వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణ జన్మాష్టమి: శ్రీకృష్ణుడు అంటే ఎవరు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి

" శ్రీకృష్ణుడు " గా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని
" కృష్ణాష్టమి" , "గోకులాష్టమి" లేదా "అష్టమి రోహిణి" అని పిలుస్తారు.
ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము
శ్రీకృష్ణుడు "దేవకి వసుదేవులకు" దేవకి ఎనిమిదో గర్భంగా " శ్రావణమాసము." కృష్ణ పక్షం అష్టమి" తిథి రోజు కంసుని చెరసాలలో జన్మించాడు.చాంద్రమాన పంచాగం ప్రకారం " శ్రావణ బహుళ అష్టమి " తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు

కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది.

దుష్టశిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు.

మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన.

మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి.

"కృష్ణ" అనగా నలుపు అని అర్ధం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరణలున్నాయి.

విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" అనే నామం రెండు సార్లు వస్తుంది.

అగ్రాహ్యః

శాశ్వతః
కృష్ణో లోహితాక్షః
ప్రతర్దనః

వేధాః

స్వాంగో జితః
కృష్ణో దృఢః
సంకర్షణోచ్యుతః

 Krishna Janmashtami: Nation celebrates birth of Lord Krishna

ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యాన కర్తలు వివిధ భావాలను తెలిపారు,అవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడినాయి.

1.సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.

2.నల్లని వర్ణము కలవాడు. నీలమేఘ శ్యాముడు.

3.తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.

4.నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.

5.కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు.

6.వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు.

7.కానరాని, తెలియరాని, అందజాలనివాడు. సంపూర్ణభక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు.

పోతన వాడిన కొన్ని వర్ణనలు -
నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, సుధారసమ్ము పైజల్లెడువాడు, యదుభూషణుడు, నర (అర్జునుని) సఖుడు, శృంగార రత్నాకరుడు, లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుండు, గోవిందుడు, - పాండవులకు సఖుడు, సారథి, సచివుడు, నెయ్యము, వియ్యము, విభుడు, గురువు, దేవుడు - ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయి.

English summary
Lord Krishna is an important God and is said to be the eighth incarnation of Lord Vishnu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X