వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాల్‌ దర్వాజ "పాతబస్తీ" బోనాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్లో|| ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే|

భాయెభ్య స్త్రహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే ||

మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్), లస్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు.

ఆతరువాత చివరిగా లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాము.

బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు:- బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం. ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా ఆలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.

Know All About Lal Darwaza Bonalu, How it Is Celebrated

ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్, యాంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట ఇది బోణం యొక్క ప్రత్యేకత.

ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు:- మనకు ముఖ్యంగ వాన కాలం ఆషాఢమాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాలా త్వరగ వ్యాపిస్తాయి. వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి, కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది. అందువల్ల ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు.

ఈ ఆషాఢ, శ్రావణమాసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు, ఎందుకంటే వానకాలంలో మహిళలకు అరికాళ్ళు చెడుతయీ ఆయుర్వేద వైద్య ప్రక్రియలో భాగంగా మహిళలు పసుపును కాళ్ళకు పెట్టుకుంటారు. అసలు పండగకు ఆషాఢమాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కనుక ఆ వేపాకులో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రధానంగా వాడుతారు. వేపాకులో ఉన్న ఆయుర్వేద గుణం వలన ఎటువంటి అంటూ వ్యాధులు రావు.

సృష్టించేందుకు జ్ఞానం కావాలి. బ్రహ్మ సరస్వతిని స్వీకరించాడు. పోషించేందుకు ఐశ్వర్యం కావాలి. విష్ణువు లక్ష్మీ దేవిని గ్రహించాడు. లయం చేసేందుకు శక్తి కావాలి. శివుడు పార్వతిని గ్రహించాడు. అలా అమ్మవారు అనేక రూపాల్లో వ్యక్తమైంది. అలాగే సాధారణ ప్రజలు ఎల్లల్ని కాపాడమని అడిగారు. ఆ తల్లి ఎల్లమ్మగా మారింది. పొలిమేరలను రక్షించే పోలేరమ్మగా, బాలాత్రిపురసుందరి బాలమ్మగా, ఈత చెట్లల్లో ఈదమ్మగా, మహిషాసురమర్దిని మైసమ్మగా అనేక రూపాల్లో భక్తుల ఈతి బాధలు తీర్చేతల్లిగా అభివ్యక్తమైంది.

Know All About Lal Darwaza Bonalu, How it Is Celebrated

ఈ అమ్మలగన్న అమ్మ పూజలు గ్రామ దేవతారాధనగా జరుపుతారు. దానినే 'బోనాల పండుగ'గా పిలుస్తారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగగా ప్రజలు జరుపుతారు. క్రీ.శ 1143 జూలై 7న మొదటిసారి. రెండవ ప్రతాపరుద్రుడు గోల్కొండ జగదాంబాలయంలో బోనం సమర్పించినట్లు ప్రతీతి. అలాగే ఓరుగంటి ఎల్లమ్మ మూలంగా ఏర్పడిన వరంగల్లులోని ఎల్లమ్మ బజారు సుప్రసిద్ధం, ప్రాచీనం అని చరిత్రకారులు నిర్ణయించారు. ఓరుగల్లు, అలంపూర్‌లలో మాత్రమే నగ్న రూపంలో ఎల్లమ్మ విగ్రహం కన్పిస్తుంది. అలాగే భవిష్యోత్తరపురాణంలో భూత మాతృ ఉత్సవం, కూడా బోనాల పండుగలాగే ఉంటుంది.

గోల్కొండ రాజుల కాలంలో అక్కన్న మాదన్నలు ఈ ఉత్సవం జరిపినట్లు తెలుస్తున్నది. అలాగే గోల్కొండలో గొల్లలు తరచూ అక్కడున్న ఎల్లమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మలకు బోనం సమర్పించేవారట. ఆ సంప్రదాయం అలాగే కొనసాగి గోల్కొండ ఎల్లమ్మ బోనాలతో మొదలై 'లష్కర్‌ బోనాలు'గా పిలిచే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాలతో ముగుస్తుంది. ఇందులో కొంత మతం, చరిత్ర, రాజనీతి, సామాజిక దృక్పథం కన్పిస్తాయి.

Know All About Lal Darwaza Bonalu, How it Is Celebrated

ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండలో జగదాంబ బోనాలు, రెండవ ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు, మూడవ ఆదివారం లాల్‌ దర్వాజ బోనాలు జరుగుతాయి. అలాగే ఆషాఢ శ్రావణ మాసాల్లో ఆది, మంగళ, శుక్ర వారాల్లో తెలంగాణ పల్లెల్లో గ్రామ కట్టుబాటు ప్రకారం నిర్వహించుకొంటారు. బోనాల్లో ప్రధానంగా ఘటస్థాపన, పోతురాజు, బోనం, శివసత్తులు, రంగం, ఘటం, విందు సంబరాలు, జాతర చెప్పుకోదగిన విశేషాలు. ఆయా దేవతలకు భోజనం సమర్పించడమే బోనం. ఇది చేసేందుకు స్థలశుద్ధి, పాత్ర శుద్ధి, ఆత్మశుద్ధి అవసరం. పుట్టుక నుండి చావు వరకూ మట్టికుండకు మన సంస్కృతిలో ప్రాధాన్యమెక్కువ. ఈ శరీరమే ఓ మట్టికుండ.

బోనం చేసే రోజు స్త్రీలు ఇంటి మధ్య భాగంలో బోనం స్థాపన చేస్తారు. కొత్త కుండకు సగం వరకు సున్నం రుద్ది, మిగతా భాగం పసుపు కుంకుమబొట్లతో అలంకరిస్తారు. ఆ బోనంలో కొందరు బియ్యం, పెసరపప్పు, మరికొందరు బియ్యం, బెల్లం, ఇంకొందరు పెరుగన్నం, పాయసం వండి పెడతారు దానిపై ఓ పిడత (గురిగి) పెట్టి వేపమండలతో అలంకరించి పైన దీపం అలంకరిస్తారు. అది ఆత్మజ్యోతికి ప్రతీక. ఇదంతా అమ్మవారికి సమర్పణే. ఇలా సిద్ధమైన బోనాన్ని బాజాభజంత్రీలతో పోతురాజుల విన్యాసాలు చేస్తుంటే శివసత్తుల పూనకాలతో వెళ్లి అమ్మవారి ఆలయంలో సమర్పిస్తారు. కుండలోని ద్రవ్యం అమ్మవారికి సమర్పించి ఈ కాలంలో వచ్చే రోగాల నుండి రక్షించమని కోరుతారు.

English summary
Know All About Lal Darwaza Bonalu, How it Is Celebrated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X