వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌర్ణిమ: గురువారం పౌర్ణమి తిథి ఎంతో విశేషం

By Srinivas
|
Google Oneindia TeluguNews

28-6-2018 గురువారం పౌర్ణమి తిథి రావడం చాలా విశేషం ప్రత్యేకంగా ఈ రోజు దేవాలయ ప్రదక్షిణ చేయడం వలన గురు అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందవచ్చును. శ్రీ మేధా దక్షిణ మూర్తి, దత్తత్రేయ స్వామి, శిరిడి సాయి బాబా, గురు సంబంధమైన ఏ ఆలయమైనను అనుగ్రహం సంపూర్ణముగా లభిస్తుంది,ముఖ్యంగా విద్యార్థులు,ఉన్నత విద్య అభ్యసించాలని అనుకునేవారు,ఉద్యోగ ప్రయత్నం,చేసేవారు,సంతానప్రాప్తి కావలనుకొనేవారు,ఓకేటమిటి ఏది సంకల్పము చేసిన అది సిద్ధిస్తుంది,ఇది గురువారం పౌర్ణమి కలవడం వలన ఇంత ప్రాముక్యత ఉంటుంది,అందరూ మీకు ఉన్న గురువులను సందర్శించి వారి అనుగ్రహం పొందండి.

శ్లోకం:

పౌర్ణమాస్యాం తథా దర్షే
న రాత్రౌ భోజనం చరేత్ !

Jyeshtha Shukla Paksha, Purnima on Thursday,

ఈశ్లోక భావం ఏమిటి అంటే పౌర్ణిమ,అమావాస్యలలో రాత్రి పూట భోజనం చేయకూడదు.

అలాగే జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది.ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా ఉంటాడు" అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి.

భూలోకంలో జీవించే జీవరాశులకు సూక్ష్మశరీరం లోనూ మనోమయ శరీరంలోనూ ఆనందమయ శరీరంలోనూ పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో సమ్మిళితమైతుంది.

పౌర్ణమి రోజున మనస్సు ధ్యానం చేయుటకు అనుకూలంగా ఉంటుంది.అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వ లోకాలలోని పరమ గురువులు సమాయత్తమయి ధ్యాన సాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు.

ముఖ్యంగా చెప్పాలి అంటే పౌర్ణమిరోజు ధ్యానం చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది.

ఈ విషయంపై ప్రతీ ధ్యానసాధకుడు దృష్టి
సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది

పౌర్ణమి - అమావాస్య రోజులలో ధ్యానం చేయడం వలన"దివ్యశక్తులు" మరియు" దివ్యసూక్తులు" సాధకులు ఊర్థ్వలోకాల గురువుల నుంచి పొందటానికి చక్కటి సదావకాశం లభిస్తుంది.

ఈ రోజుల్లో భూలోకంలోని ధ్యానసాధకుల ఊర్ధ్వ లోకాలలోని గురువుల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి.

English summary
Jyeshtha Shukla Paksha, Purnima on Thursday, june 2018, 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X