వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసం పండుగలు: క్షీరాబ్ధి ద్వాదశి రోజు కార్యకలాపాలు

స్వామికి ప్రీతి అయిన నైవేద్యాన్ని నివేదన చేసి వరత కథలను విని ప్రసాదం తీసుకుని బంధుమిత్రులకు భోజనాలు పెట్టి ఉపవాసాది నియమంగా గడిపితేపూర్తవుతుంది.

|
Google Oneindia TeluguNews

ప్రబోధన ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పూర్ణిమ
ప్రబోధన ఏకాదశి 31.10.2017
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసంలో శ్రీ విష్ణు పూజ శివ పూజ శివుడికి అభిషేకములు ప్రత్యేకంగా చేస్తారు. అందరి దేవతలకు ప్రీతిగా లోకంలో ఉపవాసాలు ఉండటం మనకు తెలిసిందే.
ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర లేస్తాడు. కాబట్టి శయనించిన ఏకాదశి శయన ఏకాదశి అని, నిద్రలేచి ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అని పిలుస్తారు.
ఈ నాలుగు నెలలు కూడా వర్షాకాలం గా చాతుర్మాస్యదీక్ష గా నిత్యమూ విష్ణు ఆలయాలలో సంకీర్తనలు తులసి పూజలు చేయ బడతాయి. వైష్ణవులు యతులు ఉద్యాపన వ్రతాన్ని ఆచరిస్తారు.

క్షీరాబ్ది ద్వాదశి 01.11.2017

కార్తీక శుద్ధ ద్వాదశిని తెలుగువారు క్షీరాబ్ది ద్వాదశి గా ఒక గొప్ప పర్వంగా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రపోయి, నిద్రలేచిన స్వామి మొదట బృందావనంలోని తులసివనంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజు బృందావనంలో తులసికోట దగ్గర కూడా స్వామిని పూజిస్తారు.

కార్తీక ద్వాదశి కి గోవత్స ద్వాదశి, విభూతి ద్వాదశి, నీరాజన ద్వాదశి, యోగిని ద్వాదశి, మధన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని అనేకమైన నామాలు ఉన్నట్లుగా చెబుతారు
శ్రీకృష్ణుని దేవేంద్రుడు పాలతో అభిషేకించిన సందర్భంలో గోవిందుడి గా పిలవబడ్డాడు .

KARTHIKA MASAM SIGNIFICANCE AND IMPORTANCE

ఆసమయం గోవత్స అన్నీ కీర్తించి నందున ఈరోజును గోవత్స ద్వాదశి అనే పేరు గా చెబుతారు. విభూతి ద్వాదశి అనగా ఈ రోజు శ్రీ మహావిష్ణువుని కానీ శ్రీ మహా లక్ష్మి కానీ పూజించిన వారికి గొప్ప ఐశ్వర్యము కలుగుతుందని ఈ రోజును విభూతి ద్వాదశిగా చెబుతారు. విభూతి అనగా ఐశ్వర్యము.
యోగిని ద్వాదశి అనగా యోగులు తమ చాతుర్మాస్య దీక్షను పూర్తి చేసిన సందర్భంగా యోగ సిద్ధిని పొందడం చేత ఈ రోజును యోగిని ద్వాదశి అని చెప్పడం జరిగింది.
గోవర్ధన రూపంతో ఉన్న శ్రీకృష్ణుడికి గోపకులందరూ మంగళ హారతులు నీరాజనాలు సమర్పించారు. కాబట్టి ఈ రోజును నీరాజనం ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు.

క్షీరాబ్ధి ద్వాదశి రోజు నాడు చేసే కార్యకలాపాలు:

హిందువుల విశ్వాసం ప్రకారం శ్రీ మహా విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడి తో కలిసి లక్ష్మీ దేవి సమేతంగా బృందావనానికి వస్తాడు అందుకుంటాడు. అక్కడ స్వామి తులసి సమేతంగా సేవించ బడతాడు. కాబట్టి ప్రతి స్త్రీ ఈరోజు తులసిని ఆరాధిస్తుంది. తులసికి హిందూమతంలో అత్యంత ప్రాధాన్యమున్నది.

ప్రత్యక్ష దైవంగా తులసిని పుణ్యప్రదమని లక్ష్మీదేవి అవతారమని చెబుతారు. దేవాలయాలలో ధ్వజస్తంభంమీద ఆకాశ దీపాన్ని ఉంచితే, ప్రతి ఇంటిముందు సాయంకాల సమయంలో తులసికోట దగ్గర ఆకాశదీపం రూపకంగా ఒక దీపాన్ని ఉంచుతారు.
తులసి లో మూడు రకాలు లక్ష్మీ తులసి కృష్ణ తులసి విష్ణు తులసి అని మూడు రకములుగా చెబుతారు.

మొదటిది లక్ష్మీ తులసి దీన్ని అర్చించడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతాయి, రెండవది విష్ణు తులసి దీన్ని పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు తమ ఇంట్లో కొలువుంటారని విశ్వాసము. మూడవది కృష్ణ తులసి ఇది కొంచెం నల్లగా కనబడుతుంది కాని దీనిని పూజిస్తే శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహం పొందుతారని ప్రతీతి.

ఆ తులసిని అర్చించే వారు ఆ తులసిని శ్రీమహావిష్ణువు సమర్పిస్తూ ఈ శ్లోకాన్ని చెబుతారు.
శ్లోకము..

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః

కార్తీక పూర్ణిమ

దీనిని త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఒకానొకప్పుడు ముగ్గురు రాక్షసులు శివప్రీతిగా సహస్ర కమలాలతో అర్చిస్తూ మూడు పువ్వులు లోపం జరగడం చేత తమ తలలను నరికి శివుడికి అర్పించారు. వారి భక్తిని మెచ్చిన శివుడు వారికి ప్రత్యక్షమై బ్రతికించి వరాలని చాడట. ఆ వరంతో ఆ ముగ్గురు రాక్షసులు త్రిపురాసురులు బాధలు పెడుతుండగా మళ్లీ అదే శివుడు వారిని శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసుకుని సంహరించాడు.ఆరోజు కార్తీక పూర్ణిమ.
సత్యనారాయణ వ్రతము

మాఘేవా మాధవే మాసి " కార్తికేవా" శుభేదినే .....అని సత్యనారాయణ వ్రతం లో మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో కానీ చైత్రమాసంలో కానీ మొదలైన పుణ్య తిధుల యందు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే శ్రేష్టమని స్వామి స్వయంగా చెప్పడం వల్ల సత్యనారాయణ వ్రతాన్ని ఈ మాసంలో తెలుగువారు ఎక్కువగా ఆచరిస్తారు.

కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించే విధానం;
ఉదయం లేచి సూర్యోదయానికి పూర్వమే స్నానం సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని, ' సత్యనారాయణ స్వామీ నీ యొక్క అనుగ్రహం కోసం ఈ రోజు వ్రతం చేయదలుచుకున్న' ని సంకల్పించి, సాయంకాలం మళ్ళీ స్నానం చేసి ఈశాన్యంలో వస్త్రాన్ని పరిచి దానిపైన ధాన్యము ఆపైన కలశము నుంచి,

గణపతి, దుర్గా అభయంకరుడు వాస్తు పురుషుడు క్షేత్రపాలకుడు అనే అయిదుగురు పంచలోక పాలకులను పూజించాలి. తరువాత తూర్పున ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని దక్షిణాన యముడు నైరుతికి నైరుతి పడమరకి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి శివుడు మొదలయిన 8మంది దిక్పాలకులను పూజించాలి.
గణపతి గౌరీ గరుత్మంతుడు హనుమంతుడు అనే దేవతలతో కలుపుకొని త్రిమూర్తులను లక్ష్మీనారాయణులనీ పూజించాలి.

స్వామికి ప్రీతి అయిన నైవేద్యాన్ని నివేదన చేసి వరత కథలను విని ప్రసాదం తీసుకుని బంధుమిత్రులకు భోజనాలు పెట్టి ఉపవాసాది నియమంగా గడిపితేపూర్తవుతుంది.

English summary
Of all the auspicious days of the month is the Karthika Masam(Month)which is very Auspicious...!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X