వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది.శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది.ఈ మాసంలో శివ భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు.

పురాణ కాలం నుండి ఈ మాసానికి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.ఈ రోజు నుండే కార్తీకస్నానాలు ప్రారంభం అవుతాయి.వేకువ జామున నిద్రలేచి ప్రవహించే నది,చెరువు,బావినీటితో స్నానం చేసి దైవదర్షణం చేసుకుంటే పుణ్యం,ఆరోగ్య సూత్రం అని ఎక్కువ మంది ఈ కార్తీక స్నానాలకు ప్రాధాన్యతను ఇస్తారు.

Karthika Masam starts from today

హరి హరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్త కోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది.ఈ మాసంలో.పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి,
ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం అంటే ఆ నెల రోజులు పండుగ రోజులే!అందులోను కార్తీకమాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది.దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు.

అలా విశేషార్చనలు జరిపే భక్తులకు భక్తశివుడు ప్రసన్నుడై భక్తుల పాలిట కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు.కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.ఈ మాసంలో చేసేఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేప్పటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ శుభ ఫలాన్ని ఇస్తాయి.

విష్ణువును తులసి దళాలు,మల్లె ,కమలం,జాజి,అవిసెపువ్వు,గరిక,దర్బలతోను,శివుడిని బిల్వ దళాలతోనూ,
జిల్లేడు పూలతోనూ పూజించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి.సత్యనారాయణ స్వామి వ్రతం,
కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు చేస్తే మంచిది.

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమ నిష్టలతో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది.

కార్తీక పౌర్ణమినాడు శారీరక శక్తి కలిగి ఉండి నిష్టతో పగలంతా ఉపవాసముండి. శివాలయంలో రుద్రాభిషేం చేయిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహ లోకంలో సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని
కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

ఈ మాసంలో చేయకూడనివి:- ఇంద్రియ నిగ్రహాన్ని అంతారాయ పరిచే ఉల్లి,
వెల్లుల్లి, మద్యం, మాంసం మొదలగు మాసాల దినినుసులకు దూరంగా ఉండాలి.
ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతర అవసరాలకు ఉపయోగించరాదు.

కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలను తొలగించుకొనుటకు చక్కని తరుణోపాయం అని శాస్త్రాలు సూచిస్తున్నాయి.స్త్రీలు కార్తీక దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్దిస్తున్నాయి.మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకుని సాటి జనులైన పెదవారికి ఎదో ఒక రూపంలో సహాయ పడేందుకు వచ్చిన సదావకాశమే ఈ కార్తీక మాసం. వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.

English summary
Karthika Masam starts from today. Karthika Month 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X