వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మి కటాక్షానికి ఏం చేయాలి?: అధర్మం, కంటనీరు సంపదకు అరిష్టాలా?

ఉదయం నిద్ర నుంచి లేవగానే అరచేయిని చూసుకుని కనులకి అద్దుకుంటే శ్రీ సరస్వతీ, శ్రీమహాలక్ష్మీ నారాయణులను పూజించినంత పుణ్యం.

|
Google Oneindia TeluguNews

ఉదయం నిద్ర నుంచి లేవగానే అరచేయిని చూసుకుని కనులకి అద్దుకుంటే శ్రీ సరస్వతీ, శ్రీమహాలక్ష్మీ నారాయణులను పూజించినంత పుణ్యం. అరచేయి ఆ ముగ్గరి నివాసస్థానం. వైకుంఠంలో శ్రీమహాలక్ష్మి స్వర్గంలో స్వర్గలక్ష్మి, భువిపై బంగారంలో శ్రీమహాలక్ష్మి, సాగరంలో కామధేనువు, ఇంకా ప్రతిగృహంలోని ఇల్లాలు కూడా గృహలక్ష్మే.

పోయిన సంపద తిరిగి పొందేందుకు ఉదయం శుచీ, శుభ్రతలతో శ్రీమహాలక్ష్మి జన్మించిన గాథలోని క్షీరసాగర మధనం భాగాన్ని చదివిన వారికి వారి సంపదలతో పాటు మహాసుఖాలు కలుగుతాయని శ్రీదేవీభాగవతం సెలవిస్తుంది. డబ్బు పృధాచెయ్యటం కూడా ధనం నిల్వలేకపోవటానికి కారణం.

మహాత్మాగాంధీ గారు ఓ సందర్భంలో తన కార్యదర్శికి ఇలా చెప్పారు. 'నీవు నాలుగులైన్ల ఉత్తరం వ్రాయటానికి ఓ పేపరూ, కవరూ పోస్టేజీ ఇన్ని చేస్తున్నావు. ఓ కార్డ్ రాస్తే సరిపోయేదానికి?" అని. అలా చెయ్యటాన్ని పొదుపు అంటారు. పొదుపు వేరు, పిసినారితనం వేరు.

Lakshmi Goddess of Wealth & Beauty

అది ఏ రంగమయినా సరే, చదువుకునే చదువు కావచ్చు. చేసే ఉద్యోగం కావచ్చు. వ్యాపారం కావచ్చు. ఆ రంగం మీకిష్టమైతే చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా పనిచేస్తే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
సైకిల్ మీద వక్కపొడి, అగరబత్తులను అమ్మి కూడా, అనగా వారి వారి కిష్టమైన పనులు చేసి ప్రపంచ వ్యాప్తంగా కీర్తినీ, ధనాన్నీ పొందారు.

ఏ సమయాల అస్సలు కంట నీరు పెట్టకూడదు.

ప్రదోషకాలంలో ఏడిస్తే లేదా ఏడిపించినా, శ్రీమహాలక్ష్మి ఏడ్చిన వారి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఏడ్పించిన వాని నుంచి శాశ్వతంగా దూరమవుతుంది. సత్యహరిశ్చంద్రుడి భార్య శైబ్య తన కుమారుడు
రోహితుడు గూర్చి కన్నీరు పెట్టుకుంటుంటే ముదుసలి రూపంలోనున్న విశ్వామిత్రుడు చెబుతాడు ఆ సమయంలో ఏడ్వకూడదని.

అధర్మం చేస్తే వదలిపెట్టవద్దు

అలా చేస్తే మీలా మరో వందమందిని మోసం చెయ్యచ్చు. - అలా చేసిన వారిపై ఆవేశానికి లోనయితే మరీ సమస్యలు. = అసలు అవతల వారికి తెలిసినట్టు వుండకండి. = ధర్మం తప్పినా చట్ట ప్రకారం శిక్షించండి.
నీచుల కోసం దేవుడు పదే పదే జన్మించడు. కొన్నిసార్లు దేవుడు చెయ్యాల్సిన ధర్మకార్యాలను మనుష్యులకి అప్పచెబుతాడు. అది మీరే ఎందుకు కాకూడదు. అలా చేస్తే కీర్తి, ధనం,
సుఖాలు మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తాయి.

శ్రీమహాలక్షి ఎలా కటాక్షిస్తుంది?

ధర్మానికీ, సంపదకూ పుట్టిందే 'దర్ప'మనే దురుణం. ఆ దర్పమే ధర్మాన్నీ సంపదలనూ నాశనం చేస్తుంది. కాన ఆ దురుణాన్ని జయించినవారే మహాసంపదలనూ, కీర్తినీ పొందగలరని ఉతిథ్యుడను మహర్షి బోధించాడు.
ఇవంటే విషువక్ష నివాసికి నచ్చవు " దంతాలతో గోళ్ళు కొరకటమూ, అలాగే దంతాలను కొరుక్కోవటమూ, గడ్డిపోచలనూ నమలటమూ, దోసిలిపట్టి నీళ్ళు తాగటమూ వంటివాటి వల్ల అనారోగ్యం కలిగి ధనం పోతుంది.

ఒకరకంగా చాల భయంకరమైనది పాపపు ధనమే. సంవత్సరాలుగా పగలు ఉన్నా కుటుంబ పర ద్వేషాలున్నా సంవత్సరాల తరబడి ఆ యుద్ధం కొనసాగుతుంది. కానీ ధనం కోసం పగా, ప్రతీకారాలూ, ద్వేషాలూ ఏమీ అక్కరలేదు. నమ్మినవాడే గొంతుకోస్తాడు.

అలాంటి అవకాశం ఇవ్వద్దు. మీ ధనాన్ని బినామీ పేరుతో మీకు నమ్మకమని పెడితే లేదా ఉంచితే మీ ప్రాణానికే ప్రమాదం. డబ్బులిచ్చి మెడ మీదకు తెచ్చుకోవద్దు. డబ్బుకు జగత్తే డబ్బుతో ఏ పనయినా చెయ్యచ్చు. ధర్మన్యాయ కార్యాలూ చేయొచ్చు. పగలూ, ప్రతీకారాలూ తీర్చుకోవచ్చు.

కీర్తిని పొందవచ్చు. సుఖాలను పొందవచ్చు. అన్ని మహిమలున్నదీ, శక్తికలదీ అయిన ధనం ఎంతటి నీచాన్ని అయినా చేయిస్తుంది.
అలా లంచం ఆశ చూపించి మహాధర్మపరుడూ, సత్యవాక్కు పాలకుడూ అయిన త్రిశిరసుడిని కర్మడనే వాడిచేత ఇంద్రుడు చంపించాడు. ఆ ధనంతోనే చ్యవనుడు మహాయజ్ఞం చేసి లోకహితం చేశాడు.

అలా అతి ఆత్మవిశ్వాసంతోనే ఉత్తర కుమారుడు కౌరవుల మీదకి వెళ్తాడు. వారందరినీ చూడటంతోనే యుద్ధరంగం నుంచి పారిపోతాడు. ఉత్తర కుమారుణ్ని రక్షించటానికి అర్జునుడున్నాడు. కానీ మీకు?

English summary
Goddess Lakshmi means Good Luck to Hindus. The word 'Lakshmi' is derived from the Sanskrit word "Laksya", meaning 'aim' or 'goal', and she is the goddess of wealth and prosperity, both material and spiritual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X