలుసు..

బియ్యంలో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాలలోను మన పెద్దలు మనల్ని అశీర్వదించడానికి మనపై అక్షతలు వేస్తారు.

అయితే ఈ అక్షతలు వెయ్యడం లోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం.

అక్షితలు అంటే క్షతం కానివి అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగనివి అని. అంటే శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట.

akshithalu

అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక,నూనెతో కలిపి అక్షతలు తయారు చేస్తారు.
నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతుంటారు.

ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి
ప్రీతి కరమైన దాన వస్తువు బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.

మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మన పెద్దల నమ్మకం.

అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు.అందుకే అక్షతలను తల పై వేసి ఆశీర్వదిస్తారు.

సైంటిఫిక్‌గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తినిని గ్రహించే తత్వం ఉంది. దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చు తగ్గులు సాధారణం.
ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.

పెద్దలు మనపై అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి.

ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదు

మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా.

తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఈ కారణంగా అక్షతుల ద్వార పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.ఇక పసుపు క్రిమి సంహారకం,పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని మన పెద్దలు అంటారు'అన్నాద్భవన్తి భూతాని'

అని భగవద్గీత లో మూడవ అధ్యాయంలో చెప్పబడింది.

జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే.

పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?

పెద్దల దగ్గర మన ఆశీర్వాదం తీసుకోనేపుడు వారి పాదాలకు నమస్కారించడం మన సంప్రదాయం. అయితే అలా చెయ్యడం లోని అర్ధం మేమిటో తెలుసుకుందాం.

మన శరీరంలో తల ఉత్తర దృవం అయితే పాదాలు దక్షిణ దృవం. వ్యతిరేక దృవాలే ఆకర్షించుకుంటాయి. అప్పుడేగా శక్తి విడుదల అవుతుంది.అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం.

పాద నమస్కారం చేసేప్పుడు వారి పాదాలలోని దక్షిణ దృవం మన తలలో గల ఉత్తర దృవంతో ఆకర్షితంమై శక్తిని వెలువరుస్తుంది.అందుకే మన హిందు సంప్రదాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం. సంప్రదాయలో ప్రతీ దానికి ఏదొక పరమార్దం దాగి ఉంటుంది.మన సంప్రదాయాలను అర్దం లేనివని కొట్టి పారేయకుండా వాటిలోని పరమార్దం తెలుసుకొని ఆచరిద్దాం జై శ్రీమన్నారాయణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+