వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తీక మాసం: ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో పర్వదినాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

కార్తీక మాసం అంటేనే ప్రకృతి అహ్లాద పరిచే వాతవరణం ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న ప్రత్యేక పర్వదినాలు, కార్తీక స్నానాలు,వనభోజనాలు, దైవ దర్శనాలు,పూజలు, దీక్షలు,వ్రతాలు,దాన ధర్మాలు మొదలగునవి ఎన్నో ఉంటాయి.మనిషిని సన్మార్గం వైపు నడిపించేది,ఆరోగ్య కరమైన పండగల ప్రత్యేక ఆహారాన్ని అందించేది ఈ కార్తీకమాసం శివకేశవులకు ప్రితికరమైన మాసం ఇది.

శుక్లపక్ష విదియ భాతృ ద్వితీయ

దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి " నాగుల చవితి

కార్తీక శుక్లపక్ష చవితినాడు నాగుల చవితి పర్వదినం జరుపుకుంటారు.

Karthika Masam: The Most Auspicious and Sacred Month

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి

ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీ మహా విష్ణువు ఈ రోజు నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ రోజు ఉపవాస వ్రతం పాటించి శ్రీ మహా విష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.

శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి

పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీ మహా లక్ష్మిని శ్రీ మహా విష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంట్లో ఉన్న తులసికోట వద్ద శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమానురాలైన తులసిని పూజించవలెను.

శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి

వైకుంఠవాసుడైన శ్రీ మహా విష్ణువు ఈ రోజు వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమ శివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను .

శుక్లపక్ష పూర్ణిమ :

ఈ రోజు శివాలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణంను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ, వైష్ణ్వాలయంలో గానీ దీపాలను వెలిగించవలెను. ఈ రోజు ఇంట్లో మరియు గుడిలో 365 వత్తులు దేవుని సమక్షంలో వెలిగించాలి.

కృష్ణపక్ష చవితి : సంకటహర చతుర్ధి

ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.

వృశ్చిక సంక్రమణం16-11-2018 శుక్రవారం :-

ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడు ఈ రోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది.

కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చును.

English summary
Karthika Masam - The Most Auspicious and Sacred Month. It is a month long festival, starting just after Deepavali Amavasya where both Lord Shiva and Maha Vishnu are worshipped and prayed. The month begins from Aswayuja Suklapournami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X