వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరసావర్కర్ జయంతి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

అఖండ భారత దార్శనికుడు హిందూ రాష్ట్ర సిద్దాంతకర్త, స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ జయంతి సందర్భంగా వారి త్యాగాల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. వీరసావర్కర్ జననం నుండి మరణం వరకు క్షణం క్షణం కణం కణం దేశమాతకే సమర్పణం. వీరి జననం 28 మే1883 సోమవారం ఉదయం 10 గంటలకు నాసిక్ లో జన్మించాడు.

1857వ సంవత్సరంలో మే నెలలోనే మన భారతీయులు ఆంగ్లేయులకు తమ సత్తాను చూపించారు. దేశం లోని ఎన్నో ప్రాంతాల్లో మన సైనికులు, రైతులు అన్యాయానికి విరుధ్ధంగా తమ శౌర్యాన్ని చూపెడుతూ నిలబడ్డారు. దు:ఖపడాల్సిన విషయం ఏమిటంటే, మనం చాలా కాలం వరకూ 1857 సంఘటనలను కేవలం విద్రోహ చర్యలుగా, సిపాయిల తిరుగుబాటుగా చెప్పుకున్నాం. కానీ నిజానికి ఆ సంఘటనని తక్కువగా అంచనా వేయడమే కాకుండా, అది మన స్వాభిమానాన్ని దెబ్బ తీయడానికి చేసిన ఒక ప్రయత్నం కూడా. 1857లో జరిగినది కేవలం విద్రోహం మాత్రమే కాదు, అది మన మొదటి స్వాతంత్ర పోరాటం అని వీర సావర్కర్ గారు మాత్రమే ధైర్యంగా రాశారు.

	its time to revisit sri Veerasavarkar Jayanti today

సావర్కర్ గారితో పాటూ లండన్ లోని ఇండియా హౌస్ లోని వీరులంతా కలిసి ఈ సంఘటన తాలూకూ 50 వ వార్షికోత్సవాన్ని ఆడంబరంగా జరుపుకున్నారు. ఏ నెలలో అయితే మొదటి స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమయ్యిందో అదే నెలలో వీర సావర్కర్ గారి జననం కూడా జరిగింది. సావర్కర్ గారిది అనేక ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిత్వం. శస్త్రాలు, అస్త్రాలు రెండిటినీ ఆరాధించారు ఆయన. మామూలుగా వీర సావర్కర్ గారిని ఆయన వీరత్వానికీ, బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఆయన జరిపిన పోరాటానికి గానూ గుర్తు చేసుకుంటాము. కానీ ఇవన్నీ కాకుండా ఆయన ఒక తేజశాలి అయిన కవి, సామాజిక సంస్కర్త కూడా ఆయన ఎల్లప్పుడూ సద్భావన, ఐక్యత భావాలకి బలాన్నిచ్చారు.

* 12 సంవత్సరాల వయసులో మొదటి మరాఠి పాట వ్రాశాడు.

* జులై 1892 లో తల్లి మరణించింది.

* 1898 లో చేసిన ప్రతిజ్ఞ ఐతే ఛాపేకర్ సోదరుల వలె బలిదానం లేదా ఛత్రపతి శివాజీ వలె హిందూ సామ్రాజ్య ప్రతిష్ఠాపన చేస్తాను.

* 1899లో తండ్రి, పిన తండ్రి ప్లేగు వ్యాధి సోకి మరణించారు.

* 1901లో స్వాతంత్య్రం కోసం రహస్య సంస్థ 'మిత్రమేళా' ప్రారంభం.

1902 లో పదవ తరగతి ఉత్తీర్ణత పొందాడు.

* 1903లో 'ఆర్యన్' వీక్లీ కొత్త పత్రిక ప్రారంభం, పద్యాల రచన 1.శివాజీ హారతి పాట 2. స్వాతంత్య్ర రూపక గీతం.

* 1904 లో రహస్య మిత్ర మేళాను అభినవ భారత్ గా మార్పు.

* విదేశీ వస్త్రాల దహనం చేయటం సావర్కర్ కి 10 రూపాయల జరిమానా, హాస్టల్ నుండి తొలగింపు,

* 1905 లో మగబిడ్డ జననం, ప్రభాకర్ అనే నామకరణం చేసారు.

* 1906 లో ఎల్.ఎల్.బి చదువుల కోసం పుణే ప్రయాణం 'బిహారీ' అను పత్రికకు ఎడిటర్ గా నియామకం.

* మే 1906 లో బాల గంగాధర్ తిలక్ సలహాతో శ్యాంజి క్రిష్ణ వర్మ ఇచ్చే స్కాలర్ షిప్ తో విదేశాల్లో చదువు.

* 9 జులై 1906 భారత్ వదలి ఇంగ్లాండ్ ప్రయాణం, పడవలోనే 'మహాసాగర్' పద్య రచన చేసారు.

* ఇటలీ దేశ స్వాతంత్య్రం కోసం పొరాడిన మెజినీ యుద్దవీరుడి కథా రచన (జులై - సెప్టెంబర్- 1906).

* శివాజీ అనుచరుడైన బాజీ ప్రభు దేశ పాండే పై రూపకం రచన.

* తన ప్రేరణతో మదన్ లాల్ ధింగ్రా అను యువకుడు లండన్ వెళ్లి కర్జన్ వైలీని హతమార్చాడు (జులై- 1906).

జైలులో వున్న ధింగ్రాను కలిసి వచ్చాడు (జులై 22) ధింగ్రాకు మరణశిక్ష (ఆగష్ట్ 11) మహాత్మా గాంధీ సమక్షంలో విజయదశమి రోజున ఉపన్యాసం (అక్టోబర్ 24)

* తన ప్రేరణతో అనంత లక్ష్మణ కన్హరే అను యువకుడు 'జాక్శన్' ఇంగ్లీష్ అధికారిని చంపివెసాడు (21 డిసెంబర్ )

* లండన్ లో ప్రధమ స్వాతంత్య్ర పోరాటం1857, 50 సంవత్సరాల ఉత్సవాలు,

* లండన్ లోని ఇండియా హౌస్ నిర్వహణ బాధ్యత.

* బాంబుల తయారీ వివరాల సేకరణ (1907)

* 1857 స్వాతంత్య్ర పోరాటం చారిత్రక పుస్తక రచన. విప్లవ వీరులకు ఇది భగవద్గీత.ఈయన పుస్తకం చదివిన వారిని 15 సంవత్సరాలు మరియు అండమాన్ జైలు, లండన్ లో శివాజీ జయంతి ఉత్సవాలు జరిపాడు.

* 1857 లో స్వాతంత్య్ర పోరాట గాథలు' పుస్తకం ఇంగ్లీష్ లోకి అనువాదం.

* 21బ్రొనింగ్ పిస్టల్ లు ఒక వంట మనిషి ద్వారా భారత్ కి పంపించారు.

* 1909 లో పుత్రుడు ప్రభాకర్ మరణం,పెద్దన్నయ్య గణేశ్ సావర్కర్ ని అండమాన్ జైలుశిక్ష (యావత్ జీవ కారాగారము) విధించి పంపారు.

* 1910 లో తీవ్ర అనారోగ్యం కారణంగా విశ్రాంతి కోసం ప్యారిస్ ప్రయాణం.

* ప్యారిస్ నుండి తిరుగు ప్రయాణంలో లండన్ లో అరెస్ట్ అయ్యాడు (మార్చ్13).

* జులై 1 న మొరియా స్టీమరులో భారత్ ప్రయాణం.

* జులై 18న సముద్రంలో దూకి,ఈది ఫ్రాన్స్ సరిహద్దులు చేరి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు.

* జులై 22 నాసిక్ , ఎరవాడ జైళ్లో పెట్టారు.

* డిసెంబర్ 24 యావత్ జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ జైలుకి పంపారు. ఆయన ఆస్తులన్నింటిని జప్తు చేశారు.

* 1911, జనవరి 31 రెండవసారి ఆజీవన కారాగార శిక్ష పడింది.జులై 4 అండమాన్ సెల్యులర్ జైల్ కి తీసుకుని వెళ్ళారు.

* 1918 లో అనారోగ్యానికి గురయ్యారు.

* 1919 ఎప్రిల్ లో సావర్కర్ వదిన యశువాహిని మరణం, మే లో తమ్ముడి భార్య 'మాయి' వచ్చి కలిసింది.

* 1921 రంగస్వామి అయ్యర్ కౌన్సిల్ లో సావర్కర్ అనారోగ్యం గురించి లేఖ వ్రాసి విడుదల చేయమన్నారు.

* 1922 హిందూత్వ అను సైద్దాంతిక పుస్తకం వ్రాశారు.

*1923 ఎరవాడ జైలు కి పంపారు.

*1924 లో విడుదల, రత్న గిరి జిల్లా దాట వద్దని నియమాలతో కూడిన బెయిల్ తో విడుదల చేశారు.

* 1924 మహరాష్ట్ర తరఫున 12000 రూపాయలు సమర్పించారు.

* 1925 లో కూతురు పుట్టింది. ప్రభ అని పేరు పెట్టారు. జనవరిలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. హిందూ గణేష ఉత్సవాలు ప్రారంభం చేశాడు.

* 1926 లో 'శ్రద్దానంద' పత్రికలో వ్యాసాలు వ్రాయటం మొదలయ్యింది.

* 1927 లో మహాత్మాగాంధీ సావర్కర్ ని కలవడానికి రత్నగిరికి వచ్చారు.

* అంటరానితనం నిర్మూలనపై నాటకం వ్రాసాడు. 1910 నుండి 1921వరకు అండమాన్ జైల్లో పడ్డ యాతనలు వివరిస్తూ పుస్తకం వ్రాసాడు.

* 1928 కొడుకు విశ్వాస్ జననం.

* 1930లో సామూహిక భోజనాలు 1931 లో పతిత పావన మందిరం నిర్మించారు. ఆ గుడిలో అన్ని వర్గాల వారికి ప్రవేశం కలిపించబడింది.

* 1932 లో ఎవరిదో హత్య గురించి అనుమానంతో మళ్ళీ అరెస్ట్. 1937 హిందూ సభకు అధ్యక్షుడిగా ఎంపిక.

* 1937 న జైలు నుండి విడుదల. ఆయన వ్రాసిన 'కాలాపానీ' పుస్తక ప్రచురణ జరిగింది.

* 1938 మరాఠీ సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడిగా ఎన్నిక. హిందూత్వ గురించి దేశమంతటా పర్యటన.

* అక్టోబర్ లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్య సమాజం చేసే ఉద్యమాన్ని సమర్ధిస్తు భాగ్యనగర సత్యా గ్రహం ప్రసంగం పుణేలో ఇచ్చారు.

* కలకత్తా, మద్రాస్, బీహార్, అమృతసర్, నాగపూర్, బిలాస్ పూర్ పర్యటన.

* 1945 లో అన్న గణేశ్ సావర్కర్ మరణం.

* మే 28 న 68వ పుట్టిన రోజు సందర్భంగా హిందూత్వ కార్యక్రమాలకు 50000 రూపాయలు నిధి సమర్పణ.

* 1946 లో సావర్కర్ వ్రాసిన పుస్తకాలపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేదం ఎత్తివేత.

* 1947 లో స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం చెపుతూ జాతీయ జెండాతో పాటు భగవా ఝండా ఎగరెసారు. స్వాతంత్య్ర లక్ష్మీకి జయ్ అంటూ నినాదం ఇచ్చాడు.

* 1948 ఫిబ్రవరిలో గాంధీజీ హత్యకు సంబంధం లేకున్నా మళ్ళీ అరెస్ట్. 1949 మే 10 న విడుదల చేసారు, అక్టోబర్ 19 తమ్ముడు నారయణ సావర్కర్ మరణం

* 1950 లో మళ్ళీ అరెస్ట్ లియాఖత్ చర్చల పేరుతో.

* 1952లో 10 -12 మే లో విప్లవవీరుల స్మృతికి చిహ్నంగా దేశం లోనే మొదటిసారి పూణె మున్సిపాలిటి స్మారక స్తంభం స్థాపన.

* డిసెంబర్ లో ప్రసంగం 'మతం మారితే జాతీయతను కూడా మార్చుకున్నట్లె 'అని నినదించారు.

* 1954 లో క్రైస్తవుల నుండి హిందు మతంలోకీ శుద్ది కార్యక్రమం ద్వారా హిందువుల పునరాగమనం ఏర్పాట్లు.

* 1962 లో మహారాష్ట్ర గవర్నర్ ద్వారా సావర్కర్ ఇంట్లోనే సన్మానం జరిగింది.

* 1963 లో 'చరిత్రలో ఆరు స్వర్ణ పుటలు' పుస్తకం ప్రచురణ.

* 1965 పాకిస్తాను యుద్దంలో భారత సైన్యం లాహోర్ చేరుకొనేసరికి అత్యంత అనందం వ్యక్తం చేశారు.

*1966 ఫిబ్రవరి 1 న తీవ్ర అనారోగ్యం, ఫిబ్రవరి 26 న స్వర్గస్తులైనారు. ఫిబ్రవరి 27 న పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు.

ఒక సందర్భం ప్రసంగంలో అటల్ బిహారీ వాజ్పయ్ గారు సావర్కర్ గురించి వ్యక్తపరచిన మాటలు. సావర్కర్ గారు అంటే తేజం, సావర్కర్ గారు అంటే త్యాగం, సావర్కర్ గారు అంటే తపస్సు, సావర్కర్ అంటే తత్వం, సావర్కర్ అంటే తర్కం, సావర్కర్ అంటే యవ్వనం, సావర్కర్ అంటే బాణం, సావర్కర్ అంటే కత్తి. అని సావార్కర్ గారి గురించి అటల్ బిహారీ వాజ్పాయ్ గారు సరైన చిత్రణ చేసారు. సావర్కర్ గారు కవిత, క్రాంతి రెండిటితోనూ నడిచారు. ఆయన ఒక సున్నితమైన కవి కావడమే కాక ఒక సాహసవంతుడైన విప్లవకారుడు కూడా.

English summary
it's time to revisit sri Veerasavarkar Jayanti today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X