• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గర్భిని స్త్రీ ’జ్యోతిష’ గ్రహ సంబంధం, ప్రభావం: భర్త పాత్ర ఎలా ఉండాలి?

|

-డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: స్త్రీ గర్భం ధరించిన తర్వత నవమాసాలు శిశువుని తన గర్భమున మోస్తుంది.ఆ శిశువు తన తల్లి గర్భంలో ఏ విధంగా ఏ ఏ గ్రహ ప్రభావంచేత ఎదుగుతుందో అనే అంశం గురించి జ్యోతిష గ్రంధాల ఆధారంగా మనకు తెలుస్తుంది. ఖగోళంలో అనేక కోట్ల నక్షత్రాలు,గ్రహాలు,పాలపుంతలు మొదలగునవి ఉన్నప్పటికిని, భారతీయ జ్యోతిష సిద్ధాంత పరంగా గ్రహలను ప్రామాణికంగ పరిగణలోకి తీసుకున్నవి కేవలం ఏడింటిని మాత్రమే.

నవగ్రహాలలో రాహూ,కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తాము.అంటే ప్రధానంగా మనకు ఏడు గ్రహాలు మానవుడిని,భూమిని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉందని మన ఋషులు వారి అనుభవ పరిశోధనల ద్వార వాటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది.

స్త్రీ గర్భం ధరించిన నెల నుండి ప్రసవించే వరకు ప్రతీ నెల ఏ గ్రహ శుభ ప్రభావం చేత శిశువులోని శరీర భాగాలు అభివృద్ధి చెందుతాయో అదే గ్రహం అశుభ దృష్టి వలన ఏమి లోపాలు ఏర్పడతాయో ఈ క్రింద తెలియజేయబడింది.

మొదటి రెండు నెలలు

మొదటి రెండు నెలలు

* మొదటి నెలలో శుక్రుడు మాసాధిపత్యం వలన స్త్రీ,పురుషుల కలయికతో శుక్ర శ్రోణి సమ్మిశ్రమం వలన స్త్రీ గర్భం ధరించుటకు శుక్రుడు కారణం అవుతాడు.అదే శుక్రుడు అనుకూలుడు కానిచో గర్భాధారన జరగదు.

* రెండవ నెలలో కుజుడు మాసాధిపతి. కుజడు మరియు శుక్రుడి ప్రభావం వలన పిండము గట్టిపడును.వీరిద్ధరి శుభ దృష్టి లేకపోతే పిండం గట్టిపడదు.

మూడు, నాల్గు నెలలు

మూడు, నాల్గు నెలలు

* మూడవ నెలలో గురువు ఆధిపత్యం వహించి గట్టిపడిన పిండమునకు అవయవములు(మొలకెత్తును) ఏర్పడును. గురువు అనుకూలుడు కాకపోతే అవయవ భాగాలు ఏర్పడవు.

* నాల్గవ నెలలో సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు.ఈ సూర్యుని ప్రభావంచేత ఎముకలు ఏర్పడతాయి.ప్రతికూలమైతే ఏర్పడవు.

ఐదు, ఆరు నెలల్లో..

ఐదు, ఆరు నెలల్లో..

*ఐదవ నెలలో చంద్రుడు ఆధిపత్యం వహించి చర్మాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రతికూలమైతే ఏర్పడదు.

* ఆరవ నెలలో శని ఆధిపత్యం వహించి వెంట్రుకలను ఏర్పడుటకు కారణం అవుతాడు.ప్రతికూలుడైన వారికి సరైన జుట్టు ఉండదు.

ఏడు, ఎనిమిది నెలల్లో..

ఏడు, ఎనిమిది నెలల్లో..

* ఏడవ నెలలో బుధుడు ఆధిపత్యం వహించి నేంద్రియములు"ప్రాణం"ప్రసాధించి చేతనత్వం కలిగించును.ప్రతికూలుడైతే జీవి ప్రాణం పోసుకోలేక మృతజీవిగా మారటం వలన ఆబార్షన్ అవుతుంది.

- ఎనిమిదవ నెల యందు ఆ నెలకు సంబంధించిన మాసాధిపతి (ఆధాన లగ్నాదిపతి) లేక వారాధిపతి ఫలమును లగ్నధిపతి,చంద్ర,సూర్యుడు అధిపతులై మాస,వార అధిపతుల యొక్క మిత్ర,శత్రు ఫలిత ఆధారంగా వారి కారకత్వ ఫలితాలనిస్తారు. ప్రతికూలులైతే ముందస్తు ప్రసవం జరుగుతుంది శిశువు ఆరోగ్యంపై,భవిష్యత్తుపై నమ్మకాలు తక్కువగా ఉంటాయి.

తొమ్మిది, పది నెలల్లో..

తొమ్మిది, పది నెలల్లో..

* తొమ్మిదవ నెలలో చంద్రుడు ఆధిపత్యం వహించి గర్భంలోని శిశువుని ముందు,వెనకకు కదలికలను కలిగిస్తాడు.ప్రతికూలుడైతే శిశువులో కదలికలు ఉండవు.

* పదవ నెలలో అంటే తొమ్మిది నెలలు పూర్తిగా నిండి పోద్దులు నడుస్తున్న రోజులలో సూర్యనారాయుణుడు అధిపత్యం వహించి సుఖ ప్రసవాన్ని కలిగిస్తాడు.

ఏం చేయకూడదు

ఏం చేయకూడదు

ఈ గర్భస్త స్త్రీ 8,9,10 నెలల సమయంలో గ్రహ గర్భస్ఫుటత్వము కలిగి శిశువునకు ఆకలి దప్పికలను కలిగించి తల్లి గర్భనాళము ద్వారా ఆహారమును తీసుకొనును.ఈ విధంగా జీవునికి,గర్భవతికి మొదటి నెలనుండి పదవనెల వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఎల్లప్పుడు దైవ చింతనతో ఉంటూ మాసాధి పతులగు గ్రహములకు జపశాంతి ధానాదులను వరుసననుసరించి చేసినచో సత్సంతానం కలుగుతుంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలలు నిండిన తర్వత గృహరంభం,సముద్ర ప్రయాణములు,క్షౌరం చేయించుకునుట,శార్ధ (సూతకం ఇండ్లలో) భోజనాలు తినుట,శవలను మోయుట,శవం వెంట నడవడం,నదీస్నానములు,శృంగారం,ఇతరులతో పోట్లాడుట,వివాహం చేయుట,దూరదేశ ప్రయాణాలు చేయుట మొదలగునవి భర్త చేయకూడదు.

ఇష్టమైనవి.. భర్త ప్రేమ

ఇష్టమైనవి.. భర్త ప్రేమ

ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తన భార్యను ప్రేమగా చూసుకోవాలి.తనకు ఏ ఆహారపదార్ధాలపై ఇష్టం ఉంటుందో వాటిని సమకూర్చవలెను.మంచి పోషక విలువలు కలిగిన పాలు,పండ్లు,ఆకు కూరలు,చిరు ధాన్యాల మొలకలు,క్యారెట్ మొదలగు ఆహార పదార్ధాలు తినుటకు ఏర్పాటు చేయాలి.ఇంట్లో ఎల్లప్పుడు శుభ్రత ,ప్రశాంత వాతవరణం,ఆధ్యాత్మీక చింతన దాన,ధర్మ గుణం కలిగి ఉండాలి,ఇలా ఉండ గలిగితే మంచి ఆరోగ్య,ప్రయోజన కరమైన సమాజంలో మంచి పేరు తెచ్చే సత్సంతానం కలుగుతుంది.

-

- డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrologer ahs explained jyotish graha effects on pregnant woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X