వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేదీ 20 మంగళవారమే కార్తీక శుద్ధ చిలుక ద్వాదశీ వ్రతం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఆషాడ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన శ్రీమన్నారాయణుడు ... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడని అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి పర్వ దినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు.ఈ కార్తీక శుద్ధ ఏకాదశినే " ఉత్థాన ఏకాదశి " ద్వాదశని " ఉత్దాన ద్వాదశి " అంటారు .

కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం .

పురాణ కథలు :-

కృతయుగంలో దేవతలు ,రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే " క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు .
అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుక ద్వాదశి" అని అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి" అని వాడుకలో ఉంది .

శ్రీమహావిష్ణువు శ్రీలక్ష్మీ సమేతంగా బ్రహ్మ , ఇంద్రాది దేవతలతో కలసి బృందావనానికి వెళ్ళారు అంటారు ... అందుకే ఈ రోజుని " బృందావని ద్వాదశి" అని కుడా అంటారు .
బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము) జరిగి బృంద తులసి చెట్టు గాను , విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశ " అంటారు .
క్షీరసాగర మధనము లో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు .
చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశిరోజు వ్రత సమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

Karthika Suddha Chiluka Dwadasi Vratam

ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి.

ఒక దీపాన్ని దానం చేస్తే " ఉప పాతకములు "నశిస్తాయి ,
పది దీపాల్ని దానం చేస్తే " మహా పాతకాలు" నశిస్తాయి ,
వంద దీపాలు దానం చేస్తే " శివ సాన్నిధ్యం" లభిస్తుంది ,
వందకి పై గా దానం చేస్తే " స్వర్గాదిపత్యం" లభిస్తుంది ,

ఈ రోజు దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దాయం , బుద్ధిబలం , దైర్యం , సంపద , కలుగుతాయి . ఈ రోజు స్నానసంధ్యలు చేసాక ,వివిధ వేదమంత్రాలతో గాని , పురుష సూక్తం చేత గాని శ్రద్ధ గా మహావిష్ణువును పూజించాలి .

చిలుకు ద్వాదశి

తులసి పూజ :

- దేవుడు ఏ తప్పు చేసిన అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే . . . పండగలే .
కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అనీ వ్యవహరిస్తారు. గృహిణులు నేడు క్షీరాబ్ధి శయన వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశిరోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. క్షీరాబ్ధిశయన వ్రతంలో తులసినీ, విష్ణువునూ పూజించి దీపారాధన చేస్తారు.

సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీవిష్ణువు పటాన్నిగానీ, విగ్రహాన్నిగానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.

భారతీయ సంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యముంది. దేవతార్చనకు తులసి దళం అతి శ్రేష్ఠం. తులసి మొక్క శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైంది. నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీమహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది.

తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. చిలుకు ద్వాదశి రోజు తులసికోట వద్ద కర్ర పాతి ఆకాశదీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతోంది. ఆరోగ్యదృష్ట్యా తులసి అత్యంత హితమైంది. ఈ మొక్క అతిపెద్దమానుగా ఎదగదు. మూడడుగులు ఎదిగే చిన్న పొద ఇది. పరిమళాలను వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగి దోమలతో పాటు క్రిమికీటకాలు నశిస్తాయి. తులసి ఆకులు, గింజలు, వేళ్లు, కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే!

రెండుకన్నా ఎక్కువ ఆకులు చేరివున్నవాటిని తులసి దళాలు అంటారు. వాటిని నీటిలో ఉంచి తీర్థంగానైనా, నేరుగానైనా వినియోగిస్తే- శరీరంలోని జలుబుకారక రుగ్మతలు తొలగి చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. వివిధ సాంక్రామిక వ్యాధులను తులసి వినియోగంతో నివారించవచ్చు. తులసి మొక్క నుంచి వచ్చే తావివల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసికోట నిర్మించడం ఆచారంగా వస్తోంది.

చిలుకు ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు.కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు, పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ ,శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం.తులసి కళ్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు.

శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింప జేసిన వ్రతం తెలిసిందే. తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథ మరిచిపోలేనిది.కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది.

English summary
Karthika Suddha Chiluka Dwadasi Vratam. The importance of Ksheerabdi Dwadasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X