• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాశీ చరిత్ర.. పుణ్యక్షేత్రాన్ని ఎందుకు నిర్మించారంటే..

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

స్వాతంత్రానికి ముందు చరిత్ర :- 16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి మందిరం నిర్మించాడు. శివ - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది.16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది.

1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయించి మసీదులు నిర్మించాడు. కాశీ నగరం సంస్కృతి పరంగా వెనుకబడింది. ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు పూర్వ వైభవానికి నోచుకున్నాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజుల చేత నిర్మించబడ్డాయి.

Kashi Vishwanath Temple History: Important places to visit

వాతావరణం:- వారాణసి తేమగా ఉన్న వాతావరణం. వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్యఅంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ - అక్టోబరు మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వలన అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతం నుండి వచ్చే చల్ల గాలుల కారణంగా డిసెంబరు నుండి ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46 °C మధ్య, చలి కాలంలో 5° - 15 °C మధ్య ఉంటాయి. సగటు వర్షపాతం 1110 మిల్లీ మీటర్లు చలికాలంలో దట్టమైన పొగ మంచు, వేసవి కాలంలో వడ గాడ్పులు ఉంటాయి.

గంగానది:- గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం మరెన్నో ఆలయాలు, అనేక స్నాన ఘట్టాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. గంగానదిలోని స్నానం అంటే కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం.

స్నాన ఘట్టాలు :- వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతి పలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని అంటారు .

దశాశ్వమేధ ఘాట్ :- కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనది. ఇది యాత్రికులతోను, పూజారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలుదీరి ఉండమని కోరాడని పురానవాక్కు .

ప్రతి రోజూ సాయంకాలం ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయ వినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడ ఉన్న పడవలను రేటు మాట్లాడుకుని ఎక్కాల్సి ఉంటుంది. బోటులో ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూస్తూ ఉంటే నయనానందం కలుగుతుంది. భక్తీ పారవశ్యంతో పొందే మానసిక ఆనందం ఆ అనుభూతి మాటలలో వర్ణించ తరంకాదు.

మణి కర్ణికా ఘాట్ :- మణికర్ణికాఘాటుకు మహా స్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇది .

హరిశ్చంద్రఘాట్‌ :- సత్య హరిశ్చందుడు విధి వశాత్తు "కాటి కాపరి"గా పనిచేసాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి.

ఇతర మతాలు :- బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధన ఉపదేశం చేసాడు. ధమేక స్తూపం అశోకుని కంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థలంలో గౌతమ బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిసాడు అని అంటారు.

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

English summary
Kashi Vishwanath Temple significance: Important places to visit for the citizens, Bhakts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X