వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రోజే కార్తీక పౌర్ణమి పండుగ, ఎందుకంటే.. ఇదీ కారణం

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఈ రోజే కార్తీక పౌర్ణమ పండగ జరుపుకోవాలి పంచాంగ రిత్యా ఈ రోజు అనగా 22 నవంబరు గురువారం రోజు పౌర్ణమి ఘడియలు మధ్యాహ్నం 12:54 నిమిషాల నుండి ప్రారంభం అయ్యి రేపటి ఉదయం అనగా శుక్రవారం 11:09 నిమిషాల వరకే ఉన్నది. పౌర్ణమి ఘడియలు అనేది రాత్రి సమయానికి ఏ రోజు ఉంటుందో ఆ రోజే పండగ చేసుకోవాలి.ఈ పండగకు సూర్యోదయంతో సంబందం ఉండదు కావున నేడే శాస్త్రపరంగా కార్తీక దీపారధన పండగ.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు .
ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం.
ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. ఈ
కార్తీక మాసం ముగిసే వరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి దేవతలను పూజిస్తారు. ఈ కారీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు.

కొంత మంది రోజు దేవునికి దీపారాధన చేయలేని వారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తం పూజించిన పుణ్యఫలం ఈ రోజు వత్తులు వెలిగించడం వలన వస్తుంది. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

దీపారాదన అంటే ముక్కోటి దేవతలను పూజించడం

దీపారాదన అంటే ముక్కోటి దేవతలను పూజించడం

కార్తీక పౌర్ణమి నాడు దేవాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే.
సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం.
గురునానక్ జయంతి కూడా ఈరోజే.
ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక నక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి.


పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి.
బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.
అనంతరం గోవునకు గాసం దానం ఇవ్వాలి.
దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు.

365వత్తుల దీపం.
కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి,
సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి.

పరమశివుడిని దర్శించుకున్న ఫలం

పరమశివుడిని దర్శించుకున్న ఫలం

పౌర్ణమి రోజు ఆలయాలలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది.

కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్స్యావతారంలో దర్శనిమిస్తాడు.


కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శరీరం మీద పడటం వల్ల చంద్రకిరణాల ప్రభావంతో నరాలు, కళ్ళు రిలాక్స్ అవుతాయి.
కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి.
ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే
ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.

ప్రత్యేకమైనది కార్తికేయుడికి ప్రత్యేకమైనది

ప్రత్యేకమైనది కార్తికేయుడికి ప్రత్యేకమైనది

కార్తీకేయుడికి
కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైనది.
అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా.
అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు.

మహామృత్యుంజయ మంత్రం.
కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రం జపించాలి.
"ఓం త్రయంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బన్ధనా మృత్యోర్ముక్షీయా మామృతాత్"
అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

సాయంకాల దీపం.
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది.
ముఖ్యంగా ఇంటి ముందు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి శుభం కలుగుతుంది.
దీపం వెలిగించే అవకాశం లేనివాళ్లు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా,మంచి ఫలితం కలుగుతుంది.

 దీపం వెలిగించడం వల్ల కోరికలు తీరుతాయి

దీపం వెలిగించడం వల్ల కోరికలు తీరుతాయి

ఈ రోజు దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి.

కార్తీక పౌర్ణమి నాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి.

ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికాయదానం చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుంది.
ఈ రోజు లలితాదేవిని భక్తితో సహస్రనామాలతో పూజిస్తే
ఆ దేవి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది.


ఈ పవిత్ర దినాన విష్ణుఆలయంలో స్థంబదీపం పెట్టిన వారు శ్రీమహవిష్ణువుకి ప్రీతివంతులవుతారు.
ఈ దీపాన్ని చూసినవారి పాపాలు తొలగుతాయని విశ్వసిస్తారు.

ఈ రోజున ధ్వజస్థంభం పైన నందా దీపం వెలిగిస్తారు.
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు.
శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి.
జ్వాల తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి.
కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.

English summary
Kartik pournami 2018 date and time. Importance of Kartik pournami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X