వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవు నుంచి లభించే ఔషధ గుణాలు.. పిడకలో రోగనిరోదక శక్తి ఉందా..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆవు - దాని నుండి మనం పొందుతున్న ఉత్పత్తులు ఎంతో ఔషధీయ తత్వమున్నవి. ఈ విషయం కొన్ని సంవత్సరాలుగా మనకు తెలిసి , అనుదిన అవుసరాలలో ఉపయోస్తూ ఉన్నాము . ఆవు పేడలో మెధాల్, అమోనియా , ఫినాల్ , ఇన్ డాల్ , పార్మాలిన్ వంటి పదార్ధాలు పుష్కలంగా ఉండి రోగ కారక సూక్ష్మ జీవులను నిర్మూలిస్తాయి. అప్పుడే వేసిన ఆవుపేడలొ ఓషదీ గుణాలతో బాటు , రోగ నివారక గుణాలు కూడా వుంటాయి . ఆవు పేడతో చేసిన పిడకలోను , అది కాల్చగా వచ్చిన ధూమంలోను ఎంతో చురుకయిన ఓషదీ యుక్త గుణాలు ఉన్న వనేది ఋజువయిన సత్యం. కొందరు రష్యా శాస్త్రవేతలు చేసిన పరిశోధనలలో ఆవు పేడకు అణు ధార్మికతను నిరోధించే శక్తి వున్నట్లు తెలిసింది.

యజ్ఞంలో ఆవు నెయ్యి కలిపిన బియ్యపు గింజలు అహుతులుగా అర్పించడం జరుగుతుంది ఆయుర్వేద చికిత్స ప్రకారం ఆవు నెయ్యి బలమును కల్గించేది, హృదయానికి ఉత్తేజానిచ్చేదిగా పరిగణిస్తారు . యజ్ఞంలో కరిగి ఆవిరై వ్యాపించిన ఆవు నెయ్యి ఆవిరులు ఎంతో ఉత్సాహాన్ని, మంచి ఆకలిని కల్గించే శక్తి కల్గి ఉండి ప్రకృతి యొక్క చర్యలను సంతులనం చేసేవిగా వుంటాయి . స్వచ్చమైన ఆవునెయ్యి రోగ కారక క్రిములను నిర్మూలించి వాతావరణాన్ని పరిశుద్దం చేయ కలిగే శక్తిని కల్గి వుండి మానవాళికి , జంతు , వృక్ష జాలానికి ఎంతో సహకరిస్తుంది .

know the importance of cow and medicinal properties of cowdung

సూర్యోదయ సమయంలో చేసే " యజ్ఞం " సూర్యోదయానికి 5 నుండి 10 నిమిషాలకు ముందు " అగ్నిహోత్రం " లేదా " యజ్ఞం " జరిపే పాత్రలో బాగా ఆరిన ఆవుపిడకలను అమర్చండి. ముందుగా పాత్ర అడుగు భాగములో ఒక పిడక ముక్కను అమర్చ గుగ్గిలము లేదా కర్పూరము లేదా ప్రత్తిని ఆవు నేతితో తడిపి అడుగున వుంచిన పిడక మీద ఉంచండి. ఆ తరువాత దాని చుట్టూ పిడక ముక్కలు అమర్చుతూ ఆహూతులు సమర్పించేందుకు మధ్యలో ఖాళీ జాగా ఉండేలా చూడండి. ఒక వత్తి ని నేతిలో ముంచి దానిని వెలిగించి ఆవుపిదకపై పెట్టండి. వత్తిని గాని కర్పూరాన్ని గాని వెలిగించండి. అవసరమయితే ఒక విసన కర్రను ఉపయోగించి మంట అంతటా వ్యాపించేలా పిడక ముక్కలన్ని అంటుకునేలా విసరండి.

రెండు చిటికెళ్ళ శుభ్రమయిన చితికి పోని పచ్చి బియ్యం గింజలను ఎడమ అరచేతిలో గాని చిన్న పాత్రలో గాని వేసి రెండు మూడు ఆవు నేతి చుక్కలను వేసి బాగా కలగలిపి రెండు భాగాలుగా విడదీసి ఉంచండి. సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో మొట్ట మొదటి మంత్రమయిన " సూర్యాయ స్వాహా " అని ఉచ్చరించండి . " స్వాహా " అనడం ముగుస్తుండగా విభజించి వుంచిన బియ్యంలో ఒక భాగాన్ని తీసి అగ్నికి అర్పిస్తూ " ఇదం సూర్యాయ ఇదం నమమ " అని మంత్రం లోని మొదటి భాగాన్ని ముగించండి. తరువాత " ప్రజాపతియే స్వాహా " అని చెబుతూ "స్వాహా " అనడం ముగుస్తుండగా రెండవ భాగపు బియ్యాన్ని అగ్నికి సమర్పిస్తూ " ఇదం ప్రజా పతయే ఇదం నమమ" అని మంత్రం లోని రెండవ భాగాన్ని పూర్తి చేయండి. ఇలా అర్పించిన ఆహుతి అగ్నిలో పూర్తిగా అదృశ్యమయి పోయే వరకూ అగ్ని మీదనే దృష్టిని కేంద్రీకరించండి. ఉదయపు యజ్ఞం దీనితో పూర్తవుతుంది .

సూర్యాస్త సమయంలో చేసే " యజ్ఞం " సాయంత్ర సమయం ఉదయం " యజ్ఞం " చేసిన పాత్ర నుండి బూడిదను తొలగించి ఆవుపిడకలను, కర్పూరాన్ని, అమర్చి ఆవు నేతితో కలిపిన బియ్యమును తయారు చేయ్యాలి. కర్పూరాన్ని వెలిగించి ఆవు పిడకలన్ని అంటుకునేలా చేసి ఆహుతులు సరిగా సూర్యాస్తమయ మవుతున్న సమయంలో " అగ్నియేస్వాహా " అని స్వాహా అనడం ముగుస్తుండగా మెదటి భాగం ఆహుతిని సమర్పించి వెంటనే " ఇదం అగ్నియే ఇదం నమమ " అనండి. ఇదే విధంగా రెండవ ఆహుతిని " ప్రజా పతయే స్వాహా " అంటు సమర్పిస్తూ వెంటనే " ఇదం ప్రజా పతయే ఇదం నమమ " అని మంత్రాన్ని పూర్తి చేయండి . ఆహుతులు పూర్తిగా అగ్నిలో కరిగి పోయేంత వరకూ అగ్ని మీదనే దృష్టిని కేంద్రీకరించండి. దీనితో సాయంత్రపు యజ్ఞం ముగిసింది .

తింటు , పడుకుంటూ , నడుస్తూ , నటిస్తూ , రక్త మాంసాలతో కూడుకొని కనిపించే శరీరము " స్థూల శరీరము " ఈ భౌతిక శరీరాన్ని నియంత్రిస్తూ ఆలోచనలు కలుగజేసేది " సూక్ష్మ శరీరము " నమ్మకాలు , కోరికలు , ఆశలు వగైరా లోతుగా పాతుకు పోయిన శరీరం " కారణ శరీరం " లేదా " వ్యోమ శరీరం ( ఆస్ట్ర్లల్ బాడీ ) ప్రపంచంలో ఈ " స్థూల " + " సూక్ష్మ " + కారణ " శరీరాలను ప్రభావితం చేసేది ఈ " అగ్ని హోత్రం " ఒక్కటే .

జపాన్ లోని టోకియోకు చెందిన డా. మోటోహమా మానవ శరీరాన్ని ఆవరించి ఉన్న విద్యుత్ క్షేత్రాలను కొలిచే పరికరంతో యజ్ఞం వలన కలిగే ప్రభావాలను పరీక్షించారు. యజ్ఞం జరిపిన తరువాత మనిషిలోని అనాహత చక్రం ( హృదయ కుహరం ) నుండి వెలువడిన తరంగాలు మానసిక, ఆధ్యాత్మిక విధానాలలో చికిత్స జరిగిన అనంతరం వెలువడే తరంగాలను పోలి ఉన్నాయని తెలియజేసారు. "యజ్ఞ" సమయంలో ఒక మంత్రాన్ని ఉచ్చరించితే దాని శబ్ద శక్తి అపరిమితంగా పెరుగుతుంది. ఎందువల్ల నంటే మంత్రోచ్చారణతో ఉద్భవించిన శభ్ధ తరంగాలు " యజ్ఞ కుండం " లో ఊగిసలాడుతూ వెలుగుతున్న అగ్ని ఏర్పరచిన పలుచని తెరకు తగిలి వెనుకకు ముందుకు అతి వేగంగా కదిలే తరంగాలుగా మారి ఉత్పన్నమయిన ప్రకంపనాల కారణంగాను మంత్రాలలోని శభ్ధ తరంగాలు విశ్వ మందలి వ్యోమ శక్తి కేంద్రం అంటే ఆ శభ్ధాలతో అనుసంధించి ఉండి వాటిని వ్యాపింప జేసే దేవతలతో కలిసి జరిపే సూక్ష్మ పరస్పర చర్యల ఫలితంగాను యజ్ఞాగ్నిలో వేయబడిన పదార్ధాలు ధూమంగా మారే ప్రక్రియకు అను సంధించబడి ఉన్న మూలాధార ఉష్ణ యాంత్రిక ప్రభావాలు యజ్ఞాన్ని నిర్వహిస్తూ సామూహికంగా మంత్రాలను వల్లించే మనుషుల దైహిక , మానసిక , కారణ శక్తుల యొక్క మిశ్రమ ప్రభావము వలన ఇది జరుగుతుంది.

యజ్ఞ సమయంలో యజ్ఞాగ్నిలో సూక్ష్మీకరించబడి ధూమంగా పదార్ధాలు మారుతున్నప్పుడు వెలువడే ఎలాక్ట్రానుల తోపిడి వలన యజ్ఞ కార్యక్రమంలో వల్లించ బడుతున్న మంత్రాలలోని శభ్ధ తరంగాలు సాదారణంగా అవి వ్యాపించే వెడల్పాటి వలయాలుగా కాక ఒక నిడు పైన వలయాకారపు స్ప్రింగు రూపంలో పైకి ఆకశంలోకి పంపబడతాయి. అతివేగంగా కదిలే ఎలక్ట్రానులు నియమిత సమయంలో సామూహికంగా పలికే మంత్రాల ద్వారా ఉత్పన్న మయిన శభ్ధ తరంగాలు ఒక దానితో ఒకటి ఢీ కొన్నందు వలన అవి అయినో స్పియర్ మరి దాని కన్నా పైకి దూసుకు పో గలుగుతాయి. ఈ విధంగా ఒక నియమిత లయతో యజ్ఞ కుండ యందలి అగ్ని ముందు సామూహికంగా ఉచ్చరించబడే మంత్రాల వలన ఒక విలక్షణ తత్వం కల్గిన అంతరిక్షం దాటి విశ్వంలోకి వ్యాపించ గలిగే అంతం లేని వ్యాపక శక్తి కల్గిన శభ్ధ తరంగాలు ఉత్పన్నమవుతాయి.

English summary
We know how important is cow in India. The products that we get from cow are used in medicines also. Cow dung has many medicinal properties and acts as a resistant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X