వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు శాస్త్రం: శకునాలు అనివార్యంగా చూడాలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

శుభ కార్యాలు తలపెట్టనప్పుడు సమయంతో పాటు శుభఅశుభ శకునాలు కూడా చూస్తారు. శుభ శకునాన్ని గుర్తించడం ఎలా, మంచి శకునం ఏది, అశుభ శకునం ఏది అనేది తెలుసుకోవడం అవసరమని చాలా మంది భావిస్తారు.

అది విశ్వాసానికి సంబంధించింది మాత్రమే బయటకు వెళ్లే సమయంలో ఆకస్మికంగా ఎదురుపడే శకునాలు ఉంటాయని చెబుతారు వాటిలో అశుభ, శుభ శకునాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతారు.

ముత్తయిదువ ఎదురుపడితే శుభం

ముత్తయిదువ ఎదురుపడితే శుభం

మెడలో తాళిబొట్టు, నుదుట కుంకుమతో మంగళవారం ముత్తయిదువ ఎదురుగా వస్తే అది శుభ శకునమని అంటారు. ముత్తయిదవ అయినప్పటికీ వెంట్రుకలు విరబోసుకుని ఎదురుపడితే అమంగళంగా భావిస్తారు. అది అశుభ శకునమని అంటారు.

జంట బ్రాహ్మణులు ఎదురుపడితే..

జంట బ్రాహ్మణులు ఎదురుపడితే..

మంచినీళ్ల బిందె, పాల బిందె, పెరుగు పాత్ర, కల్లుకుం మోసుకుని వచ్చేవారు, వేశ్య, చాకలి, చెరుకు గడలను మోసుకెళ్తున్న వ్యక్తి, జంట బ్రాహ్మణులు ఎదురు పడితే శుభ సూచకంగా భావిస్తారు. అయితే ఒంటరి బ్రాహ్మణుడు ఎదురు వస్తే మాత్రం అశుభ శకునంగా భావిస్తారు.

 పశుపక్ష్యాదుల విషయంలో..

పశుపక్ష్యాదుల విషయంలో..

పశు పక్ష్యాదుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేల, నక్క, గద్ద, ఆవు, జింక, ఉడుత, చిరుతవంటివి ఎడమ నుంచి కుడివైపునకు వెళ్తే శుభశకునాలుగా భావిస్తారు.

 నల్లపిల్లి ఎదురుపడితే.,,

నల్లపిల్లి ఎదురుపడితే.,,

నల్లపిల్లి, ఎండుకట్టెలు, విధవరాలు ఎదురుపడితే అశుభ సూచకంగా భావిస్తారు. మనం బయలుదేరే ముందు ఎవరైనా తుమ్మితే అశుభసూచకంగా పరిగణిస్తారు. ఒక్కటి కన్నా ఎక్కువ తుమ్ములు తుమ్మితే శుభసూచకంగా భావిస్తారు.

English summary
Vashu Sastra explains the bad and good omens. It depends upon the cultures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X