కార్తీక వ్రతం: వృషోత్సర్జనం

హైదరాబాద్: కార్తీక వ్రతాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము అంటే ఆవు యొక్క కోడెదూడను - అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్చగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు.

ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే, కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడె (ఆవు) దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి.

అలా చేయడం వలన గయా క్షేత్రములో, పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది.

karthika vratham

శ్లో| యః కోవా స్మత్కులే జాతః పౌర్ణమాస్యాంతు
కార్తీకే ఉత్పృజే ద్వృషభంనీలం తృప్రా వయం
త్వితి కాంక్షంతి నృపశార్దూల -- పుణ్యలోక స్థితా అపి.

పుణ్యలోకాలలో వున్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమినాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది గదా!' అని చింతిస్తూ వుంటారు. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమినాడు వృషోత్సర్గమును చేయని వాడు 'అంధతామిస్రము' అనే నరకాన్ని పొందుతాడు.

గయా శ్రాద్ధము వలన గాని, ప్రతివర్గాబ్దికాల వల్లగాని, తీర్థ స్థలాల్లో తర్పణం వల్లగాని ఈ వృపోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరనీ, గయాశ్రాద్ద వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా, వృషోత్సర్గమే ఉత్తమమైనది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+