• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుట్టిన వివరాలు.. రాశిఫలాలు తెలియవా? అయితే జాతకం వివరాలు ఇలా తెలుసుకోవచ్చట!

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పుట్టిన వివరాలు లేనివారు తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవాలని తహతహ లాడుతారు.గోచర గ్రహ స్థితి అనుకూలం లేని సమయంలో ఎలాంటి తరునోపాయాలను పాటిస్తే అనుకూల శుభఫలితాలు వస్తాయో అని సందేహంతో ఉంటారు. అందుకే అలాంటి వారికి జాతక వివరాలు లేని వారికి తమ అనుకూల శాంతులు చేసుకోవడానికి ఈ క్రింద వివరించ బడినది. జాతకం ఉన్న వారు కూడా చేసుకోవచ్చును.

*** వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ, అప్పులు వసూలు కాకుండా ఉండటం జరుగుతుంటే విష్ణు సహస్ర నామ స్తోత్రం" పారాయణం చేయాలి.ఇలా నలుబై ఒక్క రోజులు పారాయణ చేయండి.మీ ఇంట్లో కాని వ్యాపార సంస్థలలో కాని గోమాత సహిత నవశక్తి యంత్రంతో నిర్మితమైన ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం మీరు వ్యాపారం చేస్తున్న స్థలంలో , ఇంట్లో తప్పక ఉండాలి .రోజూ సాయంత్రం వేళ చేస్తే ఇంకా మంచిది . సాయంత్రం దూపం తప్పక వేయండి .చివరి రోజు విష్ణువు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేయించి ఆవునకు అరటిపండు ఇవ్వండి . ఇలా చేస్తే అనేక రకాల భాదలు తొలగి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

Know your Astrology without Birthday details

*** ఆదిత్య హృదయం:- ఇది సూర్యునికి సంభందించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పఠి౦చుట వలన ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను పొందుతారు. మరియూ మనిషిలో దాగిఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది.పాపాలను నాశనం చేస్తుంది. చింతల నుండి, దుఃఖముల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి నిత్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. ఇది పటించిన పిదపనే రాముడు, రావణుని పై విజయం సాదించాడు.

నివారణ మార్గం కొరకు :- గోధుమలతో చేసిన పదార్ధములు,క్యారెట్,రాగి చెంబులోని నీళ్ళను త్రాగటం వలన కూడ సూర్య గ్రహా దోషాలు తొలుగుతాయి.

*** రుణ విమోచక అంగారక ( కుజ ) స్తోత్రం :- జీవితంలో ఎదురైనా అనేక సమస్యలు , ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే మీ ఇంట్లో కాని వ్యాపార సంస్థలలో కాని గోమాత సహిత నవశక్తి యంత్రంతో నిర్మితమైన ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం మీరు వ్యాపారం చేస్తున్న స్థలంలో , ఇంట్లో తప్పక ఉండాలి .రోజూ సాయంత్రం వేళ చేస్తే ఇంకా మంచిది . సాయంత్రం దూపం తప్పక వేయండి . "రుణ విమోచక అంగారక ( కుజ ) స్తోత్రం" నలుబై ఒక రోజులు పారాయణ చేస్తూ , నవగ్రహాలకు రోజూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు ఉపయోగ పడే ఎర్రని వస్త్రం కిలోంపావు కందులు , బెల్లం పెట్టి కుజునకు మీ పేరు మీద అష్టోత్తరం చేయించి ఆ ఆహార పదార్ధాలు అరటి ఆకులో పెట్టి ఆవునకు తినిపించాలి. ఎర్ర వస్త్రాని పేదవారికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే మీ అప్పులకు ఉపశమనం కల్గుతుంది .

*** మీకు వివాహమై ఎంతో కాలమైనా సంతానము కలగడం లేదా ? సంతానం కలుగక పోవడానికి అనేక కారణాలు ( దోషాలు ) ఉదాహరణకు పితృ దోషం ,సర్పదోషం ,గ్రహదోషం మొదలినవి ఇవి గత జన్మనుండి సంక్రమించేవి కుడా ఉంటాయి. మన తప్పిదములే కాదు మన కుటుంబ పెద్దలనుండి కొన్ని దోషాలు వస్తాయి .ఆ దోషం ఎలా ,ఎక్కడి నుండి వచ్చింది అని తెలుసుకోవడానికి మీ పుట్టిన వివరాల ప్రకారం భార్యా భర్తల ఇద్దరి జాతకం రాయించుకుని , జాతకాలలో ఉన్న దోషాన్ని తెలుసుకుని తగిన శాంతి ప్రక్రియలు పాటించండి. తర్వాత ఎక్కడైనా నాగ ప్రతిష్ట చేయిచండి. దోషం ఉన్నంత కాలం డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా పనిచేయవు గమనించండి .

నివారణ మార్గం కొరకు :- " సంతాన గోపాలకృష్ణ వ్రతం" నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంటిలో చేయండి. వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది. సంతానం కలుగుటకు ఇదో మంచి మార్గం .

*** వివాహం ఆలస్యం అవుతుందా ? రుక్మిణి కళ్యాణం పారాయణ చేయండి.

*** రావిచెట్టునకు నలుభై ఒక్క రోజులు రోజు పదకొండు ప్రదక్షిణల చొప్పున చెట్టును తాకకుండా నిధానంగా ప్రదక్షిణాలు చేస్తూ " ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే మత్రాన్ని స్మరించండి . ఇలా చేసి చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి . రావి చెట్టుకు తిరిగే మొదటి రోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి. తప్పక వివాహము జరుగుతుంది . రోజు పంచదార , రాగి చెంబులో నీళ్ళను , ఎర్రని పూలు , అగరోత్తులను తీసుకుని వెళ్ళండి .రిక్త ( కాలి చేతులు ) హస్తాలతో గుడికి , పిల్లలు , వృద్ధులు ఉన్న ఇంటికి , గురువుల దగ్గరకు వెళ్ళేప్పుడు కాలిచేతులతో వెళ్ళకూడదు.

*** ధనమునకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే ధన కారకుడైన సాయి బాబా పారాయణ నలుభై ఒక్క రోజులు చేస్తూ, ప్రతిరోజూ దత్తాత్రేయ మందిరమునకు వెళ్లి ఆలయమును శుభ్రపరుస్తూ ( అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు , అరటి తొక్కలు , ప్రసాదం తిన్న ఆకులు ) దత్తాత్రేయుని దర్శించుకోవాలి . నలుభై ఒకటవ రోజు అరటి పళ్ళు నైవేద్యం పెట్టి పేదలకు పంచండి .ఇబ్బందులు తగ్గిపోతాయి.

*** డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున శివునకు "ఏకన్యాస రుద్రాభిషేకం" చేయండి . అలాగా ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయండి. మీ ధన ఇబ్బందులు తప్పక తొలిగి పోతాయి .

*** ధనాన్ని ఎక్కువ సంపాదించాలి అనుకున్న నిత్యమూ " శ్రీ సూక్తము " పారాయణ చేయవలెను.మీ ఇంట్లో కాని వ్యాపార సంస్థలలో కాని గోమాత సహిత నవశక్తి యంత్రంతో నిర్మితమైన ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం మీరు వ్యాపారం చేస్తున్న స్థలంలో , ఇంట్లో తప్పక ఉండాలి .రోజూ సాయంత్రం వేళ చేస్తే ఇంకా మంచిది . సాయంత్రం దూపం తప్పక వేయండి .

*** హనుమాన్ చాలీసా :- హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్ప వృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతాయి . అటువంటి కల్ప వృక్షం దరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం " హనుమాన్ చాలీసా " ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిరి. ఈ హనుమాన్ చాలీసాను ప్రతి రోజు పదకొండు పర్యాయములు చొప్పున మండలం ( నలుభై రోజులు ) పారాయణం చేసిన సర్వ కార్యసిద్ధి కలుగును. ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పటించిన విశేష కార్యసిద్ధి కలుగును. నిత్యమూ మూడు వేళలా ఒక పర్యాయము చదివిన వారి యోగక్షేమములు భక్త రక్షకుడగు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూచుకొనును.

మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని అనుభవం కలిగిన మంచి జ్యోతిష పండితుని సలహాలను పాటిస్తూ తగిన పరిష్కారం పొందండి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Know your Astrology without Birthday details. One can know their astrology by different ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more