వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు, గొప్ప సంఘ సంస్కర్త. మూఢనమ్మకాలపై యుద్దంప్రకటించిన కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో జన్మించారు.

బాల్య వివాహాలు వద్దు ..
బ్రిటిష్ హయాంలో బాల్యవివాహాలు జరుగుతుండేవి. దీనిని నిరసిస్తూ ఆయన పెద్ద ఎత్తున ఉద్యమమే నిర్వహించారు. దీంతోపాటు అనేక సంఘ సంస్కరణలకు పాటుపడ్డారు. సామాజిక దురాచారాల నిర్మూలన కోసం నిరుపమానంగా కృషిచేశారు.

kandukuri veeresha lingam jayanti

ఆధునికాంధ్ర పితామహుడు
సంఘసంస్కర్గా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వారు కందుకూరి. బాల్య వివాహాలు రద్దు కోసం ఉద్యమిస్తూనే .. వితంతు వివాహలు జరిపించాలని కోరేవాడు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపింది ఆయనే.

kandukuri veeresha lingam jayanti

సాహితీరంగంలో విశేష కృషి
సాహితీ వ్యాసంగంలోనూ విశేషంగా కృషిచేశారు కందుకూరి వీరేశలింగం పంతులు. బహుముఖ ప్రజాశాలి అయిన కందుకూరి .. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను కూడా ప్రారంభించారు. తెలుగులో తొలి నవల వ్రాసింది.. మొదటి స్వీయ చరిత్ర రాసింది కూడా ఆయనే. అంతేగాక తొలి ప్రహసనం కూడా కందుకూరి చేతినుంచి జాలువారింది. కందుకూరి జయంతిని నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు.

English summary
He is a great social reformer who has worked for the abolition of child marriage. Veerasalingam is the battlefield of superstitions. He was born on 16 April 1848 in Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X