వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

శనీశ్వరుని చరిత్ర

భారతీయుల జ్యోతిషశాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు' ,నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయా గ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగన మండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది.

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహ రూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యలలో 'ఎనిమిది' శనికి ప్రీతికరమయిన సంఖ్య.

శనీశ్వరుడి జననం

శనీశ్వరుని తల్లిదండ్రులు:

సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినట్టి సూర్యుభగవానుడికి ఛాయదేవికి పుట్టిన సంతానం శనిదేవుడు. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.

శనీశ్వరునికి ఇష్టమైనవి నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము,అశుభ్రంగా ఉండే చోటు, బద్దకంగా ఉండే వారు.

 Know How To Please Lord Shani Dev?

జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు అన్న.యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శనిదేవుడు జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.

నమ్మక ద్రోహం,వెన్నుపోటు,హింస,పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.శని దేవుడి దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,నానా కష్టాల పాలుచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.

శనీశ్వరుడు గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని,అష్టమ శని,అర్ధాష్టమ శని,జన్మరాశి నుండి లగ్నశని,మూడు,ఏడు,పదవ భావలపై శనిదేవుని ప్రభావం పడితే అనేక ఇబ్బందులను కలిగిస్తాడు వాటి నుండి ఉపశమనం పొందడానికి ఈ మంత్రాలను చదువుకుంటే కొంత ఊరట లభిస్తుంది.శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే జప మంత్రాలు:-

* ఓం శం శనయేనమ

* ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః

* కోణస్ధః పింగళ బభ్రు:
కృష్ణో రౌద్రంతకో యమ:
సౌరి శనైశ్చరో మంద:
పిప్పలాదేవ సంస్తుత:

* నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం

తమ్ నమామి శనైశ్చరం

* ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ:

మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని.

శని గాయత్రీ మంత్రం:

-

* ఓం ఖగథ్వజాయ విద్మహే

ఖఢ్గ హస్తాయ ధీమహి
తన్నో మంద: ప్రచోదయాత్.

* ఓం శనైశ్వరాయ విద్మహే
సూర్యపుత్రాయ ధీమహి
తన్నో: మంద: ప్రచోదయాత్

* శ్రీ రామ జయ రామ జయ జయ రామ అని ఎప్పుడు మనస్సులో స్మరించుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది.

తలిదండ్రుల సేవలు చేస్తూ, కుటుంబ కర్త్వవ్య భాద్యతల నుండి తప్పించుకోరాదు.నల్ల ఆవుకు బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.శారీరక పుష్టి ఉన్నవారు శనివారాలలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి.కాకులకు ఉదయం,మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి,బెల్లంతో చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా తుంచి కాకులకు వేయాలి. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.నవగ్రహాలకు ప్రదక్షినలు చేయాలి.రాత్రి ఇంటి ముఖ ద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.అనాథ బాలలకు అన్నదానం చేయాలి.

పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

English summary
Shani or Saturn is the most dreaded graha in astrology. Astrologers believe that all the other planets fail to give any good results if Shani happens to cause obstruction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X